వేల్స్ నైరుతి ప్రాంతంలోని సైమర్‌లో మూతబడిన రైల్వే సొరంగం ఇది. పంతొమ్మిదో శతాబ్ది చివరిభాగంలో నిర్మించిన ఈ సొరంగం పేరు ‘గెల్లీ హౌసెస్ రైల్వే టన్నెల్. దీనిని సిడ్నీ విలియం యాక్నీ అనే ఇంజినీరు 1882లో నిర్మించాడు. దీని గుండా 1890 జూలై 2న తొలి రైలు ప్రయాణించింది. దీని గుండా రైళ్ల రాకపోకలు సాగిన కాలంలో ఇది రోండా లోయలోని సైమర్–బ్లేంగ్విన్‌ఫీ ఊళ్ల నడుమ దగ్గరి దారిగా ఉండేది.
ఈ సొరంగం గుండా 1960లో చివరి రైలు ప్రయాణించింది. ఆ తర్వాత ఇది మూతబడటంతో అప్పటి అధికారులు దీని చుట్టూ కంచె నిర్మించారు. తర్వాత వచ్చిన అధికారులు ఈ సొరంగం ఉన్న సంగతే మరచిపోయారు. ఇటీవల ఒక వ్యక్తి ఈ సొరంగంలో సినిమా తీయడానికి అనుమతి కోరుతూ అధికారులకు దరఖాస్తు చేయడంతో, అసలు దీనికి సంబంధించి ఎలాంటి రికార్డులూ లేని విషయం బయటపడింది. దాంతో హుటాహుటిన అధికారులు సొరంగాన్ని తనిఖీ చేసేందుకు బయలుదేరారు. జనసంచారానికి ఇది ఏమాత్రం సురక్షితంగా లేదని నిర్ధారించి, సినిమా షూటింగ్‌కు అనుమతి నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment