Christmas gifts
-
క్రిస్మస్ కానుకలకు కూటమి ఎగనామం
-
క్రిస్మస్ తాత గురించి ఈ విశేషాలు తెలుసా?
క్రిస్మస్.. ఈ పేరు వినగానే సంబరాలు గుర్తొస్తాయి. యేసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా పాటలు పాడుకుంటూ, సంతోషాన్ని పంచుకుంటూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సన్నివేశాలూ కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు మరో వ్యక్తి కూడా తప్పక గుర్తొస్తారు. ప్రత్యేకించి చిన్నపిల్లలైతే ఆయన్ను గుర్తుతెచ్చుకోకుండా క్రిస్మస్ పండుగను జరుపుకోరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయనే శాంటా క్లాస్.. ముద్దుగా క్రిస్మస్ తాత అని పిలుచుకుంటారు. తెల్ల జుట్టు, పొడవాటి తెల్ల గడ్డం, ఎరుపు, తెలుపు కలిగిన టోపీని, దుస్తులను ధరించి వచ్చే క్రిస్మస్ తాతను మనం చూసే ఉంటాం. పిల్లలకు బహుమతులు ఇస్తూ, వారిని ఉత్సాహపరుస్తూ క్రిస్మస్ తాత (వేషం వేసిన వ్యక్తి) సందడి వాతావరణం సృష్టిస్తాడు. క్రిస్మస్ సందర్భంగా జరిగే కరోల్స్ లో పిన్నలూ, పెద్దలు సైతం శాంటా క్లాజ్ వేషంలో ఉన్న వ్యక్తి వెంట తిరుగుతూ ఉండటం చూస్తుంటాం. అయితే ఈ క్రిస్మస్ తాత ఎక్కడ నుంచి వచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా! పండుగ నుంచి ఆయన్ను వేరు చేయలేనంతగా ఆయన ఎందుకు మారారో తెలుసా ! ఆయనో బిషప్.. స్థానికంగా క్రైస్తవుల మతపెద్దగా వ్యవహరించే వ్యక్తిని బిషప్ అని పిలుస్తారు. క్రిస్మస్ తాతగా పేరొందిన వ్యక్తి కూడా ఓ బిషప్. ఆయన పేరు నికోలస్. ఆయన ప్రస్తుత టర్కీ లోని మైరా ప్రాంతానికి బిషప్ గా పని చేశారు. ఆయన క్రీ. శ. 280వ సంవత్సరానికి చెందినవారు. తండ్రి నుంచి తనకు వచ్చిన ఆస్తులను అవసరాల్లో ఉన్న వారికి దానం చేసిన గొప్ప వ్యక్తి నికోలస్. ప్రత్యేకించి క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఆయన పేదవారి ఇళ్లకు మారు వేషంలో వెళ్లేవారు. వెళ్తూ వెళ్తూ తనతో పాటు బహుమతులను, కొంత డబ్బును తీసుకొని వెళ్లి ఆ పేదలకు అందించేవారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి మాయం అయ్యేవారు. దీంతో ఆయన గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. అమెరికాలో, యూరప్ దేశాల్లో ఆయన మంచి ప్రాచుర్యం పొందాడు. సాయమే లక్ష్యం.. పండుగ అంటే మన దగ్గర ఉన్నదాంతో మనమే సుఖంగా బతకడం కాదు.. మన చుట్టూ ఉన్న నలుగురి ముఖాల్లో చిరునవ్వు కలిగించడం అని మనసా వాచా కర్మణా నమ్మిన వ్యక్తి సెయింట్ నికోలస్. పేదవారికి సాయం చేయడం కోసం ఆస్తి మొత్తాన్ని ధారాదత్తం చేసేవారు ఎవరుంటారు ? కానీ ఆయన ఆ పని చేశారు. అందుకే ప్రతి క్రిస్మస్ నాడు.. క్రిస్మస్ తాత వచ్చి బహుమతులు ఇస్తాడని పిల్లలంతా నమ్మేంతగా అతడు ఈ పండుగలో చొచ్చుకుపోయాడు. శాంటా క్లాస్ – క్రిస్మస్ ఫ్యాక్ట్స్.. క్రిస్మస్ తాత నిజానికి నీలి రంగు దుస్తులు ధరించేవారు. అయితే 1930లలో కోకాకోలా కంపెనీ వారు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఎరుపు రంగు వాడారు. అవి బాగా ప్రాచుర్యం పొందటంతో క్రిస్మస్ తాత కాస్ట్యూమ్స్ ఎరుపు, తెలుపు రంగులు సంతరించుకున్నాయి. బరువైన క్రిస్మస్ గిఫ్ట్: సుప్రసిద్ధ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని 1886లో ఫ్రాన్స్ దేశం అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. దాని బరువు 225 టన్నులు. దీంతో ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత బరువైన క్రిస్మస్ బహుమతిగా పేరొందింది. – సృజన్ సెగెవ్ -
25 ఇళ్లు దానం చేసిన స్టార్ హీరో!
సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేసే హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నాడు. క్రిస్మస్ పండగను కలకాలం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఆయన నిలువ నీడ లేని పేదల కోసం ఇళ్లు సిద్ధం చేయించాడు. అలా ఏకంగా 25 ఏళ్లను దానం చేసి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ.. 'క్రిస్మస్ పండగను నేను ముందుగానే జరుపుకుంటున్నా. తలదాచుకోవడానికి ఇల్లు లేని వారి కోసం 25 ఇళ్లను రెడీ చేయించాను. వీటిలో నివసించబోతున్న హీరోలకు ఇదే నా స్వాగతం.. వారితో కొంత సమయాన్ని గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశాడు. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ వాటిని ఇళ్లుగా పరిగణించవద్దని కోరుతున్నారు. వాటిని చూస్తుంటే కేవలం తాత్కాలిక షెల్టర్స్లాగే కనిపిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆర్నార్డ్ చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా యాక్షన్ చిత్రాలతో అలరించిన ఆర్నాల్డ్ 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గానూ పని చేశాడు. Today, I celebrated Christmas early. The 25 homes I donated for homeless veterans were installed here in LA. It was fantastic to spend some time with our heroes and welcome them into their new homes. pic.twitter.com/2mHKfoZ65V — Arnold (@Schwarzenegger) December 24, 2021 -
నానమ్మకు మేమిచ్చిన ఉత్తమ కానుక ఇదేనేమో
-
'మేమిచ్చిన ఉత్తమ కానుక ఇదేనేమో'
ప్రపంచంలో ఎక్కడైనా భార్యభర్తల మధ్య ఉండే అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఒక బామ్మకు ఆమె కుటుంబసభ్యులు ఒక గిఫ్ట్‌బాక్స్‌ను కానుకగా ఇచ్చారు. ఆమె బాక్స్‌ను ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారిగా బావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ ఆ బాక్స్‌లో ఉన్నవి ఏంటో తెలుసా.. తన భర్త ఆమెకు రాసిన ప్రేమ ఉత్తరాలు. అందుకే మనల్ని ప్రేమించేవారు దూరమైనా మనకంటూ కొన్ని జ్ఞాపకాలను విడిచి వెళ్లిపోతారని ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. 'మా తాతయ్య చనిపోయి 7నెలలు అవుతుంది. అయితే తాతయ్య లేకుండా మొదటిసారి నానమ్మ జరుపుకుంటున్న క్రిస్మస్ పండుగ కావడంతో తనకు ఏదైనా మరిచిపోలేని కానుకను ఇవ్వాలనుకున్నా. మా నానమ్మ, తాతయ్యలది ప్రేమవివాహం. కాగా మా తాతయ్య 1962లో వారి కాలేజ్ డేస్‌లో నానమ్మకు రాసిన ప్రేమలేఖలు మాకు దొరికాయి. కానీ ఆ ప్రేమలేఖలను మా తాతయ్య చనిపోయేవరకు తన దగ్గరే భద్రపరచుకున్నారు. వీటిని ఒక కానుక రూపంలో మా నానమ్మకు అందజేయగానే ఆమె బావోద్వేగానికి గురవడం నేను చూశాను. దీంతో నానమ్మకు నేనిచ్చిన ఉత్తమ కానుక ఇదే కావొచ్చు' అంటూ ట్వీట్ చేసింది. ఈ వీడియోనూ కాస్తా ఆమె తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 16 మిలియన్ల మంది వీక్షించారు. 'నేను చూసిన వీడియోల్లో ఇది నా హృదయాన్ని కదిలించింది' అంటూ ఒకరు ట్వీట్ చేశారు. 'మీ నానమ్మ ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నట్లు పలువురు కామెంట్లు పెట్టారు. -
క్రిస్మస్కు చెత్త గిఫ్ట్, కానీ ఆ చిన్నారి రియాక్షన్..!
-
చెత్త గిఫ్ట్, కానీ ఆ చిన్నారి రియాక్షన్!
క్రిస్మస్ పండుగ వస్తుందంటే.. చిన్నారుల హడావుడి చెప్పనలవి కాదు. స్వీట్లు, కేకులు, సర్ప్రైజ్లు అబ్బో.. ఇది పిల్లలు మర్చిపోలేని పండగ అనుకోండి. చిన్న గిఫ్ట్ అందుకున్నా సరే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే ఇక్కడ చెప్పుకునే చిన్నారికి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాకవకుండా ఉండలేరు. యూట్యూబర్ జస్టిస్ మొజికా తన రెండేళ్ల కూతురితో ప్రాంక్ వీడియో చేద్దామనుకుంది. క్రిస్మస్ పండగ సందర్భంగా కూతురికి గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొచ్చింది. చిట్టిచిట్టి చేతులతో గిఫ్ట్‌ను తెరచి చూస్తే అందులో ఉన్నది అరటిపండు. కానీ ఆ చిన్నారి తల్లి ఇచ్చిన సర్ప్రైజ్కు ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగించినా నమ్మక తప్పదు. పాపం, పసిపిల్లకు అరటిపండు ఇచ్చి మోసం చేశారని మనకు కోపం రావచ్చు కానీ ఆ చిన్నారి రియాక్షన్ చూసి ముచ్చటపడని నెటిజన్ ఉండడంటే నమ్మండి. అరటిపండును అందుకున్న చిన్నారి అమితాశ్చర్యంతో కళ్లింత చేసుకుని ఆనందంతో గంతులు వేసింది. ‘బనానా.. బనానా..’ అంటూ కేరింతలు కొట్టింది. ఎంతగానో సంబరపడింది. ముద్దుముద్దు మాటలతో అరటి పండు తొక్కతీసి ఇవ్వమని తల్లిని అడిగింది. తొక్కతీయగానే వెంటనే పట్టలేని సంతోషంతో అరటింపడును అమృతంలా ఆరగించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 20 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. -
‘నాకు మంచి నాన్న కావాలి’
క్రిస్మస్ పండగను ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. సాంటాక్లాజ్ తెచ్చే బహుమతుల కోసం చిన్నారులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ వస్తుండటంతో అందరూ పండగ ఏర్పాట్లలో మునిగిపోయారు. తమకు కావాల్సిన వస్తువులు, దుస్తులు కొనుక్కోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చిన్నారి క్రిస్మస్ తాతకు లేఖ రాశాడు. తన కోసం కొన్ని వస్తువులు తీసుకురావాలంటూ సాంటాతాతను కోరాడు. అమెరికాలోని టెక్సాస్‌లో గృహ హింస బాధితుల ఆశ్రమంలో ఓ మహిళ తన ఏడేళ్ల చిన్నారితో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కుమారుడి బ్యాగులోని లేఖను చూసి తల్లి ఆశ్చర్యానికి లోనైంది. విషయం తెలిసిన ఆశ్రమ అధికారి ఒకరు ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఉత్తరంలో ‘‘మేము మా ఇంటిని వదిలేయాల్సి వచ్చింది. మా నాన్నకు మతిస్థిమితం లేదు. మేము అన్నీ కోల్పోయాం. అయినా సరే, మేము భయపడాల్సిన అవసరం లేదని, మమ్మల్ని నీవు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తావని అమ్మ చెప్పింది. ఈ క్రిస్మస్కు మీరు నా దగ్గరకు వస్తున్నారా..! నా దగ్గర ఏమీ లేవు. అందుకని మీరు నాకోసం కొన్ని పుస్తకాలు, డిక్షనరీ, కంపాస్ తీసుకురాగలరా.. అలాగే నాకు మంచి నాన్న కావాలి. మీరు అది చేయగలరా? ప్రేమతో బ్లాక్’ అంటూ బాలుడు తన ఆవేదనను పేర్కొన్నాడు. లేఖలో కేవలం బాలుడి పేరును మాత్రం మార్చి పోస్ట్ చేశారు. ఈ లేఖ.. చదివిన వారందరి మనసులను కట్టిపడేస్తుంది. కాగా యునైటెడ్ స్టేట్స్లో ప్రతి నిమిషానికి సగటున 20 మంది తమ భాగస్వామితో గృహ హింసకు గురవుతున్నారని ఓ జాతీయ నివేదిక పేర్కింది. ఈ లెక్కన ఎంత మంది మహిళలు శారీరక, మానసిక వేదనకు గురవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. -
క్రిస్మస్ గిఫ్ట్‌లు రెడీ
పేదలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికే.. నిరుపేదలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేయడంతో పాటు విందు కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలో 4వేల మందికి క్రిస్మస్ దుస్తులు మంజూరయ్యాయి. ఈ దుస్తుల పంపిణీ మంగళవారం నుంచి మొదలుకానుంది. ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది చొప్పున జిల్లాలో 4వేల మందికి ప్రేమవిందుకు రూ. 8లక్షలు వచ్చాయి. – ఎల్.శ్రీనివాస్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అర్వపల్లి (నల్గొండ) : క్రిస్మస్ గిఫ్ట్‌లు వచ్చేశాయి. ఈనెల 10వ తేదీనుంచి జిల్లాలో దుస్తులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పేదలు సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రతి ఏటా దుస్తుల పంపిణీతో పాటు విందు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ క్రైస్తవులకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంబంధించి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ సారి క్రిస్మస్కు క్రైస్తవుల కోసం జిల్లాలో 4వేల జతల దుస్తులు రాగా పంపిణీకి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25న జరిగే క్రిస్మస్కు ముందే దుస్తుల పంపిణీ, విందు పూర్తికానుంది. జిల్లాలో 4వేల మంది క్రైస్తవులకు.. జిల్లాలో 16వేల మంది క్రైస్తవులు ఉండగా ఇందులో 4వేల మంది పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో 4వేల మందికి దుస్తులు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి సంబంధించిన గిఫ్ట్ ప్యాకెట్లను ఇప్పటికే హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రాలకు చేర్చారు. సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు సోమవారం దుస్తులను చేర్చనున్నారు. ఈ నెల 10 తేదీ నుంచి నుంచి గ్రామాల వారీగా దుస్తుల పంపిణీ మొదలు కానుంది. ప్రేమ విందుకు రూ. 8లక్షలు మంజూరు: క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ప్రేమవిందుకు ప్రభుత్వం జిల్లాకు రూ. 8లక్షలు మంజూరు చేసింది. అయితే ఒక్కో నియోజకవర్గానికి రూ. 2లక్షల చొప్పున జిల్లానుంచి సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నాలుగు నియోజకవర్గాలకు ఈ నిధులు కేటాయించారు. నియోజకవర్గానికి 1,000 మంది క్రైస్తవులకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి నుంచి19 వరకు ప్రేమవిందు కార్యక్రమం పూర్తికానుంది. దీనికోసం మండలాల వారీగా తహసీల్దార్లు.. క్రైస్తవులతో కమిటీలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. -
ఆ బహుమతులు చూసి.. కన్నీటి పర్యంతమయ్యారు!
వేల్స్: అనురాగాలు, అప్యాయతలు మసకబారుతున్న రోజులివి.స్వార్థంతో సొంతవాళ్లనే దూరం చేస్తున్నాం. అవసరాన్ని బట్టి అప్యాయతగా మాట్లాడుతున్న ఈ రోజుల్లో ప్రేమానురాగాలు బతికే ఉన్నాయని నిరూపించాడు ఓ పెద్దాయన. పొరుగింటి చిన్నారితో ఏర్పడిన అనుభందాన్ని చనిపోతూ కూడా మర్చిపోలేకపోయాడు. తాను చనిపోయినా కూడా తన జ్ఞాపకాలు చిన్నారి వద్ద ఉండాలని 14 క్రిస్మస్ బహుమతులు అందిచారు. ఆ చిన్నారికి 16 ఏళ్లు వచ్చే వరకూ ఏడాదికి ఒకటి చొప్పున 14 బహుమతులు అందించాలని తన కుటుంభ సభ్యులకు సూచించారు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని వేల్స్ నగరానికి చెందిన కెన్ వాట్సన్(87) ఒంటరిగా నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిత్రం వాట్సన్ పొరుగింట్లోకి ఓవెన్ విలియమ్స్ తన కుటుంబంతో కలిసి కిరాయికి వచ్చి చేరారు. ఆ ఫ్యామిలీతో పరిచయం ఏర్పడ్డాక వాట్సన్ వారిని తన కుటుంబ సభ్యులవలే భావించారు. ఓవెన్ విలియమ్స్ కూతురు కాడి విలియమ్స్‌ను సొంత మనువరాలిగా భావించేవాడు. ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి ఆడిస్తూ.. ఎక్కువ సమయం తనతోనే గడిపేవాడు. కాడి విలియమ్స్ కూడా వాట్సన్‌ను సొంత తాతలాగా భావించి ఆయనతోనే ఉండేది. ప్రతి క్రిస్మస్కి బహుమతులు కొనిచ్చేవాడు. తాను 100 ఏళ్ల వరకు జీవిస్తానని, అప్పటి వరకూ కాడి నాతోనే ఉంటుందని తరచూ చెప్పేవాడు. వాట్సన్ ఆరోగ్యం క్షీణించడంతో గత అక్టోబర్‌లో తనువు చాలించారు. కాగా ఇటీవలే ఒవెన్ ఇంటికి వాట్సన్ కూతురు ఓ పెద్ద బ్యాగ్‌తో వచ్చారు. చనిపోయే ముందు ఈ బ్యాగ్‌ను కాడికి ఇవ్వాలని తన తండ్రి కోరారని చెప్పి ఆమె వెళ్లిపోయారు. ఆ బ్యాగ్ విప్పి చూడగా 14 బహుమతులు ఉన్నాయి. అవి ఏడాదికి ఒకటి చొప్పున కాడికి ఇవ్వాలని లేఖ రాసి ఉంది. కాడికి 16 ఏళ్లు వచ్చే వరకూ ఈ బహుమతులు అందించాలని కోరారు. ఆ బహుమతులు చూసి కాడి తల్లిదండ్రులు దుఃఖాన్ని దిగమింగుకోలేక పోయారు. Our elderly neighbour passed away recently. His daughter popped round a few moments ago clutching a large plastic sack. In the sack were all the Christmas presents he’d bought for *our* daughter for the next thirteen years. 😢 pic.twitter.com/6CjiZ99Cor — Owen Williams 🏴 (@OwsWills) December 17, 2018 ఈ విషయాన్ని కాడి తండ్రి ఓవెన్ విలియమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కూతురిపై ప్రేమతో పొరుగింటి పెద్దాయన చనిపోతూ కూడా బహుమతులు అందించారని, ఆయన కోరిక మేరకు ప్రతి క్రిస్మస్ పండుగకి ఒక గిఫ్ట్ చొప్పున ఆ 14 బహుమతులను అందిస్తానని చెప్పారు. ఇప్పుడా పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాట్సన్ చేసిన పని క్రిస్మస్ పండగకి ప్రతీక అని, ఈ రోజుల్లో అంతటి ప్రేమ చూపిన పెద్దాయనకు హ్యాట్సాప్ అంటూ నెటిజట్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
20 నుంచి చంద్రన్న క్రిస్మస్ కానుకలు: ప్రత్తిపాటి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి చంద్రన్న క్రిస్మస్ కానుకలను ఉచితంగా పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అలాగే, జనవరి 1వ తేదీ నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు అందిస్తామన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న కోటీ 43లక్షల 30వేల కార్డుదారులకు రూ.360కోట్లతో చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు, జనవరి 1 నుంచి ఇతర రేషన్ సరుకులతో కలిపి చంద్రన్న సంక్రాంతి కానుకలను అందిస్తామని మంత్రి తెలిపారు. -
20న ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ ప్రారంభం
అనంతపురం టౌన్ : సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 20న ’చంద్రన్న క్రిస్మస్ కానుక’ పంపిణీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆదివారం అనంతపురంలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విజయవాడలోని ఎనికేపాడులోగల చౌక దుకాణం(నంబర్–6)లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. కోటి 34 లక్షల కార్డుదారులకు ఉచితంగా ఆరు రకాల సరుకులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 26 వరకు క్రిస్మస్ కానుకలు, జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇచ్చేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పంపిణీ సమయంలో నాణ్యతలేని సరుకులను తిరస్కరించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. చంద్రన్న కానుకల కోసం రూ.460 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. -
నాన్న.. దివి నుండి దిగిరావా?
ఆ పిల్లాడిది అమాయకత్వమో... తిరిగిరాని లోకాలకు వెళ్లిన తండ్రే.. తన కోరికలన్నీ తీరుస్తాడనే నమ్మకమో.. లేక.. ఎవరినడగాలో తెలియని నిస్సాహయతో... క్రిస్మస్ బహుమతుల కోసం తండ్రికి లేఖ రాశాడు.. స్వర్గంలో ఉన్న తండ్రికి పంపేందుకు దానికి ఓ బెలూన్ కట్టాడు.. నాన్నకు చేరని ఆ లేఖ.. ఇప్పుడు ఎంతోమంది కన్న తండ్రులను కన్నీరు పెట్టిస్తోంది. బహుమతులిచ్చి ఆ పిల్లాడిని ఊరుకోబెడదామంటే.. పిల్లాడు లేడు.. లేఖ మాత్రమే ఉంది. ఫొటోగ్రాఫర్ మెక్‌కోల్ స్నేహితులతో కలిసి బల్ములే ప్రాంతంలోని ఓ ఫోర్స్టార్ హోటల్ సమీపంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దూరంగా ఓ బెలూన్ మెరుస్తూ కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే దానికో పేపర్ కట్టి ఉంది. అందులో ఏవో బొమ్మలు.. ఇంకేదో రాసి ఉంది. చదివితే.. ఓ పిల్లాడు తన తండ్రికి రాసిన లెటర్ అది. దానిని చదివిన మెక్‌కోల్ కళ్లు చెమర్చాయి. గుండె కరిగిపోయింది. రెండు పెదాలను పళ్లకింద అదిపెడుతూ.. గుండెలో నుంచి వస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఆ బాధ కళ్లల్లో నుంచి కన్నీరుగా బయటకు వచ్చేస్తోంది. స్నేహితులు దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. వారంతా లేఖ చదివారు. వారిదీ అదే పరిస్థితి. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే... ‘హాయ్ డాడ్... నిన్ను చాలా మిస్సవుతున్నానని చెప్పేందుకే ఈ లేఖ రాస్తున్నా. నాకు బాధేస్తుందనే విషయం నీకు తెలుసు. అమ్మ కూడా జ్వరమొచ్చినప్పుడు ఎలా ఉంటుందో.. అలాగే ఉంది. రేపు మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం. స్కూల్‌ను, నిన్ను నిజంగానే మిస్సవుతున్నా. నాకు తెలుసు పైనున్న స్వర్గంలో నువ్వు క్షేమంగా ఉన్నావని. అందుకే ఇక్కడి నుంచి వెళ్లేముందు నాకు క్రిస్మస్ బహుమతులుగా ఏమేం కావాలో ఓ లిస్ట్ రాసి నీకు పంపుతున్నా. నా కలలన్నీ నీ గురించే.. నా ఆలోచనలు, ఆశలన్నీ నీ గురించే.. నా నమ్మకం నీపైనే. అందుకే ఈ లెటర్ నీకు పంపుతున్నా. ఇది నా క్రిస్మస్ బహుమతుల జాబితా: బూట్లు, స్టడ్స్, రీబౌండర్ నెట్, న్యూ ప్రీమియర్ లీగ్ బాల్, రియల్ మాడ్రిడ్ జెర్సీ, షార్ట్స్, రుబిక్స్ క్యూబ్. ..బై బై డాడీ. లవ్ యూ. ‘లేఖను చదివిన తర్వాత నాకు ఏడుపు ఆగలేదు. అలాగే ఇంటకెళ్లిపోయా. ఆలోచిస్తూ కూర్చున్నా. కనీసం సోషల్ మీడియాలో వివరాలను పోస్ట్ చేస్తే ఆ పిల్లాడి ఆచూకీ తెలుస్తుందని, ఎక్కడున్నా నేనే స్వయంగా వెళ్లి బహుమతులు అందజేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రిస్మస్కు జీసస్‌ను ఒకటే కోరుతున్నా... ఎవరి ద్వారానైనా ఆ పిల్లాడి ఆచూకీ తెలియాలి. నేను బహుమతులు అందజేయాలి’ – మెక్‌కోల్ -
క్రిస్మస్కి కేసీఆర్ వరాల జల్లు