స్మస్ పండుగ వస్తుందంటే.. చిన్నారుల హడావుడి చెప్పనలవి కాదు. స్వీట్లు, కేకులు, సర్‌ప్రైజ్‌లు అబ్బో.. ఇది పిల్లలు మర్చిపోలేని పండగ అనుకోండి. చిన్న గిఫ్ట్ అందుకున్నా సరే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే ఇక్కడ చెప్పుకునే చిన్నారికి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాకవకుండా ఉండలేరు. యూట్యూబర్ జస్టిస్ మొజికా తన రెండేళ్ల కూతురితో ప్రాంక్ వీడియో చేద్దామనుకుంది. క్రిస్‌మస్ పండగ సందర్భంగా కూతురికి గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొచ్చింది. చిట్టిచిట్టి చేతులతో గిఫ్ట్‌ను తెరచి చూస్తే అందులో ఉన్నది అరటిపండు. కానీ ఆ చిన్నారి తల్లి ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగించినా నమ్మక తప్పదు.