పసిబిడ్డను నైట్‌ క్లబ్‌కు తీసుకెళ్లింది.. ఫుల్లుగా తాగి.. | Drunken Mother Sleeps On 4 Weeks Son | Sakshi
Sakshi News home page

పసిబిడ్డను నైట్‌ క్లబ్‌కు తీసుకెళ్లింది.. ఫుల్లుగా తాగి..

Published Sat, Jun 8 2019 4:02 PM | Last Updated on Sat, Jun 8 2019 4:20 PM

Drunken Mother Sleeps On 4 Weeks Son - Sakshi

మద్యం మత్తులో ఉన్న ఆమె కొడుకును బెడ్‌పై పడేసి..

కార్డిఫ్‌ : మద్యానికి బానిసైన ఓ తల్లి నాలుగు వారాల తన కుమారుడిని నైట్‌ క్లబ్‌కు తీసుకెళ్లటమే కాకుండా.. మద్యం మత్తులో చిన్నారి చావుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్‌ వేల్స్‌ న్యూక్వాయ్‌కు చెందిన మరీనా టిబ్లే(26)కు డేరియన్‌ అనే నాలుగు వారాల బాబు ఉన్నాడు. కన్నతల్లి అన్న మాటేగానీ ఓ తల్లిలా వ్యవహరించేది కాదు తను. తరుచుగా చెల్లెలితో కలిసి  బాబును బంతిలా ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆడుకునే వారు. ఓ రోజు తన బాయ్‌ఫ్రెండ్స్‌తో నైట్‌క్లబ్‌కు వెళుతూ డేరియన్‌ను కూడా తీసుకెళ్లింది.  అనంతరం ఫుల్లుగా తాగి ఇంటికి చేరుకుంది.

మద్యం మత్తులో ఉన్న ఆమె కొడుకును బెడ్‌పై పడేసి, అతడిపై పడి నిద్రపోయింది. ఉదయం మరీనా ఇంటికి వచ్చిన ఆమె చెల్లెలు.. నోటినుంచి రక్తం కక్కుకుని చనిపోయి ఉన్న డేరియన్‌ను చూసింది. అతి కష్టంమీద మరీనా శరీరం కిందపడి నలిగిపోయిన బాబును బయటకు లాగింది. సమాచారం అందుకున్న పోలీసులు మరీనాను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆమెను స్వాన్‌సియా క్రౌన్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. నిర్లక్ష్యంతో కన్నకొడుకు చావుకు కారణమైన మరీనాకు క్రౌన్‌ కోర్టు రెండు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement