వేల్స్: అనురాగాలు, అప్యాయతలు మసకబారుతున్న రోజులివి.స్వార్థంతో సొంతవాళ్లనే దూరం చేస్తున్నాం. అవసరాన్ని బట్టి అప్యాయతగా మాట్లాడుతున్న ఈ రోజుల్లో ప్రేమానురాగాలు బతికే ఉన్నాయని నిరూపించాడు ఓ పెద్దాయన. పొరుగింటి చిన్నారితో ఏర్పడిన అనుభందాన్ని చనిపోతూ కూడా మర్చిపోలేకపోయాడు. తాను చనిపోయినా కూడా తన జ్ఞాపకాలు చిన్నారి వద్ద ఉండాలని 14 క్రిస్మస్ బహుమతులు అందిచారు. ఆ చిన్నారికి 16 ఏళ్లు వచ్చే వరకూ ఏడాదికి ఒకటి చొప్పున 14 బహుమతులు అందించాలని తన కుటుంభ సభ్యులకు సూచించారు.
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని వేల్స్ నగరానికి చెందిన కెన్ వాట్సన్(87) ఒంటరిగా నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిత్రం వాట్సన్ పొరుగింట్లోకి ఓవెన్ విలియమ్స్ తన కుటుంబంతో కలిసి కిరాయికి వచ్చి చేరారు. ఆ ఫ్యామిలీతో పరిచయం ఏర్పడ్డాక వాట్సన్ వారిని తన కుటుంబ సభ్యులవలే భావించారు. ఓవెన్ విలియమ్స్ కూతురు కాడి విలియమ్స్‌ను సొంత మనువరాలిగా భావించేవాడు. ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి ఆడిస్తూ.. ఎక్కువ సమయం తనతోనే గడిపేవాడు. కాడి విలియమ్స్ కూడా వాట్సన్‌ను సొంత తాతలాగా భావించి ఆయనతోనే ఉండేది. ప్రతి క్రిస్మస్‌కి బహుమతులు కొనిచ్చేవాడు. తాను 100 ఏళ్ల వరకు జీవిస్తానని, అప్పటి వరకూ కాడి నాతోనే ఉంటుందని తరచూ చెప్పేవాడు. వాట్సన్ ఆరోగ్యం క్షీణించడంతో గత అక్టోబర్‌లో తనువు చాలించారు.
కాగా ఇటీవలే ఒవెన్ ఇంటికి వాట్సన్ కూతురు ఓ పెద్ద బ్యాగ్‌తో వచ్చారు. చనిపోయే ముందు ఈ బ్యాగ్‌ను కాడికి ఇవ్వాలని తన తండ్రి కోరారని చెప్పి ఆమె వెళ్లిపోయారు. ఆ బ్యాగ్ విప్పి చూడగా 14 బహుమతులు ఉన్నాయి. అవి ఏడాదికి ఒకటి చొప్పున కాడికి ఇవ్వాలని లేఖ రాసి ఉంది. కాడికి 16 ఏళ్లు వచ్చే వరకూ ఈ బహుమతులు అందించాలని కోరారు. ఆ బహుమతులు చూసి కాడి తల్లిదండ్రులు దుఃఖాన్ని దిగమింగుకోలేక పోయారు.
Our elderly neighbour passed away recently. His daughter popped round a few moments ago clutching a large plastic sack. In the sack were all the Christmas presents he’d bought for *our* daughter for the next thirteen years. 😢 pic.twitter.com/6CjiZ99Cor
— Owen Williams 🏴 (@OwsWills) December 17, 2018
ఈ విషయాన్ని కాడి తండ్రి ఓవెన్ విలియమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కూతురిపై ప్రేమతో పొరుగింటి పెద్దాయన చనిపోతూ కూడా బహుమతులు అందించారని, ఆయన కోరిక మేరకు ప్రతి క్రిస్మస్ పండుగకి ఒక గిఫ్ట్ చొప్పున ఆ 14 బహుమతులను అందిస్తానని చెప్పారు. ఇప్పుడా పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాట్సన్ చేసిన పని క్రిస్మస్ పండగకి ప్రతీక అని, ఈ రోజుల్లో అంతటి ప్రేమ చూపిన పెద్దాయనకు హ్యాట్సాప్ అంటూ నెటిజట్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment