Indians Largest Foreign Born Residents In England And Wales - Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్, వేల్స్‌ విదేశీ నివాసితుల్లో అత్యధికులు భారత్‌లో పుట్టిన వారే

Published Wed, Nov 9 2022 7:22 AM | Last Updated on Wed, Nov 9 2022 11:05 AM

Indians Largest Foreign Born Residents In England And Wales - Sakshi

లండన్‌: ఇంగ్లండ్, వేల్స్‌లో ఉండే ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టిన వారే కాగా, ఇందులో 1.5 శాతంతో భారతీయులు అగ్రభాగంలో ఉన్నట్లు తేలింది. ఇంగ్లండ్, వేల్స్‌లోని నివాసితుల్లో విదేశాల్లో జన్మించిన వారు 2011లో 75 లక్షల మంది (13.4%) ఉండగా, 2021 నాటికి కోటి మంది (16.8%)కి చేరారని యూకే ఆఫీస్‌ ఆఫ్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ (ఓఎన్‌ఎస్‌) గణాంకాలను వెలువరించింది.

ఇంగ్లండ్, వేల్స్‌ నివాసితుల్లో యూకే వెలుపల జన్మించిన వారిలో అత్యధికులు 9.20 లక్షల మంది భారత్‌కు చెందిన వారే. ఆ తర్వాతి స్థానంలో 7.43 లక్షల మంది (1.2%)తో పోలండ్, 6.24 లక్షల మంది (1%)తో పాకిస్తాన్‌ మూడో స్థానంలో నిలిచాయి. 2011లో చేపట్టిన గణాంకాల్లోనూ భారత్, పోలండ్, పాకిస్తాన్‌లే మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. కాగా, యూకేలోని స్కాట్లాండ్, నార్తర్న్‌ ఐర్లాండ్‌ ప్రాంతాల వివరాలను ఓఎన్‌ఎస్‌ పేర్కొనలేదు.

ఇదీ చదవండి: COP 27: పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement