railway tunnel blast
-
రికార్డుల్లో లేని సొరంగం.. ఎక్కడుందో తెలుసా..?
వేల్స్ నైరుతి ప్రాంతంలోని సైమర్లో మూతబడిన రైల్వే సొరంగం ఇది. పంతొమ్మిదో శతాబ్ది చివరిభాగంలో నిర్మించిన ఈ సొరంగం పేరు ‘గెల్లీ హౌసెస్ రైల్వే టన్నెల్. దీనిని సిడ్నీ విలియం యాక్నీ అనే ఇంజినీరు 1882లో నిర్మించాడు. దీని గుండా 1890 జూలై 2న తొలి రైలు ప్రయాణించింది. దీని గుండా రైళ్ల రాకపోకలు సాగిన కాలంలో ఇది రోండా లోయలోని సైమర్–బ్లేంగ్విన్ఫీ ఊళ్ల నడుమ దగ్గరి దారిగా ఉండేది. ఈ సొరంగం గుండా 1960లో చివరి రైలు ప్రయాణించింది. ఆ తర్వాత ఇది మూతబడటంతో అప్పటి అధికారులు దీని చుట్టూ కంచె నిర్మించారు. తర్వాత వచ్చిన అధికారులు ఈ సొరంగం ఉన్న సంగతే మరచిపోయారు. ఇటీవల ఒక వ్యక్తి ఈ సొరంగంలో సినిమా తీయడానికి అనుమతి కోరుతూ అధికారులకు దరఖాస్తు చేయడంతో, అసలు దీనికి సంబంధించి ఎలాంటి రికార్డులూ లేని విషయం బయటపడింది. దాంతో హుటాహుటిన అధికారులు సొరంగాన్ని తనిఖీ చేసేందుకు బయలుదేరారు. జనసంచారానికి ఇది ఏమాత్రం సురక్షితంగా లేదని నిర్ధారించి, సినిమా షూటింగ్కు అనుమతి నిరాకరించారు. -
12 నిండు ప్రాణాలు.. 14 గంటల పోరాటం
-
12 నిండు ప్రాణాలు.. 14 గంటల పోరాటం
బీజింగ్: తక్కువ సమయంలో అధ్బుత నిర్మాణాలు చేపట్టడంలో చైనీయులది అందెవేసిన చెయ్యి. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులు ఎక్కువగా చనిపోయే దేశం కూడా చైనాయే. అక్కడే ఏటా సగటున 66 వేల మంది కార్మికులు పని ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కొనసాగింపు అన్నట్లు.. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే టన్నెట్ పేలిపోవడంతో 12 మంది కార్మికులు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి చైనాలోని గిజావు ఫ్రావిన్స్ లో మంగళవారం చోటుచేసుకుందీ ఘటన. భారీ టన్నెల్ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడ పనిచేస్తోన్న కార్మికులు నిర్మాణ శిధిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సుమారు 2వేల మంది సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 14 గంటల పోరాటం తర్వాత మొత్తం 12 మృతదేహాలను వెలికితీయగలిగారు. ప్రమాదం ఎలా జరిగిందనే కారణం తెలియాల్సిఉందని, దర్యాప్తు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే చైనా సుమారు 17 వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మించిన సంగతి తెలిసిందే.