
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో రెండోరోజే రక్తం చిందింది. సోమవారం రాత్రి ఇంగ్లండ్, ఇరాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆట ప్రారంభంలోనే ఇరుజట్లు పోటాపోటీగా మ్యాచ్‌ను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆట 8వ నిమిషంలో ఇరన్ గోల్‌కోపర్ అలీరెజా బీరన్వాండ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్ స్టార్ స్ట్రైకర్ హ్యారీ కేన్ కొట్టిన క్రాస్ షాట్ గోల్ అడ్డుకునేందుకు గోల్ కీపర్ అలీరెజాతో పాటు ఢిపెండర్ మాజిద్ హొస్సేనీ దూసుకొచ్చారు.
ఈ సమయంలోనే ఇద్దరి తలలు బలంగా గుద్దుకోవడంతో కిందపడిపోయారు. ఈ నేపథ్యంలో అలీరెజా ముక్కు నుంచి రక్తం దారలా కారసాగింది. ఇద్దరికి గాయాలైనప్పటికి అలీరెజాకు కాస్త ఎక్కవగా తగిలినట్లు కనిపించింది. చికిత్స అనంతరం పది నిమిషాల తర్వాత ఆట మళ్లీ మొదలైంది. అయితే 30 సెకన్ల తర్వాత అలీరెజా మరోసారి గ్రౌండ్‌లో పడిపోయాడు. తనవల్ల కావడం లేదని రిఫరీకి చెప్పడంతో అతన్ని స్ట్రెచర్‌పై బయటికి తీసుకెళ్లారు. అలీరెజా స్థానంలో హొస్సేన్ హొస్సీనీ సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ 6-2 తేడాతో భారీ విజయం సాధించింది.
అయితే అలీరెజాకు ఇలాంటి గాయాలు కొత్త కాదు. అతను ఫుట్‌బాల్‌లో గోల్‌కీపర్‌గా మారిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది. ఇరాన్‌లోని సరాబ్-ఎ-ఆస్ గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు అలీరెజా. తండ్రి గొర్రెల కాపరి కావడంతో అలీరెజాను అదే పనికి పంపించాడు. కానీ అతనికి ఫుట్‌బాలర్ అవ్వాలన్న బలమైన కోరిక ఉండేది. ఆ కోరికను తీర్చుకునేందుకు అలీరెజా తన స్వగ్రామం నుంచి టెహ్రాన్‌కు పారిపోయాడు.
అక్కడే ఒకప్పటి స్టార్ అలీ దయీతో అలీరెజాకు పరిచయం ఏర్పడింది. ఫుట్‌బాలర్‌గా మారాలనే కోరిక అతనిలో మరింత బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే ఒక కోచ్‌ను బతిమిలాడి రాయితీ పొంది ఒక క్లబ్‌లో చేరాడు. అలా క్రమంగా ఫుట్‌బాలర్‌గా మారాడు. 2015లో తొలిసారి ఇరాన్ గోల్‌కీపర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక చిన్నప్పటి నుంచి అలీరెజాకు రాయిని ఎక్కువదూరం విసరడం అలవాటు. అదే అతన్ని ప్రత్యేక ఆటగాడిగా మార్చింది.2016లో దక్షిణ కొరియాతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బంతిని 61.26 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
Kayserispor'da forma giyen Majid Hosseini ile Alireza Beiranvand fena çarpıştı. pic.twitter.com/txM07nqjA3
— Burak Zihni 🇹🇷 (@burakzihni61) November 21, 2022
చదవండి: FIFA : రిపోర్టర్‌కు చేదు అనుభవం.. పోలీసుల జవాబు విని షాక్