సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేసే హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నాడు. క్రిస్‌మస్ పండగను కలకాలం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఆయన నిలువ నీడ లేని పేదల కోసం ఇళ్లు సిద్ధం చేయించాడు. అలా ఏకంగా 25 ఏళ్లను దానం చేసి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ.. 'క్రిస్‌మస్ పండగను నేను ముందుగానే జరుపుకుంటున్నా. తలదాచుకోవడానికి ఇల్లు లేని వారి కోసం 25 ఇళ్లను రెడీ చేయించాను. వీటిలో నివసించబోతున్న హీరోలకు ఇదే నా స్వాగతం.. వారితో కొంత సమయాన్ని గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశాడు.
దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ వాటిని ఇళ్లుగా పరిగణించవద్దని కోరుతున్నారు. వాటిని చూస్తుంటే కేవలం తాత్కాలిక షెల్టర్స్‌లాగే కనిపిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆర్నార్డ్ చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా యాక్షన్ చిత్రాలతో అలరించిన ఆర్నాల్డ్ 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గానూ పని చేశాడు.
Today, I celebrated Christmas early. The 25 homes I donated for homeless veterans were installed here in LA. It was fantastic to spend some time with our heroes and welcome them into their new homes. pic.twitter.com/2mHKfoZ65V
— Arnold (@Schwarzenegger) December 24, 2021
Comments
Please login to add a commentAdd a comment