Gareth Bale Says Appearance Record Will Nothing If Wales Does-Not Beat Iran - Sakshi
Sakshi News home page

FIFA WC: రికార్డులు ఎవరికి కావాలి.. ఇరాన్‌ను ఓడించకపోతే మేం ఇంటికే!

Published Fri, Nov 25 2022 4:54 PM | Last Updated on Fri, Nov 25 2022 5:58 PM

Gareth Bale Says Appearance Record Will Nothing Wales Does-Not Beat Iran - Sakshi

వేల్స్‌ సీనియర్‌ ఆటగాడు గారెత్‌ బేల్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయంగా వేల్స్‌ తరపున అత్యధిక మ్యాచ్‌ల్లో పాల్గొన్న తొలి ఆటగాడిగా గారెత్‌ బేల్‌ నిలిచాడు. ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్‌తో మ్యాచ్‌ గారెత్‌ బేల్‌కు 110వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. ఇంతకముందు వేల్స్‌ తరపున క్రిస్‌ గంటర్‌ 109 మ్యాచ్‌లు ఆడాడు. అమెరికాతో మ్యాచ్‌తో గారెత్‌ అతని సరసన చేరాడు. తాజాగా ఇరాన్‌తో మ్యాచ్‌ ఆడడం ద్వారా గంటర్‌ను అధిగమించిన గారెత్‌ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. 

ఇక ఈ వరల్డ్‌కప్‌లో అమెరికాతో జరిగిన తొలి పోరులో గారెత్‌ బేల్‌ గోల్‌ చేసి తన ఆటను షురూ చేశాడు. కాగా వేల్స్‌ తరపున ఫిఫా వరల్డ్‌కప్స్‌లో గోల్‌ చేసిన నాలుగో ఆటగాడిగా గారెత్‌ నిలిచాడు. ఇంతకముందు ఇవోర్‌ అల్‌చర్చ్‌(1958లో రెండు గోల్స్‌), జాన్‌ చార్ల్స్‌, టెర్రీ మెడ్విన్‌లు(1958) చెరొక గోల్‌ కొట్టారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకు గారెత్‌ బేల్‌ 12 గోల్స్‌ నమోదు చేయడం విశేషం.

ఇక ఈ వరల్డ్‌కప్‌లో వేల్స్‌ తమ ఆటను డ్రాతో ప్రారంభించింది. అమెరికాతో జరిగిన పోరులో వేల్స్‌ 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుంది. ఈ నేపథ్యంలో వేల్స్‌కు ఇరాన్‌తో పోరు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే వేల్స్‌ ముందంజ వేస్తుంది. అటు ఇరాన్‌ పరిస్థితి కూడా అంతే. ఈ నేపథ్యంలోనే గారెత్‌ బేల్‌.. ఇరాన్‌తో మ్యాచ్‌కు ముందు బీబీసీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు.

వేల్స్‌ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నారు.. ఇది ఎలా అనిపిస్తుంది అని ప్రశ్న వేశారు. దీనిపై గారెత్‌ స్పందిస్తూ.. ''దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడడం గొప్ప విషయమే. ఇరాన్‌ను ఓడించకపోతే మేం ఇంటిబాట పట్టే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు ఈ రికార్డులు సాధించి ఉపయోగమేంటి.. రికార్డులు కాదు ఇరాన్‌తో మ్యాచ్‌ గెలవడం నాకు ముఖ్యం'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement