పక్షుల కిలకిలారావాలు ఎవరినైనా మైమరపిస్తాయి. ఇక వాటి రూపం కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. ఉత్తర అమెరికాలో క్రిస్మస్ సీజన్లో అందమైన వెర్మిలియన్ పక్షులు సందడి చేస్తుంటాయి. అందుకే వాటిని క్రిస్మస్ పక్షులని అంటారు. ఇవి ఎరుపురంగులో ఆకర్షణీయంగా ఉంటాయి.
ఈ పక్షులను కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ అని కూడా పిలుస్తారు. క్రిస్మస్ రోజుల్లో ఈ పక్షులు తమ కువకువలను శ్రావ్యంగా వినిపిస్తాయి. ఈ పక్షులలోని ఆడ, మగ పక్షుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
నార్తర్న్ కార్డినల్స్ మగ, ఆడ పక్షుల మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి రంగు. మగవెర్మిలియన్ ఎరుపు రంగులో ఉండగా, ఆడవి గోధుమ లేదా బూడిద రంగులో ఉంటాయి. వాటి తోక, శరీరంలోని కొన్ని భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ పక్షులు పసుపు, తెలుపు రంగులలోనూ కనిపిస్తాయి.
కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ వాటి ఈకల నుండి ఎరుపు రంగును స్వీకరిస్తాయి. వాటి తోక, ముక్కు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. అవి తాము తినే ఆహరం నుంచి ఇటువంటి రంగును పొందుతాయి. ఇవితినే ఆహారంలోని కెరోటినాయిడ్లు వీటికి ఎరుపు, నారింజ, పసుపు, గులాబీ రంగులను అందిస్తాయి. ఈ రంగులన్నీ వాటి ఈకలలో ప్రతిబింబిస్తాయి. ఆడపక్షులలో ఎరుపు రంగుకు బదులుగా, పసుపు బూడిద రంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఎరుపు రంగు తక్కువగా ఉంటుంది.
నార్తర్న్ కార్డినల్స్ ప్రత్యేకత ఏమిటంటే వీటి కిలకిలారావాలు పాటల మాదిరిగా వినిపిస్తాయి. అవి భూమిపైకి దిగి పరిగెత్తేటప్పుడు కిలకిలారావాలు చేస్తాయి. ఆడ, మగ రెండూ పాడతాయి. అవి 24 రకాలుగా కిలకిలారావాలు చేస్తాయని పరిశోధనల్లో తేలింది.
కార్డినల్స్ జీవితాంతం ఒక భాగస్వామితోనే కలసి ఉంటాయి. ఎప్పుడూ కలసే కనిపిస్తాయి. కలిసి గూడు కట్టుకుంటాయి. అయితే గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షులు గూడుకు దూరంగా ఉంటాయి. తరువాత ఆరెండూ తమ పిల్లపక్షులను ఎంతో శ్రద్ధగా పెంచుతాయి. వాటికి ఆహారం అందిస్తాయి.
ఆడ కార్డినల్స్ ఎక్కువగా కిలకిలారావాలు చేస్తాయి. వేటగాళ్ళు తమ గూడును గుర్తించకుండా ఉండేందుకే
అవి సందడి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. అలాగే మగపక్షితో ఆహారం తీసుకురమ్మని చెప్పేందుకు అవి ప్రత్యేక శబ్దాలు కూడా చేస్తాయి.
కొన్నిసార్లు ఈకలు లేని కార్డినల్స్ కూడా కనిపిస్తాయి. అవి ప్రతి సంవత్సరం తమ ఈకలను తొలగిస్తాయి. ఆ తర్వాత పాత వాటి స్థానంలో కొత్త ఈకలు వస్తాయి. ఈ మధ్య నుండే సమయంలో అవి ఈకలు లేని పక్షులుగా కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment