Wales
-
స్నూకర్ దిగ్గజం కన్నుమూత.. బస్ట్ కండక్టర్‌గా, పోస్ట్‌మాన్‌గా పనిచేసి.. ఆఖరికి
వేల్స్: బ్రిటన్‌కు చెందిన ప్రపంచ స్నూకర్ మాజీ చాంపియన్, దిగ్గజం టెర్రీ గ్రిఫిత్(Terry Griffiths) కన్నుమూశారు. వయోభార సంబంధిత అనారోగ్య కారణాలతో 77 ఏళ్ల గ్రిఫిత్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కుమారుడు వేన్ తన తండ్రి మరణ వార్తను ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఓ క్వాలిఫయర్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌లోకి అడుగుపెట్టి విజేతగా ఆవిర్భవించిన ఘనత గ్రిఫిత్ సొంతం చేసుకున్నాడు. అదే విధంగా.. 1970 దశకం చివర్లో, 80 దశకంలో మేటి స్నూకర్ చాంపియన్‌గా ఎదిగాడు. 1979లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ‘ట్రిపుల్ క్రౌన్’ గెలిచిన 11 మందిలో గ్రిఫిత్ ఒకడిగా నిలిచాడు. స్నూకర్ క్రీడలో మాస్టర్స్, యూకే చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈ మూడు గెలిస్తే ‘ట్రిపుల్ క్రౌన్’ విజేతగా అభివర్ణిస్తారు. గ్రిఫిత్ ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన మరుసటి ఏడాది 1980లో మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.బస్ కండక్టగా.. పోస్ట్మాన్గారెండేళ్ల తర్వాత 1982లో యూకే చాంపియన్‌షిప్ నెగ్గాడు. సాధారణంగా బిలియర్డ్స్, స్నూకర్ ఆడేవాళ్లంతా సంపన్నులే ఉంటారు. కానీ గ్రిఫిత్ మాత్రం సాధారణ వ్యక్తి. 15 ఏళ్ల వయసులో గనుల్లో పనిచేశాడు. తదనంతరం బస్ కండక్టర్, ఇన్సురెన్స్ ఏజెంట్, పోస్ట్మన్గానూ బతుకుబండి లాగించాడు. 1978లో ప్రొఫెషనల్ స్నూకర్ ప్లేయర్‌గా ఎదిగాడు. ఆ మరుసటి ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతో గ్రిఫిత్ రాత మారిపోయింది. -
‘ఈ క్షణంలో జీవించటం నేర్చుకో’.. ! మనీషాకు యువరాణి రాసిన మందు చీటీ
మందు మనిషి మీద పనిచేస్తే, మాట మనసు మీద పనిచేస్తుంది. ’మందు చీటీ’ వంటిదే ఒక మంచి మాట. చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ‘నీకు తప్పక నయం అవుతుంది‘ అనే మాట ఎలాగైతే దివ్యౌషధంలా మనసుపై పని చేస్తుందో, కోలుకుని తిరిగి వచ్చాక ‘వెల్డన్ ఛాంపియన్‘ అనే మాట కూడా గొప్ప సత్తువను, ఉత్సాహాన్ని ఇస్తుంది.వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నుంచి మనీషా కోయిరాలాకు ఇటీవల ఒక ఉత్తరం వచ్చింది! ‘కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మీరూ ఒకరని నాకు తెలిసింది. చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మీరు మునుపటిలా మీ ప్రొఫెషన్ ని కొనసాగించటం, చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది..‘ అని ఆ ఉత్తరంలో రాశారు కేట్. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా కేన్సర్ నుంచి బయట పడినవారే! ప్రివెంటివ్ కీమోథెరపీతో ఆమె ఈ ఏడాదే కేన్సర్‌ను జయించారు.యువరాణి రాసిన ఉత్తరం మనీషాకు తన జీవిత లక్ష్యాలలో మరింతగా ముందుకు సాగేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చింది. ‘నేను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు నాకు ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడ్డం నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఈ విషయంలో (క్రికెటర్) యువరాజ్ సింగ్ కి, (నటి) లీసా రే కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లలాగే ఇతరులకు ధైర్యం చెప్పటం, నయం అవుతుందని నమ్మకం ఇవ్వటం ఇక పై నా వంతు... ‘ అంటున్నారు మనీషా.నాల్గవ స్టేజ్‌లో ఉండగా 2012 లో మనీషా లో ఒవేరియన్ కేన్సర్ ను గుర్తించారు వైద్యులు. ఐదేళ్ల చికిత్స తర్వాత 2017 లో మనీషా కేన్సర్ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచీ ఇండియా, నేపాల్ దేశాలలో కేన్సర్ కేర్ కోసం పని చేస్తున్నారు. ‘యువరాణి వంటి ఒక గొప్ప వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఇలా లేఖ రాయటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేన్సర్ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి మరింతగా శక్తిని ఇచ్చింది‘ అంటున్న మనీషా, కేన్సర్ తనకొక పెద్ద టీచర్ అని చెబుతున్నారు.‘కేన్సర్ నన్నెంతగా బాధించినప్పటికీ ఎంతో విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పింది. ’ఆశను కోల్పోకు, మంచి జరుగుతుందని నమ్ము. ఈ క్షణంలో జీవించటం నేర్చుకో. నీకు సంతోషాన్నిచ్చేవి ఏవో కనిపెట్టు..’ అని ఆ టీచర్ నాకు చెప్పింది..‘ అంటారు మనీషా.. కేన్సర్ గురించి. -
సర్జరీ తర్వాత కెమెరా కంటపడిన బ్రిటన్ యువరాణి?
బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన కోడలు కేట్ మిడిల్టన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటి మధ్య కేట్ మిడిల్టన్ మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. కేట్ మిడిల్టన్ ఇటీవల తన భర్త ప్రిన్స్ విలియమ్‌తో కలిసి లండన్ సమీపంలోని విండ్సర్ ఫార్మ్స్ లో కనిపించారు. బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం కేట్ మిడిల్టన్ ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె బహిరంగంగా కనిపించడంపై బ్రిటిష్ మీడియా హర్షం వ్యక్తం చేసింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ షాపింగ్ చేస్తూ కనిపించారు. దీనిపై బ్రిటన్ మీడియా సంతోషం వ్యక్తం చేస్తూ ‘కేట్.. మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది’ అని రాసింది. కొన్ని మీడియా సంస్థలు ఈ జంటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఒక క్రీడా కార్యక్రమానికి కేట్ మిడిల్టన్ తన భర్త, ముగ్గురు పిల్లలతో పాటు హాజరయ్యారని ఓ బ్రిటిష్ వార్తాపత్రిక పేర్కొంది. కేట్ మిడిల్టన్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కారణంగా ఆమె గత ఏడాది చివరి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల మదర్స్ డే సందర్భంగా కేట్ మిడిల్టన్ ఫోటో రివీల్ అయ్యింది. అయితే అది వివాదాస్పదంగా మారింది. అప్పటి నుండి మిడిల్టన్ ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. దీనికితోడు బ్రిటిష్ రాజభవనమైన కెన్సింగ్టన్ ప్యాలెస్‌లోని పలువురు ఉద్యోగులు తాము కేట్‌ను చాలా రోజులుగా చూడలేదని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. I edited the video to enhance the image quality, and it's definitely #PrincessCatherine in the footage.#RoyalFamily #PrincessofWales pic.twitter.com/4yOdGwQ0Vm — Royal Gossip 🇬🇧 (@UKRoyalGossip) March 19, 2024 -
కంపెనీ డబ్బులు రూ.21 లక్షలు కొట్టేసి ఏం చేశాడో తెలుసా?
లండన్: యూకేలో వేల్స్ కు చెందిన ఒక నిర్మాణ కంపెనీలో పనిచేస్తోన్న థామస్ స్టైల్స్(25) అశ్లీల చిత్రాలకు బానిసై వాటిని కొనుగోలు చేసేందుకు తాను పనిచేస్తోన్న చోట అక్రమాలకు పాల్పడ్డాడు. కంపెనీ బిల్లల మొత్తాన్ని ఇష్టానికి మార్చుకుంటూ సుమారు రూ. 21 లక్షలు దోచుకున్నాడు. థామస్ స్టైల్స్(25) అట్లాంటిక్ క్లాడింగ్ అనే ఒక నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే తన ప్రతిభకు మెచ్చుకుంటూ మేనేజరుగా కూడా ప్రమోషన్ ఇచ్చింది కంపెనీ. ఆనతి కాలంలోనే వ్యాపార లావాదేవీల తాలూకు ఆర్ధిక చెల్లింపులు చేసే స్థాయికి ఎదిగాడు. మనిషి ఎదిగినప్పుడే బుద్ధి గడ్డి తింటుందన్నట్టు మంచి ఉద్యోగం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా తనకున్న వ్యసనానికి కంపెనీ డబ్బును పాడుచేశాడు. అశ్లీల వెబ్ సైట్ల మాయలో పడి తాను పనిచేస్తోన్న కంపెనీలో భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా బిల్లులు పెంచుకుంటూ పోయి తన పిచ్చిలో తాను మునిగి తేలేవాడు. అంతలో పెరుగుతున్న బిల్లులను చూసి కంపెనీ వారికి అనుమానం రావడంతో తీగ లాగారు. డొంకంతా కదిలింది. మే 4 నుంచి జులై 31, 2021 వ్యవధిలో మొత్తం బిల్లుల అక్రమాలను లెక్క వేయగా సుమారు రూ. 21 లక్షలుగా తేలింది. అంత మొత్తాన్ని ఏం చేశాడని ఆరా తీయగా విషయం తెలుసుకుని నివ్వెరపోయిన కంపెనీ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. కంపెనీ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు న్యాయస్థానం థామస్ ను దోషిగా తేల్చి మొదట 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని భావించింది. కానీ జడ్జి దయ తలచి శిక్షను 10 నెలలకు కుదించారు. నెలకు 500 పౌండ్ల చొప్పున కంపెనీకి తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చారు. ఇది కూడా చదవండి: బెలారస్ లో వాగ్నర్ సైన్యం.. అంతా ప్లాన్ ప్రకారమే..? -
వేల్స్‌పై టీమిండియా ఘన విజయం.. అయినా ఖరారు కాని క్వార్టర్స్ బెర్త్
ఒడిశా వేదికగా జరుగుతున్న పురుషుల హాకీ వరల్డ్‌కప్-2023లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ దిశగా ఆడుగులు వేస్తుంది. పూల్-డిలో ఇవాళ (జనవరి 19) వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 4-2 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి, క్వార్టర్స్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. పూల్-డిలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా) నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. రెండో స్థానంలో నిలిచిన భారత్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా).. పూల్-సిలో మూడో ప్లేస్ ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్ ఓవర్ మ్యాచ్ (ఆదివారం) ఆడి గెలవాల్సి ఉంటుంది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ సింగ్ 2 గోల్స్ చేయగా.. షంషేర్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ తలో గోల్ సాధించారు. వేల్స్ తరఫున గ్యారెత్ ఫర్లాంగ్, జాకబ్ డ్రాపర్ చెరో గోల్ చేశారు. -
రికార్డుల్లో లేని సొరంగం.. ఎక్కడుందో తెలుసా..?
వేల్స్ నైరుతి ప్రాంతంలోని సైమర్లో మూతబడిన రైల్వే సొరంగం ఇది. పంతొమ్మిదో శతాబ్ది చివరిభాగంలో నిర్మించిన ఈ సొరంగం పేరు ‘గెల్లీ హౌసెస్ రైల్వే టన్నెల్. దీనిని సిడ్నీ విలియం యాక్నీ అనే ఇంజినీరు 1882లో నిర్మించాడు. దీని గుండా 1890 జూలై 2న తొలి రైలు ప్రయాణించింది. దీని గుండా రైళ్ల రాకపోకలు సాగిన కాలంలో ఇది రోండా లోయలోని సైమర్–బ్లేంగ్విన్ఫీ ఊళ్ల నడుమ దగ్గరి దారిగా ఉండేది. ఈ సొరంగం గుండా 1960లో చివరి రైలు ప్రయాణించింది. ఆ తర్వాత ఇది మూతబడటంతో అప్పటి అధికారులు దీని చుట్టూ కంచె నిర్మించారు. తర్వాత వచ్చిన అధికారులు ఈ సొరంగం ఉన్న సంగతే మరచిపోయారు. ఇటీవల ఒక వ్యక్తి ఈ సొరంగంలో సినిమా తీయడానికి అనుమతి కోరుతూ అధికారులకు దరఖాస్తు చేయడంతో, అసలు దీనికి సంబంధించి ఎలాంటి రికార్డులూ లేని విషయం బయటపడింది. దాంతో హుటాహుటిన అధికారులు సొరంగాన్ని తనిఖీ చేసేందుకు బయలుదేరారు. జనసంచారానికి ఇది ఏమాత్రం సురక్షితంగా లేదని నిర్ధారించి, సినిమా షూటింగ్‌కు అనుమతి నిరాకరించారు. -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ అజేయంగా...
ఐదున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి దశను సాఫీగా అధిగమించింది. కనీసం ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం ఉన్నా... ఈ మాజీ చాంపియన్ మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో భారీ విజయం నమోదు చేసి గ్రూప్ దశను అజేయంగా ముగించి తమ గ్రూప్ ‘బి’లో ‘టాపర్’గా నిలిచింది. అల్ రయ్యాన్ (ఖతర్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 13వసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ 3–0 గోల్స్ తేడాతో వేల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున మార్కస్ రాష్‌ఫోర్డ్ (50వ, 68వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఫిల్ ఫోడెన్ (51వ ని.లో) ఒక గోల్ అందించాడు. 1958లో తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్ చేరిన వేల్స్ 64 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు రెండోసారి అర్హత సాధించినా ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటలేకపోయింది. వేల్స్‌తో కనీసం ‘డ్రా’ చేసుకున్నా తదుపరి దశకు అర్హత పొందే అవకాశమున్నా ఇంగ్లండ్ మాత్రం విజయమే లక్ష్యంగా ఆడింది. అయితే వేల్స్ డిఫెండర్లు గట్టిగా నిలబడటంతో తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఖాతా తెరువలేకపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చి ఫలితం పొందింది. 18 నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ సాధించి వేల్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చేసింది. 50వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను రాష్‌ఫోర్డ్ నేరుగా వేల్స్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీపై పెనాల్టీ షూటౌట్లో తన షాట్‌ను గోల్‌గా మలచలేకపోయిన రాష్ఫోర్డ్కు గత రెండేళ్లుగా ఏదీ కలసి రావడంలేదు. నల్ల జాతీయుడు కావడంతో స్వదేశంలో అతనిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వేల్స్‌పై రాష్‌ఫోర్డ్ రెండు గోల్స్‌తో రాణించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి గోల్ అయ్యాక నిమిషం వ్యవధిలోనే ఇంగ్లండ్ ఖాతాలో రెండో గోల్ చేరింది. కెప్టెన్ హ్యారీ కేన్ క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఫిల్ ఫోడెన్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం 68వ నిమిషంలో రాష్‌ఫోర్డ్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యం 3–0కు పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన మూడో గోల్ ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు 100వ గోల్ కావడం విశేషం. 92 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో 100 గోల్స్ మైలురాయిని అందుకున్న ఏడో జట్టుగా ఇంగ్లండ్ గుర్తింపు పొందింది. ‘బి’ గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సెనెగల్ జట్టుతో ఆడుతుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇదీ ఆటంటే.. ఆఖరి నిమిషంలో రెండు గోల్స్; ఇరాన్ సంచలనం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్ తమ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇరాన్ ఆఖరి నిమిషంలో జూలు విదిల్చి 2-0 తేడాతో వేల్స్‌ను చిత్తు చేసింది. వేల్స్ ఆటగాళ్ల అలసత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న ఇరాన్ ఆట అదనపు సమయంలో వరుసగా రెండు గోల్స్ చేసి సంచలన విజయం సాధించింది. తొలి అర్థభాగం గోల్ లేకుండా ముగిసింది. తొలి అర్థభాగంలో ఇరాన్ వేల్స్ గోల్‌పోస్టుపై పదేపదే దాడి చేసింది. ఒక దశలో మూడుసార్లు గోల్ కొట్టే చాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. అలా తొలి అర్థభాగం ముగిసింది. రెండో అర్థభాగంలోనే అదే పరిస్థితి. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్ చేయడంలో విఫలం కావడంతో మరో డ్రా అనుకుంటున్న దశలో ఇరాన్ జూలు విదిల్చింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆట 90+9వ నిమిషంలో రూబెజ్ చెష్మీ ఇరాన్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత కాసేపటికే రమిన్ రిజెయిన్ కూడా గోల్ కొట్టడంతో ఇరాన్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంతలో అదనపు సమయం ముగియడంతో ఇరాన్ విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఇరాన్ 2-6 తేడాతో ఓడిపోయింది. తాజాగా వేల్స్‌ను ఓడించి రౌండ్ ఆఫ్ 16 ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి మ్యాచ్ డ్రా చేసుకున్న వేల్స్.. తాజాగా ఇరాన్ చేతిలో ఓడి ప్రి క్వార్టర్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. -
FIFA WC: రికార్డులు ఎవరికి కావాలి.. ఇరాన్‌ను ఓడించకపోతే మేం ఇంటికే!
వేల్స్ సీనియర్ ఆటగాడు గారెత్ బేల్ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయంగా వేల్స్ తరపున అత్యధిక మ్యాచ్‌ల్లో పాల్గొన్న తొలి ఆటగాడిగా గారెత్ బేల్ నిలిచాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్‌తో మ్యాచ్ గారెత్ బేల్‌కు 110వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇంతకముందు వేల్స్ తరపున క్రిస్ గంటర్ 109 మ్యాచ్‌లు ఆడాడు. అమెరికాతో మ్యాచ్‌తో గారెత్ అతని సరసన చేరాడు. తాజాగా ఇరాన్‌తో మ్యాచ్ ఆడడం ద్వారా గంటర్‌ను అధిగమించిన గారెత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో అమెరికాతో జరిగిన తొలి పోరులో గారెత్ బేల్ గోల్ చేసి తన ఆటను షురూ చేశాడు. కాగా వేల్స్ తరపున ఫిఫా వరల్డ్‌కప్స్‌లో గోల్ చేసిన నాలుగో ఆటగాడిగా గారెత్ నిలిచాడు. ఇంతకముందు ఇవోర్ అల్చర్చ్(1958లో రెండు గోల్స్), జాన్ చార్ల్స్, టెర్రీ మెడ్విన్లు(1958) చెరొక గోల్ కొట్టారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకు గారెత్ బేల్ 12 గోల్స్ నమోదు చేయడం విశేషం. ఇక ఈ వరల్డ్‌కప్‌లో వేల్స్ తమ ఆటను డ్రాతో ప్రారంభించింది. అమెరికాతో జరిగిన పోరులో వేల్స్ 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుంది. ఈ నేపథ్యంలో వేల్స్‌కు ఇరాన్‌తో పోరు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే వేల్స్ ముందంజ వేస్తుంది. అటు ఇరాన్ పరిస్థితి కూడా అంతే. ఈ నేపథ్యంలోనే గారెత్ బేల్.. ఇరాన్‌తో మ్యాచ్‌కు ముందు బీబీసీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు. వేల్స్ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నారు.. ఇది ఎలా అనిపిస్తుంది అని ప్రశ్న వేశారు. దీనిపై గారెత్ స్పందిస్తూ.. ''దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడడం గొప్ప విషయమే. ఇరాన్‌ను ఓడించకపోతే మేం ఇంటిబాట పట్టే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు ఈ రికార్డులు సాధించి ఉపయోగమేంటి.. రికార్డులు కాదు ఇరాన్‌తో మ్యాచ్ గెలవడం నాకు ముఖ్యం'' అంటూ పేర్కొన్నాడు. A special day for Gareth Bale! 👏 Can he celebrate the milestone with Wales' first World Cup victory in 64 years? 🙌 📺📻📲 Watch on @BBCiPlayer from 09:15 GMT, listen now on @BBCSounds & get more on the @BBCSport app#BBCFootball #BBCWorldCup — BBC Sport (@BBCSport) November 25, 2022 చదవండి: FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్... ఈసారైనా!
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ప్రతిసారీ భారీ అంచనాలతో అడుగు పెడుతుంది. ఈసారీ ఆ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా ఉంది. గ్రూప్ ‘బి’లో ఇరాన్, అమెరికా, వేల్స్ జట్లతో పోటీపడనున్న ఇంగ్లండ్ స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్ దశను సులువుగా దాటుతుంది. ఇంగ్లండ్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: విజేత (1966) ఇతర ఘనతలు: యూరో కప్ రన్నరప్ (2020) ‘ఫిఫా’ ర్యాంక్: 5 అర్హత: యూరోప్‌లో గ్రూప్–1 విజేత హోదాలో. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఇంగ్లండ్ అజేయంగా నిలిచింది. అదే జోరును ప్రధాన టోర్నీలోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉంది. 2018 రష్యాలో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సెమీఫైనల్లో ఓడి, ఆ తర్వాత ప్లే ఆఫ్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలోనూ ఓడి నాలుగో స్థానంలో నిలిచింది. కెప్టెన్ హ్యారీ కేన్‌తోపాటు జాక్ గ్రేలిష్, డెక్లాన్ రైస్, ట్రెంట్ అలెగ్జాండర్, జాన్ స్టోన్స్, కైల్ వాకర్‌లాంటి స్టార్ ఆటగాళ్లతో ఇంగ్లండ్ పటిష్టంగా ఉంది. ఓవరాల్‌గా 16వసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. . ఇరాన్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ ఇతర ఘనతలు: ఆసియా విజేత (1968, 72, 76) ‘ఫిఫా’ ర్యాంక్: 20 అర్హత: ఆసియా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ విన్నర్ ఓవరాల్‌గా ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇరాన్ ఏనాడూ గ్రూప్ దశలో తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. ఆసియా క్వాలిఫయింగ్‌లో ఆడిన 18 మ్యాచ్‌ల్లో 14 విజయాలు అందుకున్న ఇరాన్ ప్రధాన టోర్నీలో ఈసారైనా తొలి రౌండ్ దాటాలని పట్టుదలతో ఉంది. సర్దార్ అజ్మౌన్, అలీరెజా, మాజిద్ హుస్సేన్‌లాంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఇరాన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అమెరికా ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1930) ఇతర ఘనతలు: కాన్ఫడరేషన్స్ కప్ రన్నరప్ (2009) ‘ఫిఫా’ ర్యాంక్: 16 అర్హత: ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్లో మూడో స్థానం. నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రపంచకప్‌కు అర్హత పొందలేకపోయిన అమెరికా ఓవరాల్‌గా 11వసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. పులిసిక్, వెస్టన్ మెకెనీ, రేనాలాంటి కీలక ఆటగాళ్లు రాణిస్తే నాకౌట్ దశకు చేరుకునే అవకాశముంది. వేల్స్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1958) ఇతర ఘనతలు: యూరో టోర్నీలో మూడో స్థానం (2016) ‘ఫిఫా’ ర్యాంక్: 19 అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ విన్నర్. 1958 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన వేల్స్ జట్టు ఆశలన్నీ గ్యారెత్ బేల్, డానియల్ జేమ్స్, ఆరోన్ రామ్సెలాంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి. –సాక్షి క్రీడావిభాగం -
ఇంగ్లండ్, వేల్స్ విదేశీ నివాసితుల్లో భారతీయులదే అగ్రస్థానం
లండన్: ఇంగ్లండ్, వేల్స్లో ఉండే ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టిన వారే కాగా, ఇందులో 1.5 శాతంతో భారతీయులు అగ్రభాగంలో ఉన్నట్లు తేలింది. ఇంగ్లండ్, వేల్స్‌లోని నివాసితుల్లో విదేశాల్లో జన్మించిన వారు 2011లో 75 లక్షల మంది (13.4%) ఉండగా, 2021 నాటికి కోటి మంది (16.8%)కి చేరారని యూకే ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) గణాంకాలను వెలువరించింది. ఇంగ్లండ్, వేల్స్ నివాసితుల్లో యూకే వెలుపల జన్మించిన వారిలో అత్యధికులు 9.20 లక్షల మంది భారత్‌కు చెందిన వారే. ఆ తర్వాతి స్థానంలో 7.43 లక్షల మంది (1.2%)తో పోలండ్, 6.24 లక్షల మంది (1%)తో పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచాయి. 2011లో చేపట్టిన గణాంకాల్లోనూ భారత్, పోలండ్, పాకిస్తాన్‌లే మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. కాగా, యూకేలోని స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ ప్రాంతాల వివరాలను ఓఎన్ఎస్ పేర్కొనలేదు. ఇదీ చదవండి: COP 27: పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్ -
అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా రెండో విజయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఏలో భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు 3-1 తేడాతో ఘన విజయం అందుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో పూల్-ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్ తరపున వందనా కటారియా(ఆట 26, 48వ నిమిషం), గుర్జీత్ కౌర్(ఆట 28వ నిమిషం)లో గోల్స్ చేయగా.. వేల్స్ తరపున గ్జెన్నా హ్యూజెస్(ఆట 45వ నిమిషం) గోల్ చేసింది. ఇక భారత్ తమ తర్వాతి మ్యాచ్ ఆగస్టు 2న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. కానీ ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే దృడ సంకల్పంతో ఉంది. మరోవైపు ఎలాగైనా స్వర్ణం సాధించాలని బరిలోకి దిగన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఘనాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. GOAL! And the avalanche of goals continues with #TeamIndia's third goal. IND 3:1 WAL #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI — Hockey India (@TheHockeyIndia) July 30, 2022 -
World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు వేల్స్ జట్టు అర్హత
కార్డిఫ్: ఎప్పుడో 1958లో... వేల్స్ ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో అప్పుడు 17 ఏళ్ల వయసు ఉన్న ఆల్‌టైమ్ గ్రేట్ పీలే (బ్రెజిల్) చేసిన ఏకైక గోల్‌తో వేల్స్ పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో 15 ప్రపంచకప్‌లు జరిగినా... ఒక్కసారి కూడా వేల్స్ అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆ టీమ్‌కు విశ్వవేదికపై తలపడే అవకాశం వచ్చింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు వేల్స్ అర్హత పొందింది. క్వాలిఫయర్స్ పోరులో వేల్స్ 1–0 తేడాతో ఉక్రెయిన్‌పై విజయం సాధించింది. ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ యర్మొలెంకో 34వ నిమిషంలో చేసిన ‘సెల్ఫ్ గోల్’తో వేల్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. వేల్స్ స్టార్ ఆటగాడు, ఐదుసార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్ విజయాల్లో భాగమైన గారెత్ బేల్ ఈ విజయాన్ని ‘తమ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఫలితం’గా అభివర్ణించాడు. బేల్ కొట్టిన ఫ్రీకిక్‌ను హెడర్‌తో దిశ మళ్లించే ప్రయత్నంలోనే విఫలమై యర్మొలెంకో బంతిని తమ గోల్‌పోస్ట్‌లోకే పంపించాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, అమెరికా, ఇరాన్ ఉన్న గ్రూప్ ‘బి’లో వేల్స్ పోటీ పడనుంది. -
భారీ విజయంతో భారత్ బోణీ
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాలో శనివారం జరిగిన పూల్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–1 గోల్స్ తేడాతో వేల్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున లాల్రిన్డికి (32వ, 57వ ని.లో) రెండు గోల్స్ చేయగా... లాల్రెమ్సియామి (4వ ని.లో), ముంతాజ్ ఖాన్ (41వ ని.లో), దీపిక (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ ఆడుతుంది. -
ప్రిన్సెస్ డయానా కారు వేలం; వామ్మో అంత ధర!
వేల్స్: వేల్స్ యువరాణి డయానాకు చెందిన ఫోర్డ్ ఎస్కార్ట్ కారును వేలం వేశారు. కాగా వేలంలో దక్షిణ అమెరికాకు చెందిన ఓ మ్యుజీషియన్ ఆ కారును కొనుగోలు చేశాడు. డయానా వాడిన కారుకు వేలంలో 50 వేల పౌండ్స్‌కు పైగా ధర పలికింది. మన ఇండియన్ కరెన్సీలో కరెన్సీలో అయితే దాదాపు రూ.50 లక్షల కన్నా ఎక్కువ. ప్రస్తుతం డయానా వాడిన కారుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఒక పాతకారుకు ఇంత ధర అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రిన్సెస్ డయానా 1961 లో జన్మించింది. 1981లో ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ చిన్న కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను వివాహం చేసుకుంది. 1981లో వారి వివాహానికి ముందు డయానాకు ఎంగేజ్మెంట్ గిఫ్ట్‌గా ప్రిన్స్ చార్లెస్ ఆ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఐదు డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారును డయానా 1982 ఆగస్టు వరకు ఉపయోగించింది. అయితే 36 ఏళ్ల వయసులో ఆగస్టు 31, 1997లో పారిస్‌కు వెళ్లిన డయానా ఘోరరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మోటార్‌బైక్‌ను తప్పించబోయి కారు పల్టీ కొట్టడంతో డయానా అక్కడికక్కడే మరణించారు. చదవండి: యువతి క్లాసికల్ డ్యాన్స్; స్టెప్పులతో పెంపుడు కుక్క అదుర్స్ -
మనింట్లో కక్కినా బాగుండు అనిపిస్తుంది!
బ్యాంకాక్: ఇదేమిటి? బూజుపట్టిన చపాతీ పిండా లేక ఇంకేదైనా అని ఆలోచిస్తూ.. బుర్రకు శ్రమ పెట్టకండి.. ఇది వేల్ వాంతి.. అనగా.. తిమింగలం కక్కు.. చీయాక్ అని అనమాకండి.. విషయం మొత్తం విన్నాక.. అదేదో మనింట్లోనే కక్కినా బాగుండు అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. దీని ధర రూ.2.09 కోట్లు మాత్రమే!! ఈ మధ్యే థాయ్‌లాండ్‌లోని సమీలా బీచ్ వద్ద ఓ మత్స్యకారుడికి దొరికింది. ఇసుకలో తెల్లటి ముద్దలాగ కనిపిస్తే.. ఏదో రాయి అనుకున్నాడట. దగ్గరకు వెళ్లి చూస్తే.. ఇదేదో పనికొచ్చేదానిలాగ ఉంది అనుకుని.. ఇంటికి తీసుకెళ్లాడట. ఊర్లోని పెద్దోళ్లకు చూపిస్తే.. అసలు విషయం చెప్పారు. ఇది స్పెర్మ్ వేల్ వాంతి (అంబర్‌గ్రీస్).. సాధారణంగా నీళ్లపై తేలియాడుతూ కనిపిస్తాయి లేదా తీరానికి కొట్టుకొస్తాయి. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కంపు కొడుతుంది కానీ.. ఓసారి గట్టిపడ్డాక సువాసన వెదజల్లుతుంది. అందుకే దీనికి పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో తెగ క్రేజ్. దానికి తగ్గట్టుగానే ధర కూడానూ. తిమింగలం జీర్ణ వ్యవస్థలోని పిత్తాశయం నుంచి వెలువడ్డ స్రావం నుంచి ఇది తయారవుతుందట. గతంలో ఇంతకన్నా పెద్దది రూ.22 కోట్లకు అమ్ముడుపోయిందట. -
అక్కడంతా బంగారుమయమే!
సాక్షి, న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ ముందు వారికో శుభవార్త తెలిసి ఎగిరి గంతులేస్తున్నారు. ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అంతటి ఆనందానికి ఆ శుభవార్త బంగారుమయం అవడమే. వేల్స్‌లోని స్నోడోనియాలో క్లోగావ్– సెయింట్ డేవిడ్ గనుల్లో దాదాపు 6.9 వేల కోట్ల రూపాయలు (700 మిలియన్ పాండ్లు) విలువైన బంగారు గని బయట పడింది. ఈ విషయాన్ని అక్కడ టెస్ట్ డ్రిల్లింగ్ జరిపిన ‘అల్బా మినరల్ రిసోర్సెస్’ కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవానికి 1998లోనే ఈ గనులను మూసివేశారు. ఇటీవలనే ఈ గనులకు అక్కడి ప్రభుత్వం వేల పాటను నిర్వహించగా పలు గనుల తవ్వకాల కంపెనీలు పోటీ పడి బిడ్డింగ్‌లు వేశాయి. వాటిలో ఏడు కంపెనీలకు గని ప్రాంతాలను విభజించి ఇచ్చారు. తమకు కేటాయించిన స్థలంలో దాదాపు ఐదు లక్షల ఔన్సుల బంగారం ఉన్నట్లు టెస్ట్ డ్రిల్లింగ్‌లో బయట పడడంతో అల్బా కంపెనీ వారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. మిగతా కంపెనీలకు ఇప్పటి వరకు అలాంటి అదష్టం తగల లేదట. 1862 సంవత్సరం నుంచి 1911 మధ్యకాలంలో ఈ గనుల నుంచి 2.4 బంగారాన్ని వెలికి తీశారు. ఇప్పుడు ఆ తవ్వకాలకు సరిగ్గా 500 మీటర్ల దూరంలో తాజా బంగారం నిల్వలు బయట పడ్డాయి. 1862కు ముందు ఆ గనుల్లో రాగి, సీసం తీశారు. ఆ సంవత్సరం నుంచే బంగారు నిల్వలు బయట పడ్డాయి. బ్రిటన్‌లో ఇప్పటి వరకు బయట పడిన బంగారంలో 90 శాతం సెయింట్ డేవిడ్ గనుల నుంచి వచ్చిందే. పైగా అక్కడి బంగారం అత్యంత స్వచ్చమైనది, విలువైనదని బంగారం నిపుణులు తెలియజేస్తున్నారు. బ్రిటిష్ రాజ వంశమంతా తమ పెళ్లిళ్ల ఉంగరాలను అక్కడి బంగారంతోనే చేయించుకున్నారట. బ్రిటీష్ రాణి ఎలిజబెత్, యువ రాణి డయానా పెళ్లి రింగులు అక్కడి బంగారంతో చేసినవేనట. -
కరోనా : పెంగ్విన్ ఫీల్డ్ ట్రిప్ !!
చికాగో : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఆ పెగ్విన్స్‌కు స్వేచ్ఛ లభించింది. తాము ఇన్ని రోజులు మగ్గిపోయిన అక్వేరియంలో ఇప్పుడు మహారాజుల్లా తిరిగేస్తున్నాయి. తమ రాజ్యంలోని ఇతర జీవులను చూస్తూ టైం పాస్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ పూర్తిగా ప్రబలడంతో అమెరికా మొత్తం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికాగోకు చెందిన షేడ్ అక్వేరియాన్ని కూడా మూసేశారు. అయితే అక్వేరియంలో ఉండే పెంగ్విన్లను లోపల స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు. దీంతో విల్లింగ్టన్ అనే పెంగ్విన్ అక్వేరియాన్ని చుట్టేస్తూ అందులోని జంతువులను చూస్తూ ఆనందపడిపోతోంది. ఆసక్తిగా ఒకదాన్నొకటి చూసుకుంటున్న వేల్, పెంగ్విన్ మంగళవారం కయావక్, మోయక్, బేబీ అన్నిక్ అనే వేల్స్‌ల దగ్గరకు వెళ్లి చూసి వచ్చింది. అక్కడే ఉంటున్న మరో రెండు పెంగ్విన్లు టిల్లీ, కార్మిన్లు కూడా వేల్స్లను చూసోచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిలియన్ల వ్యూస్‌తో ముందుకు దూసుకుపోతున్నాయి. దీనిపై అక్వేరియం సిబ్బంది మాట్లాడుతూ.. ‘‘ విల్లింగ్టన్ వేల్స్ దగ్గరకు వెళ్లినపుడు అవి చాలా ఆసక్తిగా దాన్ని చూడసాగాయి. ఎందుకంటే అవెప్పుడూ పెంగ్విన్స్‌ను చూసెరుగవ’’ని పేర్కొన్నారు. కాగా, లాక్డౌన్ కారణంగా జూలు, అక్వేరియాలు మూతపడటంతో అక్కడి జంతువులు లోపలే స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు సంరక్షకులు. -
ఇప్పుడు మహారాజుల్లా తిరిగేస్తున్నాయి
-
40 ఏళ్లు చీకటి గుహలో..60 ఏళ్లు కప్‌బోర్డులో..
కార్డిఫ్ : అది 1919 సంవత్సరం! వేల్స్‌కు చెందిన మామి స్టువర్ట్ అనే 26 ఏళ్ల యువతి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమెకోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇటు బంధువులు అటు పోలీసులు ఆమె గురించి వెతకటం దండగనుకున్నారు. సండర్లాండ్కు చెందిన మామి 1918లో జార్జ్ శాటన్ అనే ఓ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత వేల్స్‌కు వచ్చేశారు. ఓ ఏడాదికి.. 1919లో ఆమె కనపించకుండాపోయింది. పోలీసులు ఆమె భర్తపై అనుమానంతో అతడ్ని విచారించారు. అయితే అతడే హత్య చేశాడనటానికి ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో వదిలేశారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత 1961లో వేల్స్‌లోని ఓ గనిలో ఆమె అస్తి పంజరం దొరికింది. దుండగులు ఆమెను దారుణంగా చంపి, మూడు భాగాలుగా చేసి గనిలోని ఓ చీకటి గుహలో పడేశారు. ఆమె అస్తిపంజరంపై ఉన్న నగల ఆధారంగా అది మామి స్టువర్ట్ అని గుర్తించారు. ఆ తర్వాత దాన్ని కార్డిఫ్‌లోని ఫోరెన్సిక్ లాబరేటరీకి తరలించారు. ఆ అస్తిపంజరాన్ని లాబరేటరీలోని ఓ కప్‌బోర్డులో ఉంచారు. అలా 60 సంవత్సరాల పాటు మామి అస్తిపంజరం ఆ కప్బోర్టులోనే ఉండిపోయింది. కొద్దిరోజుల క్రితం మామి బంధువొకరు ఆమె అస్తిపంజరాన్ని బయటకు తెప్పించింది. మామి చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత ఆమె తల్లిదండ్రులను సమాధి చేసిన సండర్లాండ్ స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
కన్న కూతుళ్లపైనే అత్యాచారం!
సాక్షి, న్యూఢిల్లీ: ఇలా తలమున ఇంతటి ఘోరం మరోటి ఉండకపోవచ్చు. ఆగ్నేయ వేల్స్‌కు చెందిన కామంధుడైన ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై పదే పదే అత్యాచారం చేయడంతోపాటు వారిలో ఓ కూతురి ద్వారా ఆరుగురి సంతానానికి తండ్రయ్యాడు. ఆ తండ్రి తన కూతుళ్లకు 16వ ఏట వచ్చినప్పటి నుంచే వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడట. తండ్రితో శంగార జీవితాన్ని పంచుకున్నట్లయితే గగన సీమలోని విచిత్ర మాయా లోకంలో మిగతా జీవితం స్వర్గతుల్యమవుతుందంటూ మాయమాటలు చెప్పి కూతుళ్లను రొంపిలోకి దింపాడట. తాను ఒక్కడే కాకుండా మరి కొంత మంది విటులను కూడా కూతళ్ల వద్దకు పంపించే వాడట. ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చిందో తెలియదుగానీ స్వాన్సీ క్రౌన్ కోర్టు విచారణకు సోమవారం వచ్చినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్ హిప్కిన్, జ్యూరీకి కేసు వివరాలను వెల్లడించారు. కూతుళ్లపైనే ఇంతటి ఘోరానికి పాల్పడిన ఆ తండ్రిపై 36 రేప్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఆ దేశం చట్ట నిబంధనల ప్రకారం ప్రధాన నిందితుడి పేరుగానీ, బాధితుల పేర్లుగానీ, ఇతర వివరాలనుగానీ మీడియాకు వెల్లడించలేదు. ఈ కేసు విచారణ మూడు వారాలు కొనసాగి తీర్పువెలువడవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిప్కిన్ తెలిపారు. -
పసిబిడ్డను నైట్ క్లబ్‌కు తీసుకెళ్లింది.. ఫుల్లుగా తాగి..
కార్డిఫ్ : మద్యానికి బానిసైన ఓ తల్లి నాలుగు వారాల తన కుమారుడిని నైట్ క్లబ్‌కు తీసుకెళ్లటమే కాకుండా.. మద్యం మత్తులో చిన్నారి చావుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ వేల్స్ న్యూక్వాయ్కు చెందిన మరీనా టిబ్లే(26)కు డేరియన్ అనే నాలుగు వారాల బాబు ఉన్నాడు. కన్నతల్లి అన్న మాటేగానీ ఓ తల్లిలా వ్యవహరించేది కాదు తను. తరుచుగా చెల్లెలితో కలిసి బాబును బంతిలా ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆడుకునే వారు. ఓ రోజు తన బాయ్‌ఫ్రెండ్స్‌తో నైట్‌క్లబ్‌కు వెళుతూ డేరియన్‌ను కూడా తీసుకెళ్లింది. అనంతరం ఫుల్లుగా తాగి ఇంటికి చేరుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆమె కొడుకును బెడ్‌పై పడేసి, అతడిపై పడి నిద్రపోయింది. ఉదయం మరీనా ఇంటికి వచ్చిన ఆమె చెల్లెలు.. నోటినుంచి రక్తం కక్కుకుని చనిపోయి ఉన్న డేరియన్‌ను చూసింది. అతి కష్టంమీద మరీనా శరీరం కిందపడి నలిగిపోయిన బాబును బయటకు లాగింది. సమాచారం అందుకున్న పోలీసులు మరీనాను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆమెను స్వాన్సియా క్రౌన్ కోర్టులో ప్రవేశపెట్టారు. నిర్లక్ష్యంతో కన్నకొడుకు చావుకు కారణమైన మరీనాకు క్రౌన్ కోర్టు రెండు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. -
ఆ బహుమతులు చూసి.. కన్నీటి పర్యంతమయ్యారు!
వేల్స్: అనురాగాలు, అప్యాయతలు మసకబారుతున్న రోజులివి.స్వార్థంతో సొంతవాళ్లనే దూరం చేస్తున్నాం. అవసరాన్ని బట్టి అప్యాయతగా మాట్లాడుతున్న ఈ రోజుల్లో ప్రేమానురాగాలు బతికే ఉన్నాయని నిరూపించాడు ఓ పెద్దాయన. పొరుగింటి చిన్నారితో ఏర్పడిన అనుభందాన్ని చనిపోతూ కూడా మర్చిపోలేకపోయాడు. తాను చనిపోయినా కూడా తన జ్ఞాపకాలు చిన్నారి వద్ద ఉండాలని 14 క్రిస్మస్ బహుమతులు అందిచారు. ఆ చిన్నారికి 16 ఏళ్లు వచ్చే వరకూ ఏడాదికి ఒకటి చొప్పున 14 బహుమతులు అందించాలని తన కుటుంభ సభ్యులకు సూచించారు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని వేల్స్ నగరానికి చెందిన కెన్ వాట్సన్(87) ఒంటరిగా నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిత్రం వాట్సన్ పొరుగింట్లోకి ఓవెన్ విలియమ్స్ తన కుటుంబంతో కలిసి కిరాయికి వచ్చి చేరారు. ఆ ఫ్యామిలీతో పరిచయం ఏర్పడ్డాక వాట్సన్ వారిని తన కుటుంబ సభ్యులవలే భావించారు. ఓవెన్ విలియమ్స్ కూతురు కాడి విలియమ్స్‌ను సొంత మనువరాలిగా భావించేవాడు. ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి ఆడిస్తూ.. ఎక్కువ సమయం తనతోనే గడిపేవాడు. కాడి విలియమ్స్ కూడా వాట్సన్‌ను సొంత తాతలాగా భావించి ఆయనతోనే ఉండేది. ప్రతి క్రిస్మస్కి బహుమతులు కొనిచ్చేవాడు. తాను 100 ఏళ్ల వరకు జీవిస్తానని, అప్పటి వరకూ కాడి నాతోనే ఉంటుందని తరచూ చెప్పేవాడు. వాట్సన్ ఆరోగ్యం క్షీణించడంతో గత అక్టోబర్‌లో తనువు చాలించారు. కాగా ఇటీవలే ఒవెన్ ఇంటికి వాట్సన్ కూతురు ఓ పెద్ద బ్యాగ్‌తో వచ్చారు. చనిపోయే ముందు ఈ బ్యాగ్‌ను కాడికి ఇవ్వాలని తన తండ్రి కోరారని చెప్పి ఆమె వెళ్లిపోయారు. ఆ బ్యాగ్ విప్పి చూడగా 14 బహుమతులు ఉన్నాయి. అవి ఏడాదికి ఒకటి చొప్పున కాడికి ఇవ్వాలని లేఖ రాసి ఉంది. కాడికి 16 ఏళ్లు వచ్చే వరకూ ఈ బహుమతులు అందించాలని కోరారు. ఆ బహుమతులు చూసి కాడి తల్లిదండ్రులు దుఃఖాన్ని దిగమింగుకోలేక పోయారు. Our elderly neighbour passed away recently. His daughter popped round a few moments ago clutching a large plastic sack. In the sack were all the Christmas presents he’d bought for *our* daughter for the next thirteen years. 😢 pic.twitter.com/6CjiZ99Cor — Owen Williams 🏴 (@OwsWills) December 17, 2018 ఈ విషయాన్ని కాడి తండ్రి ఓవెన్ విలియమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కూతురిపై ప్రేమతో పొరుగింటి పెద్దాయన చనిపోతూ కూడా బహుమతులు అందించారని, ఆయన కోరిక మేరకు ప్రతి క్రిస్మస్ పండుగకి ఒక గిఫ్ట్ చొప్పున ఆ 14 బహుమతులను అందిస్తానని చెప్పారు. ఇప్పుడా పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాట్సన్ చేసిన పని క్రిస్మస్ పండగకి ప్రతీక అని, ఈ రోజుల్లో అంతటి ప్రేమ చూపిన పెద్దాయనకు హ్యాట్సాప్ అంటూ నెటిజట్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
స్టోన్‌హెంజ్‌ను నిర్మించింది వీళ్లేనట!
లండన్: బ్రిటన్‌లోని వెస్సెక్స్ ప్రాంతంలో ఉండే స్టోన్‌హెంజ్‌ను నిర్మించిందెవరో శాస్త్రవేత్తలు ఎట్టకేలకు గుర్తించారు. భారీ బండరాళ్లతో నిర్మితమై వలయాకారంలో ఉండే స్టోన్‌హెంజ్‌ను ఎవరు ఏర్పాటు చేసి ఉంటారన్న విషయం ఇన్నాళ్లూ అంతుచిక్కకపోవడం తెలిసిందే. తాజాగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆ గుట్టు విప్పారు. పూర్వం వెస్సెక్స్, వేల్స్ తదితర ప్రాంతాల్లో నివసించిన ప్రజలే ప్రెసేలీ పర్వతాల నుంచి అంత భారీ బండరాళ్లను మోసుకొచ్చి స్టోన్‌హెంజ్‌ను నిర్మించి ఉంటారంటున్నారు. క్రీస్తు పూర్వం 3100 కాలంలో దీనిని నిర్మించి ఉంటారనీ, అప్పట్లో దీన్ని శ్మశానంగా ఉపయోగించేవారని తేల్చారు. కాగా, స్టోన్‌హెంజ్ ప్రాంతంలో 1920ల్లో వెలికి తీసిన ఎముకలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు తాజాగా రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి పరిశీలించారు. 25 పుర్రెలను పరిశీలించిన శాస్త్రజ్ఞులు.. వారిలో కనీసం పది మంది చనిపోవడానికి ముందు స్టోన్‌హెంజ్ పరిసర ప్రాంతాల్లో నివసించిన వారు కాదనీ, పశ్చిమ బ్రిటన్‌లోని వేల్స్ తదితర ప్రాంతాలకు చెందిన వారని తేల్చారు. -
అమెరికాలోనే తక్కువ!
జెనీవా: రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో యావత్ భారతదేశం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంటే యూరప్, పశ్చిమ దేశాలు అక్కడ పేరుకుపోయిన చెత్తను పునర్వినియోగంలోకి తెస్తూ క్లీన్ కంట్రీస్‌గా మారేందుకు శ్రమిస్తున్నాయి. పర్యావరణ హితం కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ యూనోమియా చెత్త నిర్వహణపై ఒక నివేదిక తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చెత్తను రీసైకిల్ చేస్తున్న దేశాల జాబితాను యూనోమియా ఇటీవల విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. చెత్త నిర్వహణ, పునర్వినియోగంలో జర్మనీ మొదటి స్థానంలో నిలవగా... ఆస్ట్రియా, దక్షిణ కొరియా, వేల్స్ దేశాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 52 నుంచి 56 శాతం చెత్తను రీసైకిల్ చేస్తూ దేశాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తమ దేశంలోని సగం చెత్తను రీసైకిల్ చేస్తూ స్విట్జర్లాండ్ అయిదో స్థానంలో ఉంది. స్థానిక ప్రభుత్వాలను, దేశ ప్రజలను చైతన్యం చేస్తూ ఆయా దేశాలు స్వచ్ఛత సాధిస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. ఒకే తరహా చెత్త సేకరణ విధానాలు అవలంభిస్తూ, ఈ దేశాలు చెత్త నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయిస్తున్నాయని స్పష్టం చేసింది. కాగా, జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన వేల్స్ దేశం మిగతా వాటి కంటే ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతోందనీ, కొన్ని నెలల్లోనే అది ప్రథమ స్థానానికి చేరుకోవచ్చని రిపోర్టు వెల్లడించింది. 2050 వరకు జీరో వేస్టేజి దేశంగా అవతరించడానికి వేల్స్ ప్రణాళికలు రచించుకుంది. మరోవైపు, ఇప్పటివరకు ప్రపంచంలోని చాలా దేశాల్లోని ఇండస్ట్రియల్ చెత్తను దిగుమతి చేసుకుని రీసైకిల్ చేసే చైనా తన పంథా మార్చుకుంది. 24 రకాల చెత్తను రీసైకిల్ చేయబోమని ప్రకటించింది. దాంతో చెత్త నిర్వహణపై చైనాపై ఆధారపడ్డ ఆయా దేశాలపై మరింత పనిభారం పడింది. కాగా, ఐరోపా దేశాలు 30 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తుండగా.. అమెరికా కేవలం 9 శాతమే రీసైకిల్ చేస్తోంది. -
స్త్రీవాద దేశంగా వేల్స్
వేల్స్ ప్రభుత్వాన్ని ‘ఫెమినిస్టు ప్రభుత్వం’గా మార్చేందుకు ఏం చేయాలన్న విషయమై ఆ దేశంలో ఇప్పుడు ఒక కమిటీ ఆధ్యర్యంలో దీర్ఘాలోచన సాగుతోంది! గ్రేట్ బ్రిటన్ పరిధిలోని ఒక దేశం వేల్స్. ఆ దేశ ఫస్ట్ మినిస్టర్ కార్విన్ జోన్స్ (అక్కడ ప్రధానిని ‘ఫస్ట్ మినిస్టర్’ అంటారు) బి.బి.సి. రేడియో 4 లోని ‘ఉమెన్స్ అవర్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘లైంగిక సమానత్వాన్ని సాధించేందుకు ‘ఫెమినిజం’ అనే భావనను పురుషులు అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం’ అని కూడా అన్నారు. బ్రిటన్ యువరాణి మేఘన్ మార్కెల్ తన అధికారిక జీవిత చరిత్రలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఈ సందర్భంగా ఆయన మద్దతు తెలిపారు. ‘నేను స్త్రీనైనందుకు, స్త్రీవాదినైనందుకు గర్విస్తున్నాను అని స్త్రీ అనగానే (మేఘన్ ఇలాగే అన్నారు) ఆమెను మనం ఒక సాధారణ స్త్రీగా కాకుండా, ఆమెనొక దుడుకుమోతుగా చూస్తాం. దీనిని బట్టి స్త్రీ,పురుష సమానత్వం కోసం మనమింకా ఎంతో దూరం ప్రయాణించవలసి ఉందని తెలుస్తోంది’ అన్నారు కార్విన్ జోన్స్. పదేళ్లుగా అధికారంలో ఉన్న జోన్స్ ఈ ఏడాది డిసెంబరులో పదవి నుంచి దిగిపోతున్నారు. ఆలోపే వేల్స్‌ను ‘స్త్రీవాద దేశం’గా మలుస్తానని తన ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముందైతే ఒక విధాన నిర్ణయాన్ని రూపొందించే పనిలో పడ్డారు. ఆయన తర్వాత వచ్చేవారు ఆ విధానాలను పాటిస్తారు. -
పరువు, పదవి.. ప్రాణం... పోయాయి
కార్డిఫ్ : వేల్స్ దేశంలో ఓ మాజీ మంత్రి మరణం మిస్టరీగా మారింది. కేబినెట్ మాజీ కార్యదర్శి మంత్రిగా విధులు నిర్వహించిన కార్ల్ సర్గంట్, క్వే పట్టణంలోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆయన మృతి వెనకగల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 49 ఏళ్ల సర్గంట్ పై కొన్నాళ్ల క్రితం లైంగిక ఆరోపణలు వినిపించాయి. వరుసపెట్టి పలువురు మహిళలు ఆయన తమను లైంగికంగా వేధించారంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి తప్పించి.. దర్యాప్తునకు ఆదేశించింది. అయితే తనకు ఏ పాపం తెలీదని.. కుట్రతో తనను ఇరికించారని.. అమాయకుడినంటూ మొదటి నుంచి కార్ల్ వాదిస్తూ వస్తున్నారు. అంతేకాదు అవసరమైతే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించుకున్నారు. కానీ, ప్రభుత్వం అందుకు నిరాకరించింది. దీంతో కొన్నాళ్లుగా ఆయన మానసికంగా కుంగిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. క్రమంలోనే ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇక సర్గంట్ మృతి పట్ల లేబర్ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. ఆ పార్టీ మాజీ నేత జెర్మీ కార్బైన్ తన ట్విట్టర్లో సంతాపం తెలియజేశారు. కార్ల్ సర్గంట్ మృతికి సంతాపంగా వెల్స్ మంగళవారం జరగాల్సిన పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. -
రొనాల్డో గర్జించాడు
యూరో ఫైనల్లో పోర్చుగల్ 2-0తో వేల్స్‌పై విజయం రొనాల్డో గర్జించాడు. అవును.. క్లబ్‌కు మాత్రమే బాగా ఆడతాడనే అపవాదును తునాతునకలు చేస్తూ ఇదిగో ఇదీ నా సత్తా అంటూ విమర్శకులకు తన కిక్ పవర్ ఏమిటో చూపాడు. ఇప్పటిదాకా ఆడిందేమిటని ఆడిపోసుకున్న వారే వహ్వా.. రొనాల్డో అని మనస్ఫూర్తిగా అనేలా సింహగర్జన చేశాడు. వేల్స్‌తో జరిగిన సెమీఫైనల్లో అతడి విశ్వరూపం చూసి మ్యాచ్ ఆద్యంతం ఈ స్టార్ నామస్మరణతో స్టేడియం మోతెక్కింది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతా తననెందుకు కీర్తిస్తారో చాటుకుంటూ... కీలక సమయంలో గోల్ చేశాడు. మరో మూడు నిమిషాల్లోనే రెండో గోల్ అందేలా కృషి చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అటు గ్యారెత్ బేల్ ఎంత ప్రయత్నం చేసినా తన జట్టు వేల్స్ అద్భుత ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. లియోన్: సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈసారి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరైన సమయంలో జూలు విదిల్చి స్థాయికి తగ్గ ఆటతీరుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. యూరో కప్‌లో భాగంగా బుధవారం వేల్స్‌తో జరిగిన సెమీఫైనల్లో 2-0తో నెగ్గిన పోర్చుగల్ ఫైనల్లో ప్రవేశించింది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో నిర్ణీత సమయంలో పోర్చుగల్‌కు దక్కిన తొలి విజయమిదే. ఫ్రాన్స్, జర్మనీ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం పోర్చుగల్ టైటిల్ కోసం పోరాడుతుంది. జట్టు తరఫున రొనాల్డో (50వ నిమిషంలో), నాని (53వ ని.) గోల్స్ చేశారు. యూరో కప్‌లో పోర్చుగల్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. గతంలో 2004లో ఫైనల్‌కు చేరి గ్రీస్ చేతిలో ఓడింది. మరోవైపు మ్యాచ్‌లో పట్టు కోసం విశ్వప్రయత్నం చేసినా వేల్స్ ఫలితం సాధించలేకపోయింది. స్టార్ ఫుట్‌బాలర్ గ్యారెత్ బేల్ తన ప్రయత్నాలను గోల్స్‌గా మలచలేకపోవడంతో వేల్స్ సూపర్ జర్నీ సెమీస్‌లో ముగిసింది. మిడ్‌ఫీల్డర్ ఆరోన్ రామ్సే నిషేధం కారణంగా మ్యాచ్‌కు దూరమవడం కూడా ఆ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 16వ నిమిషంలోనే పోర్చుగల్ తొలి గోల్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. వేల్స్ పెనాల్టీ ఏరియాలో కుడివైపు నుంచి మరియో ఆడిన షాట్ గోల్‌పోస్ట్‌కు కాస్త దూరం నుంచి వెళ్లింది. మరోవైపు బేల్ 23వ ని.లో సెంటర్‌లైన్ కుడివైపు నుంచి గోల్ పోస్ట్‌లోకి బంతిని షూట్ చేసినా అది నేరుగా గోల్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 44వ ని.లో ఎడ్రియన్ సిల్వా ఎడమ వైపు నుంచి వేల్స్ గోల్ పోస్ట్ ముందుకు క్రాస్ షాట్ ఆడగా.. రొనాల్డో బంతిని హెడర్ చేశాడు. అయితే బంతి గోల్‌పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లడంతో గోల్రాలేదు. ద్వితీయార్ధం 53వ నిమిషంలో పోర్చుగల్ బోణీ చేయగలిగింది. రఫెల్ గురేరో అందించిన కార్నర్ షాట్‌ను పెనాల్టీ ఏరియాలో మెరుపులా పైకి ఎగిరిన రొనాల్డో హెడర్ గోల్ చేశాడు. ఆ తర్వాత మూడు నిమిషాలకే సాంచెస్ ఇచ్చిన పాస్‌ను రొనాల్డో గోల్ పోస్ట్‌వైపు ఆడగా.. అక్కడే ఉన్న నాని డైవ్ చేస్తూ ఎడమ కాలితో బంతిని నెట్లోకి పంపాడు. దీంతో పోర్చుగల్‌కు 2-0 ఆధిక్యం లభించింది. తర్వాత 63వ ని.లో రొనాల్డో ఫ్రీకిక్ గోల్‌పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లింది. చివర్లో వేల్స్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా పోర్చుగల్ కీపర్ పాట్రికియో వమ్ము చేయడంతో ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. యూరో కప్‌ల్లో అత్యధిక గోల్స్ (9) చేసిన ఆటగాడు రొనాల్డో. దీంతో ఫ్రాన్స్ దిగ్గజం మైకేల్ ప్లాటిని సరసన నిలిచాడు. -
బేల్ X రొనాల్డో
* వేల్స్, పోర్చుగల్ సెమీస్ పోరు * యూరో కప్ లియోన్: గ్యారెత్ బేల్, క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన ఆటగాళ్లే కాకుండా తమ ఆటతో అభిమానులను మంత్రముగ్ధులను చేయగల సత్తా ఉన్నవారు. స్పానిష్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసే ఆడతారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఎవరి బలమేమిటో.. బలహీనత ఏమిటో ఇరువురికి మంచి అవగాహన ఉంది. గత మూడేళ్లలో వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా రియల్ మాడ్రిడ్ రెండు చాంపియన్స్ లీగ్ టైటిళ్లను దక్కించుకోగలిగింది. అయితే ఇప్పుడు తమ జట్ల ఆశలను మోస్తూ ప్రత్యర్థులుగా ఎవరు గొప్పో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. యూరో కప్‌లో భాగంగా నేటి (బుధవారం) రాత్రి వేల్స్, పోర్చుగల్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. నిజానికి ఈ మ్యాచ్‌ను రెండు జట్ల మధ్య కాకుండా ఇద్దరి స్టార్ల షోగానే అంతా భావిస్తున్నారు. ఇక తమ సంచలన ప్రదర్శనతో గత 50 ఏళ్లలో ఓ మేజర్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి బ్రిటిష్ జట్టుగా చరిత్ర సృష్టించాలని వేల్స్ ఉవ్విళ్లూరుతుండగా... కిందా మీదా పడుతూ ఇక్కడిదాకా వచ్చిన పోర్చుగల్ ఈ మ్యాచ్‌లోనైనా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి టైటిల్ వేటలో నిలవాలని భావిస్తోంది. జోష్‌లో వేల్స్ ఇప్పటికే ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను క్వార్టర్స్‌లో కంగుతినిపించి తామేమిటో వేల్స్ నిరూపించుకుంది. ఆ మ్యాచ్‌లో బేల్ పెద్దగా రాణించకపోయినా సమష్టి కృషితో సెమీస్‌కు రాగలిగింది. అయితే అంతకుముందు మ్యాచ్‌ల్లో తను చూపిన ప్రతిభ అద్భుతం. ఇప్పటికే మూడు గోల్స్‌తో జోరుమీదున్నాడు. నిజానికి వేల్స్ ఇక్కడిదాకా రాగలుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ తమ గ్రూప్‌లో టాప్‌లో నిలిచింది. అలాగే బెల్జియంపై 3-1తో నెగ్గి అందరికీ షాక్ ఇచ్చింది. హల్ రాబ్సన్-కను సూపర్ ఫామ్ ఇక్కడా కొనసాగితే పోర్చుగల్‌కు ఇబ్బందులు తప్పవు. కానీ మిడ్‌ఫీల్డర్ ఆరోన్ రామ్సే, డిఫెండర్ బెన్ డేవిస్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు. రామ్సే స్థానంలో ఇప్పటిదాకా బెంచికే పరిమితమైన ఆండీ కింగ్‌ను ఆడించనున్నారు. రొనాల్డో ఫామ్ కీలకం మరోవైపు పోర్చుగల్ ఆటతీరు సెమీస్ వరకు అంత అద్భుతంగా సాగలేదనే చెప్పవచ్చు. నిర్ణీత 90 నిమిషాల్లో ఇప్పటిదాకా ఒక్క గోల్ కూడా చేయకుండా సెమీస్‌కు చేరింది. తమ గ్రూప్ మ్యాచ్‌లన్నీ డ్రాగానే ముగిశాయి. క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటవుట్‌తో నెగ్గింది. జట్టు ఒత్తిడినంతా భరిస్తున్న రొనాల్డో.. హంగెరీతో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి నాలుగు యూరో కప్‌లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అయితే ఐస్లాండ్, ఆస్ట్రియా, క్రొయేషియా, పోలండ్లపై విఫలమయ్యాడు. అతడి ఫామ్‌లేమి జట్టును ఆందోళనపరుస్తోంది. ఈసారైనా తన హోదాకు తగ్గ ఆటతీరును ప్రదర్శించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. తను మరో గోల్ సాధిస్తే యూరో చరిత్రలో తొమ్మిది గోల్స్ చేసిన మైకేల్ ప్లాటిని సరసన నిలుస్తాడు. డిఫెండర్ పెపే గాయం కారణంగా ఆడేది అనుమానంగా మారింది. మైదానంలోకి పిల్లల్ని తేకండి పారిస్: మ్యాచ్‌ను గెలిచిన ఆనందంలో తమ భార్యా పిల్లలతో మైదానంలో సంబరాలు జరుపుకోవడం ఇక కుదరదని యూరో చాంపియన్‌షిప్ నిర్వాహకులు తేల్చి చెప్పారు. క్వార్టర్స్‌లో బెల్జి యంపై విజయంతో సంచలనం సృష్టించిన అనంతరం వేల్స్ ఆటగాళ్లు తమ పిల్లలను మైదానంలోకి తీసుకొచ్చి ఎంజాయ్ చేశారు. ‘ఇది యూరో చాంపియన్‌షిప్. ఫ్యామిలీ పార్టీ ఎంతమాత్రం కాదు. చిన్న పిల్లలకు స్టేడియం అంత సురక్షితమైనది కాదు. ఒకవేళ అభిమానులు ఫీల్డ్ పైకి వస్తే వారి భద్రత పరిస్థితి ఏమిటి? మేం ఎలా సమాధానం చెప్పుకోవాలి?’ అని టోర్నీ డెరైక్టర్ మార్టిన్ కాల్లెన్ ప్రశ్నించారు. -
వేల్స్ కొత్త చరిత్ర
లిల్లీ: యూరో కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో సంచలనం నమోదైంది. శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ బెల్జియం ఇంటిముఖం పట్టింది. అమీతుమీ తేల్చుకోవాల్సిన పోరులో పసికూన వేల్స్ 3-1 తేడాతో బెల్జియంను బోల్తా కొట్టించి సెమీస్ కు చేరింది. తద్వారా ఓ ప్రధాన టోర్నీలో తొలిసారి సెమీస్ కు చేరి కొత్త చరిత్ర సృష్టించింది. ఆట 13వ నిమిషంలో బెల్జియంకు రాద్జా తొలి గోల్ ను అందించి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.ఈడెన్ హజార్డ్ నుంచి పాస్ ను అందుకున్న రాద్జా గోల్ గా మలచాడు. కాగా, ఆట 30వ నిమిషంలో వేల్స్ ఆటగాడు ఆష్లే విలియమ్స్ హెడర్ ద్వారా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు.ఇక ఆ తర్వాత రెచ్చిపోయిన వేల్స్..పటిష్టమైన బెల్జియం ఎటాక్ ను నిలువరించడమే కాకుండా, మరో రెండు గోల్స్ నమోదు చేసి అద్భుతమైన విక్టరీ సాధించింది. ఆట 55వ నిమిషంలో హాల్ రాబ్సన్ కాను, 85వ నిమిషంలో శ్యామ్ వేక్స్ తలో గోల్ చేయడంతో వేల్స్ ఘనమైన విజయం సాధించింది. ఇదిలా ఉండగా, 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మేజర్ టోర్నీలో వేల్స్ బరిలోకి దిగడం కూడా ఇదే తొలిసారి. -
కొత్త చరిత్ర దిశగా...
* నేడు బెల్జియంతో వేల్స్ క్వార్టర్స్ పోరు * బేల్పైనే అందరి దృష్టి * యూరో కప్ లిల్లీ: ఒకరిదేమో అరంగేట్రం స్థాయి... మరొకరిదేమో ‘ఫిఫా’ ర్యాంకింగ్‌లో రెండో స్థానం. కొత్త చరిత్ర కోసం ఒకరు... పాత చరిత్రను తిరగరాయడానికి మరొకరు. ఈ నేపథ్యంలో యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (శుక్రవారం) జరగనున్న క్వార్టర్స్ పోరులో కొత్త కూన వేల్స్‌తో.... రెండో ర్యాంకర్ బెల్జియం అమీతుమీకి సిద్ధమైంది. అర్హత పోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో తొలిసారి యూరోకప్‌కు అర్హత సాధించిన వేల్స్... లీగ్, ప్రిక్వార్టర్స్‌లోనూ అంచనాలకు మించి రాణించింది. నార్తర్న్ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆఖరి నిమిషాల్లో ఒత్తిడిని జయించి గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని ఆమాంతం పెంచింది. దీంతో క్వార్టర్స్‌లోనూ అదే స్థాయిలో ఆడాలని పట్టుదలగా ఉంది. అలాగే 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మేజర్ టోర్నీలో వేల్స్ బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడంతో గెలుపుతో కొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. దీనికోసం ఏడాది కిందట క్వాలిఫయింగ్ టోర్నీలో బెల్జియంపైనే ఏకైక గోల్ సాధించిన ఫ్రికిక్ నిపుణుడు గ్యారెత్ బేల్పైనే జట్టు మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. అయితే బెల్జియం దాడులను నిలువరించాలంటే వేల్స్ రక్షణశ్రేణితో పాటు గోల్ కీపర్ హెన్నెసే శక్తికి మించి రాణించాలి. మరోవైపు స్టార్ ఆటగాళ్లతో కూడిన బెల్జియం ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లే గెలిచినా.. ప్రిక్వార్టర్స్‌లో హంగేరిపై నాలుగు గోల్స్‌తో తమ సత్తా ఏంటో చూపెట్టింది. వ్యూహాలను రచించడం, అమలు చేయడంలో కోచ్ విల్మోట్స్ దిట్ట. యూరోలో 1980లో రన్నరప్‌గా నిలిచిన బెల్జియం ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ లీగ్ తొలి మ్యాచ్‌లోనే ఇటలీలాంటి మేటి జట్టుపై గెలవడంతో ఇప్పుడు టైటిల్‌పై ఆశలు పెట్టుకుంది. వేల్స్‌తో పోలిస్తే అన్ని రంగాల్లో మెరుగ్గా ఉన్న బెల్జియంకు స్టార్ స్ట్రయికర్ ఈడెన్ హజార్డ్ కొండంత అండ. చివరి నిమిషాల్లో తన స్ట్రయికింగ్‌తో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయడం ఇతని ప్రత్యేకత. టోబీ, విర్మాలెన్, లుకాక్, మునేర్లూ రాణిస్తే వేల్స్‌కు కష్టాలు తప్పవు. -
అంత్యక్రియల్లో అశ్లీల వీడియో
నెలలు నిండిన తన భార్యతో కలిసి కారులో బయలుదేరాడు సైమన్ లెవీస్. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నైట్ క్లబ్ వైపునకు దూసుకెళుతున్నవాళ్లకు మరో కారు అడ్డంతగిలింది. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ప్రమాదంలో సైమన్ అక్కడికక్కడే చనిపోయాడు. స్పృహకోల్పోయిన ఆయన భార్యను ఎవరో ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల తర్వాత ఆపరేషన్ చేసి కడుపులోనే చనిపోయిన శిశువును బయటికితీశారు డాక్టర్లు. ప్రమాదం జరిగిన రోజే కడుపులో ఉన్న బిడ్డ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. భార్య ఆసుపత్ని నుంచి కోలుకున్న తర్వాత సైమన్, తల్లికడుపులోనే చనిపోయిన అతడి కొడుకుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. వాళ్ల సొంత ఊరు కార్డిఫ్ లోని చర్చికి సమీపంలోగల స్మశానవాటికలో అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. రెండు పార్థివదేహాలను ఉద్దేశించి పాస్టర్ ప్రార్థనలు చేశారు. పూడ్చిపెట్టడానికి ముందు మరోసారి జ్ఞాపకాలను తల్చుకునేందుకు అక్కడ ఏర్పాటుచేసిన స్క్రీన్లపై సైమన్ కు సంబంధించిన గత వీడియాలను ప్లే చేయాల్సిందిగా పాస్టర్ ఆదేశించారు. వీడియో మొదలవుతూనే అక్కడున్నవారి ముఖాల్లో ఆందోళన మిన్నంటింది. సైమన్ జ్ఞాపకాలకు బదులు అక్కడ ప్లే అయింది ఓ హార్డ్ కోర్ పోర్న్ వీడియో! క్షణాల్లో తేరుకున్న కార్యక్రమ నిర్వాహకులు వీడియో ప్రసారాన్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సాంకేతిక సమస్యవల్ల దాదాపు ఐదునిమిషాలపాటు ఆ వీడియో అలా ప్లే అవుతూనేఉంది. చివరికి ఓ ఇంజనీర్ వచ్చి సెట్టింగ్స్ మార్చాకగానీ అశ్లీలదృశ్యాల ప్రసారం ఆగిపోలేదు. జనవరి 28న చోటుచేసుకున్న ఈ సంఘటన వేల్స్(యూకే)లో చర్చనీయాంశమైంది. అంత్యక్రియల నిర్వాహకుల తీరుపై సైమన్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేయగా, 30 ఏళ్ల సర్వీసులు ఇలాంటి పొరపాటుజరగటం మొదటిసారని, ఈ ఒక్కసారీ క్షమించాలని వేడుకున్నారు స్మశానవాటిక సిబ్బంది.