ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఆ దేశపు ఆటగాళ్లు ఇంగ్లండ్తో ఆడిన తమ తొలి మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా మౌనం దాల్చిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఆటగాళ్లు నిరసన అందరిని ఆశ్చర్యపరిచింది. దేశం కోసం ఆడేటప్పుడు జాతీయ గీతం ఆలపించకుండా మౌనం పాటించడం మంచి పద్దతి కాదని ఇరాన్ జట్టు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లవెత్తాయి.
దీనిని సీరియస్‌గా తీసుకున్న ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తమ జట్టు ఆటగాళ్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ఈ మీటింగ్ లో ఐఆర్సీజీ ప్రతినిధులు.. ఫుట్‌బాల్ ప్లేయర్లను మందలించారని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు ముందు గానీ.. ఆట జరిగే సమయంలో గానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జైలుకు పంపిస్తామన్నారు. అంతేకాదు ఆటగాళ్ల కుటుంబాలకు టార్చర్ అంటే ఏంటో చూపెడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
మ్యాచ్ కు ముందు అన్ని జట్ల మాదిరిగానే నిబంధలను పాటించాలని, నిరసనలు, మౌనం వహించడం వంటి చర్యలకు దిగితే సహించేది లేదని ఐఆర్‌జీసీ పేర్కొన్నట్లు సమాచారం.మరోసారి అలా చేస్తే జైలు శిక్ష తప్పదని.. ఆటగాళ్ల కుటుంబాలకు కూడా నరకం చూపిస్తామని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐఆర్‌జీసీ బెదిరింపులకు భయపడిన ఇరాన్ జట్టు ఇంగ్లండ్‌తో మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా నిరసన తెలిపిన ఇరాన్.. తర్వాత వేల్స్ తో మ్యాచ్ లో మాత్రం యథావిధిగా జాతీయ గీతాలపన చేసింది.
ఇక గ్రూప్ స్టేజ్ లో భాగంగా బుధవారం (నవంబర్ 30) ఆ జట్టు యూఎస్ఏతో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో సక్రమంగా ఉండాలని, గెలిచినా ఓడినా ఫర్వాలేదు గానీ పిచ్చి వేషాలేస్తే మాత్రం తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐఆర్‌జీసీ హెచ్చరించినట్లు సీఎన్‌ఎన్ తన కథనంలో పేర్కొంది.
చదవండి: FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?'
Comments
Please login to add a commentAdd a comment