ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మస్కట్‌లో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది.
భారత్ తరఫున థోక్‌చోమ్ కింగ్సన్ సింగ్ (12వ నిమిషంలో), రోహిత్ (36వ నిమిషంలో), అరిజిత్ సింగ్ హుండల్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ జట్టుకు నియో సాటో (15వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టుకు ఏకంగా 16 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి.
అయితే జపాన్ రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు దక్కగా ఇందులో రెండింటిని సది్వనియోగం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టు ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. శనివారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టుతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment