Junior womens section
-
World Shooting Championship: భారత షూటర్ల జోరు
కైరో: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో రమిత 16–12తో చైనా షూటర్ యింగ్ షెన్‌పై గెలుపొందింది. జూనియర్ మహిళల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు దివ్యాంశి (547 పాయింట్లు) స్వర్ణం, వర్షా సింగ్ (539 పాయింట్లు) రజతం, టియానా (523 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
భారీ విజయంతో భారత్ బోణీ
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాలో శనివారం జరిగిన పూల్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–1 గోల్స్ తేడాతో వేల్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున లాల్రిన్డికి (32వ, 57వ ని.లో) రెండు గోల్స్ చేయగా... లాల్రెమ్సియామి (4వ ని.లో), ముంతాజ్ ఖాన్ (41వ ని.లో), దీపిక (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ ఆడుతుంది. -
అలీమాకు 3 స్వర్ణాలు
జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పట్నా: జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. ఇక్కడ జరుగుతున్న ఈ పోటీల జూనియర్ మహిళల విభాగంలో ఎస్కే అలీమా బేగం 3 స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. 69 కేజీల కేటగిరీలో స్నాచ్‌లో 83 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 100 కిలోలు ఎత్తిన అలీమా... ఓవరాల్‌గా 183 కేజీల బరువుతో మూడో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇదే విభాగం 58 కేజీల కేటగిరీలో ఇ.దీక్షితకు 3 రజత పతకాలు లభించాయి. దీక్షిత స్నాచ్‌లో 74 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 92 కిలోలు, ఓవరాల్‌గా 166 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. జూనియర్ మహిళల కేటగిరీలోనే 75 కేజీలో విభాగంలో ఎన్.లలితకు 3 కాంస్యాలు దక్కాయి. స్నాచ్‌లో 66 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 78 కిలోలతో ఓవరాల్‌గా 144 కిలోల బరువు ఎత్తి లలిత మూడు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. మరో వైపు యూత్ బాలికల (63 కేజీలు) విభాగంలో జి. లలితకు 2 రజతాలు, 1 కాంస్యం దక్కాయి. స్నాచ్ లో 68 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచిన లలిత... క్లీన్ అండ్ జర్క్ (87 కిలోలు), ఓవరాల్ (155 కిలోలు)లో మూడో స్థానం సాధించింది.