అలీమాకు 3 స్వర్ణాలు
జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్
పట్నా: జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. ఇక్కడ జరుగుతున్న ఈ పోటీల జూనియర్ మహిళల విభాగంలో ఎస్కే అలీమా బేగం 3 స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. 69 కేజీల కేటగిరీలో స్నాచ్‌లో 83 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 100 కిలోలు ఎత్తిన అలీమా... ఓవరాల్‌గా 183 కేజీల బరువుతో మూడో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇదే విభాగం 58 కేజీల కేటగిరీలో ఇ.దీక్షితకు 3 రజత పతకాలు లభించాయి. దీక్షిత స్నాచ్‌లో 74 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 92 కిలోలు, ఓవరాల్‌గా 166 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.
జూనియర్ మహిళల కేటగిరీలోనే 75 కేజీలో విభాగంలో ఎన్.లలితకు 3 కాంస్యాలు దక్కాయి. స్నాచ్‌లో 66 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 78 కిలోలతో ఓవరాల్‌గా 144 కిలోల బరువు ఎత్తి లలిత మూడు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. మరో వైపు యూత్ బాలికల (63 కేజీలు) విభాగంలో జి. లలితకు 2 రజతాలు, 1 కాంస్యం దక్కాయి. స్నాచ్ లో 68 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచిన లలిత... క్లీన్ అండ్ జర్క్ (87 కిలోలు), ఓవరాల్ (155 కిలోలు)లో మూడో స్థానం సాధించింది.