
వేల్స్: వేల్స్ యువరాణి డయానాకు చెందిన ఫోర్డ్ ఎస్కార్ట్ కారును వేలం వేశారు. కాగా వేలంలో దక్షిణ అమెరికాకు చెందిన ఓ మ్యుజీషియన్ ఆ కారును కొనుగోలు చేశాడు. డయానా వాడిన కారుకు వేలంలో 50 వేల పౌండ్స్‌కు పైగా ధర పలికింది. మన ఇండియన్ కరెన్సీలో కరెన్సీలో అయితే దాదాపు రూ.50 లక్షల కన్నా ఎక్కువ. ప్రస్తుతం డయానా వాడిన కారుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఒక పాతకారుకు ఇంత ధర అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ప్రిన్సెస్ డయానా 1961 లో జన్మించింది. 1981లో ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ చిన్న కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను వివాహం చేసుకుంది. 1981లో వారి వివాహానికి ముందు డయానాకు ఎంగేజ్‌మెంట్ గిఫ్ట్‌గా ప్రిన్స్ చార్లెస్ ఆ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఐదు డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారును డయానా 1982 ఆగస్టు వరకు ఉపయోగించింది. అయితే 36 ఏళ్ల వయసులో ఆగస్టు 31, 1997లో పారిస్‌కు వెళ్లిన డయానా ఘోరరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మోటార్‌బైక్‌ను తప్పించబోయి కారు పల్టీ కొట్టడంతో డయానా అక్కడికక్కడే మరణించారు.
చదవండి: యువతి క్లాసికల్ డ్యాన్స్; స్టెప్పులతో పెంపుడు కుక్క అదుర్స్
Comments
Please login to add a commentAdd a comment