అలీమాకు 3 స్వర్ణాలు | Alima to 3 gold | Sakshi
Sakshi News home page

అలీమాకు 3 స్వర్ణాలు

Published Fri, Feb 26 2016 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

అలీమాకు 3 స్వర్ణాలు

అలీమాకు 3 స్వర్ణాలు

జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్

 పట్నా: జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. ఇక్కడ జరుగుతున్న ఈ పోటీల జూనియర్ మహిళల విభాగంలో ఎస్‌కే అలీమా బేగం 3 స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. 69 కేజీల కేటగిరీలో స్నాచ్‌లో 83 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 100 కిలోలు ఎత్తిన అలీమా... ఓవరాల్‌గా 183 కేజీల బరువుతో మూడో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇదే విభాగం 58 కేజీల కేటగిరీలో ఇ.దీక్షితకు 3 రజత పతకాలు లభించాయి. దీక్షిత స్నాచ్‌లో 74 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 92 కిలోలు, ఓవరాల్‌గా 166 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.

జూనియర్ మహిళల కేటగిరీలోనే 75 కేజీలో విభాగంలో ఎన్.లలితకు 3 కాంస్యాలు దక్కాయి. స్నాచ్‌లో 66 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 78 కిలోలతో ఓవరాల్‌గా 144 కిలోల బరువు ఎత్తి లలిత మూడు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. మరో వైపు  యూత్ బాలికల (63 కేజీలు) విభాగంలో జి. లలితకు 2 రజతాలు, 1 కాంస్యం దక్కాయి. స్నాచ్ లో 68 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచిన లలిత... క్లీన్ అండ్ జర్క్ (87 కిలోలు), ఓవరాల్ (155 కిలోలు)లో మూడో స్థానం సాధించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement