![Highest Rate for Whale in Thailand - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/20/Thailand.jpg.webp?itok=S_H5MA-a)
బ్యాంకాక్: ఇదేమిటి? బూజుపట్టిన చపాతీ పిండా లేక ఇంకేదైనా అని ఆలోచిస్తూ.. బుర్రకు శ్రమ పెట్టకండి.. ఇది వేల్ వాంతి.. అనగా.. తిమింగలం కక్కు.. చీయాక్ అని అనమాకండి.. విషయం మొత్తం విన్నాక.. అదేదో మనింట్లోనే కక్కినా బాగుండు అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. దీని ధర రూ.2.09 కోట్లు మాత్రమే!! ఈ మధ్యే థాయ్‌లాండ్‌లోని సమీలా బీచ్ వద్ద ఓ మత్స్యకారుడికి దొరికింది. ఇసుకలో తెల్లటి ముద్దలాగ కనిపిస్తే.. ఏదో రాయి అనుకున్నాడట.
దగ్గరకు వెళ్లి చూస్తే.. ఇదేదో పనికొచ్చేదానిలాగ ఉంది అనుకుని.. ఇంటికి తీసుకెళ్లాడట. ఊర్లోని పెద్దోళ్లకు చూపిస్తే.. అసలు విషయం చెప్పారు. ఇది స్పెర్మ్ వేల్ వాంతి (అంబర్‌గ్రీస్).. సాధారణంగా నీళ్లపై తేలియాడుతూ కనిపిస్తాయి లేదా తీరానికి కొట్టుకొస్తాయి. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కంపు కొడుతుంది కానీ.. ఓసారి గట్టిపడ్డాక సువాసన వెదజల్లుతుంది. అందుకే దీనికి పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో తెగ క్రేజ్. దానికి తగ్గట్టుగానే ధర కూడానూ. తిమింగలం జీర్ణ వ్యవస్థలోని పిత్తాశయం నుంచి వెలువడ్డ స్రావం నుంచి ఇది తయారవుతుందట. గతంలో ఇంతకన్నా పెద్దది రూ.22 కోట్లకు అమ్ముడుపోయిందట.
Comments
Please login to add a commentAdd a comment