![FIH Womens Junior World Cup: India defeats Wales in Pool D opener - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/3/LALREMSIYAMI-HOCKEY.jpg.webp?itok=nQtVs-_U)
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాలో శనివారం జరిగిన పూల్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–1 గోల్స్ తేడాతో వేల్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున లాల్‌రిన్‌డికి (32వ, 57వ ని.లో) రెండు గోల్స్ చేయగా... లాల్‌రెమ్‌సియామి (4వ ని.లో), ముంతాజ్ ఖాన్ (41వ ని.లో), దీపిక (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment