music lovers
-
అవి క్రిస్మస్ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు
పక్షుల కిలకిలారావాలు ఎవరినైనా మైమరపిస్తాయి. ఇక వాటి రూపం కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. ఉత్తర అమెరికాలో క్రిస్మస్ సీజన్లో అందమైన వెర్మిలియన్ పక్షులు సందడి చేస్తుంటాయి. అందుకే వాటిని క్రిస్మస్ పక్షులని అంటారు. ఇవి ఎరుపురంగులో ఆకర్షణీయంగా ఉంటాయి.ఈ పక్షులను కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ అని కూడా పిలుస్తారు. క్రిస్మస్ రోజుల్లో ఈ పక్షులు తమ కువకువలను శ్రావ్యంగా వినిపిస్తాయి. ఈ పక్షులలోని ఆడ, మగ పక్షుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.నార్తర్న్ కార్డినల్స్ మగ, ఆడ పక్షుల మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి రంగు. మగవెర్మిలియన్ ఎరుపు రంగులో ఉండగా, ఆడవి గోధుమ లేదా బూడిద రంగులో ఉంటాయి. వాటి తోక, శరీరంలోని కొన్ని భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ పక్షులు పసుపు, తెలుపు రంగులలోనూ కనిపిస్తాయి.కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ వాటి ఈకల నుండి ఎరుపు రంగును స్వీకరిస్తాయి. వాటి తోక, ముక్కు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. అవి తాము తినే ఆహరం నుంచి ఇటువంటి రంగును పొందుతాయి. ఇవితినే ఆహారంలోని కెరోటినాయిడ్లు వీటికి ఎరుపు, నారింజ, పసుపు, గులాబీ రంగులను అందిస్తాయి. ఈ రంగులన్నీ వాటి ఈకలలో ప్రతిబింబిస్తాయి. ఆడపక్షులలో ఎరుపు రంగుకు బదులుగా, పసుపు బూడిద రంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఎరుపు రంగు తక్కువగా ఉంటుంది.నార్తర్న్ కార్డినల్స్ ప్రత్యేకత ఏమిటంటే వీటి కిలకిలారావాలు పాటల మాదిరిగా వినిపిస్తాయి. అవి భూమిపైకి దిగి పరిగెత్తేటప్పుడు కిలకిలారావాలు చేస్తాయి. ఆడ, మగ రెండూ పాడతాయి. అవి 24 రకాలుగా కిలకిలారావాలు చేస్తాయని పరిశోధనల్లో తేలింది.కార్డినల్స్ జీవితాంతం ఒక భాగస్వామితోనే కలసి ఉంటాయి. ఎప్పుడూ కలసే కనిపిస్తాయి. కలిసి గూడు కట్టుకుంటాయి. అయితే గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షులు గూడుకు దూరంగా ఉంటాయి. తరువాత ఆరెండూ తమ పిల్లపక్షులను ఎంతో శ్రద్ధగా పెంచుతాయి. వాటికి ఆహారం అందిస్తాయి.ఆడ కార్డినల్స్ ఎక్కువగా కిలకిలారావాలు చేస్తాయి. వేటగాళ్ళు తమ గూడును గుర్తించకుండా ఉండేందుకే అవి సందడి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. అలాగే మగపక్షితో ఆహారం తీసుకురమ్మని చెప్పేందుకు అవి ప్రత్యేక శబ్దాలు కూడా చేస్తాయి.కొన్నిసార్లు ఈకలు లేని కార్డినల్స్ కూడా కనిపిస్తాయి. అవి ప్రతి సంవత్సరం తమ ఈకలను తొలగిస్తాయి. ఆ తర్వాత పాత వాటి స్థానంలో కొత్త ఈకలు వస్తాయి. ఈ మధ్య నుండే సమయంలో అవి ఈకలు లేని పక్షులుగా కనిపిస్తాయి. -
World Music Day: సంగీతానికి ప్రత్యేకంగా ఓ రోజు ఎందుకు కేటాయించారంటే!
సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ఇలా లలిత కళలు ఐదు. కానీ మిగతా వాటికి భిన్నమైన దారి సంగీతానిది. సంగీతానిది ఎలాంటి ఎల్లలూ, హద్దులూ లేని విశ్వభాష. సంగీతం మనసుకు హాయిని కలిగిస్తుంది. కొన్ని రకాల అనారోగ్యాలను తొలగిస్తుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంగీతంతో చికిత్స చేయవచ్చు. జూన్ 21న ప్రపంచ సంగీతం దినోత్సవం. ఈ సందర్భంగా సంగీతం మనిషి జీవితంతో ఎంతగా పెనవేసుకుని పోయిందో, అన్ని రోజులూ మన వీనులకు విందు గావించే సంగీతానికి ప్రత్యేకంగా ఓ రోజంటూ ఎందుకు కేటాయించారో తెలుసుకుందాం... మనకు నచ్చిన పాట లేదా మనసుకు హత్తుకునే సంగీతం విన్నపుడు విన్నపుడు మనకు తెలీకుండానే ఒక రకమైన తన్మయత్వం కలుగుతుంది. ఎప్పుడైనా కాస్త డీలా పడినట్లు, ఒత్తిడికి లోనైనట్లు అనిపించినప్పుడు ఒక మంచిపాట, వీనులవిందైన సంగీతం వింటే ఆ ఒత్తిడి మొత్తం ఎగిరిపోతుంది. ఎంతో సాంత్వన లభిస్తుంది. నూతనోత్తేజం కలుగుతుంది. ఇక సంతోష సమయాలలో ఐతే చెప్పనక్కర్లేదు. పెళ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో ఉరకలెత్తించే, హుషారు కలిగించే సంగీతం, పాటలు వాతావరణాన్ని మరింత సందడిగా ఆహ్లాదంగా మారుస్తాయి. మొత్తంగా సంగీతాన్ని ఇష్టపడని సంగీతానికి పరవశించని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో! సంగీతం... సార్వజనీనం పొత్తిళ్లలోని పాపాయి ఉంగా ఉంగా అని చేసే శబ్దంలో ఉంది సంగీతం, తల్లి తన బిడ్డను ఊయలలూపుతూ పాడే లాలిపాటల్లో ఉంది సంగీతం, ఏడుస్తున్న పసిబిడ్డ ఆ ఏడుపు ఆపి హాయిగా కేరింతలు కొట్టేటట్లు చేయగల అమ్మమ్మలు, బామ్మల జోలపాటల్లో ఉంది సంగీతం, శ్రమైక జీవులు తమకు అలుపు తెలీకుండా పాడుకునే పాటల్లో ఉంది సంగీతం. ఇవన్నీ కూడా ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని పాటించకపోయినప్పటికీ ఒక సొగసైన తాళం, రమ్యమైన లయతో సాగుతుంటాయి. మనుషులే కాదు ఇతర ప్రాణులకూ ఉంది సంగీత జ్ఞానం. నాగస్వరం విన్న సర్పాలు సొగసుగా నాట్యమాడటం, చైత్రమాసాన లేత మామిడి చివుళ్లు తిన్న కోయిలమ్మ కుహుకుహు రాగమాలపించటం, సంగీతం వింటూ ఆవులు పాలు సమృద్ధిగా ఇవ్వడం మనకు తెలిసిందే. అందుగలడిందులేడని...అన్న చందాన ప్రపంచమంతటా నిండి ఉంది సంగీతం. అందుకే అన్నారు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అని. వాగ్గేయకారులైన అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య వంటివారు తమ ఆరాధ్యదైవాలపైన సంకీర్తనలు రచించారు. పాటలు పాడుకున్నారు. తమ జీవితంలోని విషాదాలను, విరహాలను తొలగించుకున్నారు. నైరాశ్యాన్ని సంగీతంతోనే జయించారు. అంతకంటే ముందు అశోకవనంలో సీతాదేవి ఒకానొక దశలో తీవ్ర నైరాశ్యానికి లోనై, పొడవైన తన కేశాలతో గొంతుకు ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడబోతుండగా.. చెట్టు మీదున్న ఓ పక్షి ఏదో వింత వింత శబ్దాలతో వీనులవిందైన రాగాన్ని ఆలపించింది. అప్రయత్నంగా ఆ రాగాలను ఆలకించిన సీతమ్మలోని నైరాశ్యం, కుంగుబాటు తొలగిపోయాయి. జీవితంపై తిరిగి ఆశలు చిగురించాయి. ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుని రాముడి కోసం ఓపిగ్గా నిరీక్షించింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. మెదడుకు, హృదయానికి సంబంధించిన కొన్ని వ్యాధులకు చేసే చికిత్సలో రోగికి ఇష్టమైన సంగీతాన్ని వినిపించడం ద్వారా వైద్యులు సత్ఫలితాలను సాధించిన దాఖలాలెన్నో మనకు తెలుసు. బీపీ, తలనొప్పి వంటి వాటిని సంగీత చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు నిరూపించారు కూడా. బాత్రూమ్లో కూనిరాగాలు తీసే వారు, బరువు పనులు చేసేవారు, రేవుల్లో బట్టలు ఉతికే రజకులు.. ఒకరేమిటి... శ్రమ తెలియకుండా తమకు తోచిన పాటలు పాడుకోవడం అందరికీ తెలిసిందే. ఐక్యరాజ్యసమితి ప్రకటన ప్రజల మనస్సుల్లో, ఆలోచనల్లో సంగీతాన్ని నిత్యనూతనంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ప్రపంచ సంగీత దినోత్సవంగా నిర్వహించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచమంతటా జూన్ 21ని వరల్డ్ మ్యూజిక్ డేగా పాటించాలని ప్రకటించింది. ఇది క్రమంగా అన్ని దేశాలకు, నగరాలకు వ్యాపించి వరల్డ్మ్యూజిక్ డేకు ప్రాచుర్యం లభించింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ‘ఫెటె డె లా మ్యూసిక్’ అని ‘మేక్ మ్యూజిక్ డే’ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో, 1000 నగరాల్లో వరల్డ్ మ్యూజిక్ డే సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో సంగీతం పట్ల అభిమానం, ఆసక్తి ఉన్నవారెవరైనా పాల్గొనవచ్చు. ఎవరైనా, ఎక్కడైనా సంగీత ప్రదర్శనలు ఇవ్వవచ్చు. పార్కులు, వీధులు, గార్డెన్లు, ఇతర పబ్లిక్ ప్లేసులలో గానంతో లేదా వాద్యపరికరాలతో తమ సంగీత నైపుణాన్ని ప్రదర్శించవచ్చు. ఈరోజు జరిగే ప్రదర్శనలన్నీ అందరికీ పూర్తిగా ఉచితమే. నిబంధనలేమీ లేని రోజే సంగీత దినోత్సవం ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలంటే, ఏదైనా పని చేయాలంటే వాటికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇలాగే పాల్గొనాలి, ఇంత వయసు వారే పాల్గొనాలి, ఇంత అనుభవం కావాలి....ఇలాంటివి. కానీ వరల్డ్ మ్యూజిక్ డే విషయంలో అలాంటి నిబంధనలేమీ లేవు. సంగీతం పట్ల అనురక్తి, ఆసక్తి ఉన్నవారైవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఉద్దండులు, సాధారణమైన వారు అన్న తారతమ్యాలేవీ ఉండవు. సంగీత రంగంలో గొప్పవారనదగ్గ వారి నుంచి ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వారి దాకా, పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా నిరభ్యంతరంగా పాల్గొన వచ్చు. మీ మీ ఆసక్తులను బట్టి ఒక సమూహంగా ఏర్పడవచ్చు. అంతా కలిసి ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ప్రదర్శనలు ఇవ్వవచ్చు లేదా మీరే ఆ ప్రదర్శనలో పొల్గొని సంగీత ప్రపంచంలో కాసేపు ఆనందంగా, హాయిగా విహరించవచ్చు. కాబట్టి మీకు మీరే మీకు నచ్చిన అంశం మీద సరదాగా ఓ ప్యారడీ పాట రాయండి. దానిని మీరే పాడండి. పదిమందితోనూ పంచుకోండి. సంగీత సముద్రంలో ఓలలాడండి. జీవితంలో ఆనందాన్ని నింపుకోండి. (జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా) చదవండి: అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి -
సంగీత ఝురి చక్రి హఠాన్మరణం
కంబాలపల్లిలో విషాదం తెలంగాణ స్వరముత్యం.. ఓరుగల్లు కీర్తి కెరటం.. కోట్లాది హృదయూల ఆత్మబంధువు శ్వాస ఆగింది..! చివరి నిమిషం వరకు సంగీత మాధుర్యంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన స్వరఝురి అలసిపోరుుంది.. పాటల పల్లకి ‘చితి’కింది.. ఉద్దండుల పాటలకు స్వరాలందించిన బాణి మౌన ముద్ర వహించింది.. స్నేహశీలి నేలకొరిగాడు.. అగ్రనాయకులు, యువ హీరోలను అగ్రపథాన నిలిపిన కంఠం మూగబోరుుంది.. మాస్, క్లాస్‌ను తన మెలోడీతో ఉత్తేజ పరిచిన గొంతుక ఆగింది.. చిత్రసీమ చింతించింది.. ఓరుగల్లు ఘొల్లుమంది.. మహబూబూబాద్ బోరుమంది.. కంబాలపల్లి కన్నీళ్లు పెట్టింది.. మహబూబాబాద్ ముద్దుబిడ్డ చక్రి(జిల్లా చక్రధర్) జగమంత కుటుంబాన్ని వదిలి నింగికెగిశాడు.. దీంతో స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సంగీత ప్రియులను శోకసంద్రంలో మునిగిపోయారు.. స్వరాల చక్రం మూగబోరుునా.. నీ గానామృతం చిరస్థారుుగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని బరువెక్కిన హృదయూలతో నేస్తానికి సెలవు పలికారు.. ఆకాశాన చంద్రుడిగా.. సాగరాన సూర్యుడిగా ఈ గడ్డకు మళ్లీరా.. అంటూ నివాళులర్పించారు. - మహబూబాబాద్/హన్మకొండ కల్చరల్ మానుకోట నుంచి ఎదిగిన సంగీత వృక్షం వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించిన చక్రి ఉత్తమ సంగీత దర్శకునిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన ఎంత ఎదిగినా జన్మస్థలాన్ని మాత్రం మరువలేదు. ఈ ప్రాంతంలోని కళాకారులకు తోడ్పాటు అందించారు. చిన్న కార్యక్రమాలకు కూడా హాజరయ్యేవారు. ఆయన మరణ వార్త విని స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
పదాలు లేని ప్రవాహాలు...
‘దుర్గం’ అంటే దుర్-గమనము కదా! అంబేద్కర్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న దుర్గం చెరువు దరికి ‘సీక్రెట్ లేక్ పార్క్’ అనే పేరు చక్కగా సరిపోయింది. వెతుక్కుని వెతుక్కుని మరీ వెళ్లాలి. రెండు, మూడు, నాలుగు చక్రాలపై, దాదాపు మూడు వందల మంది మ్యూజిక్ లవర్స్, మొన్న శనివారం సాయంత్రం ఎలాగైతేనేం అక్కడకు చేరుకున్నారు. గోల్కొండ కోటకు మంచినీటిని సరఫరా చేసిన చరిత్ర కలిగిన దుర్గం చెరువు, తన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, తాజాగా జాజ్ సంగీతంతో మ్యూజిక్ లవర్స్ దాహార్తిని తీర్చింది! వెలుగునీడల మార్మిక వాతావరణంలో, దక్కన్ రాక్స్ అమరికల మధ్య ఏర్పాటైన వేదికపై ముగ్గురు కళాకారులు పరిసరాల సోయగానికి ముగ్ధులయ్యారు. ఇంత చక్కని వేదికను తమ పర్యటనలో చూడలేదంటూ ప్రేక్షకులకు పరిచయం చేసుకున్నారు. ఒకరు పోర్చుగల్‌కు చెందిన డబుల్ బాస్ వాద్యగాడు కార్లోస్ బైకా. మరొకరు రంగులీనే గిటార్ ‘తంత్ర’జ్ఞుడు, జర్మనీకి చెందిన ఫ్రాంక్ బొమస్. మరొకరు అమెరికాకు చెందిన క్లాసిక్ డ్రమ్మర్ జిమ్ బ్లాక్. ముగ్గురూ జాజ్లోని మూడు పాయలను సీక్రెట్ లేక్‌లోని యాంఫీథియేటర్పై సంగమింపజేశారు! పాప్-జాజ్-రాక్-పొయెట్రీల మేళవింపుతో స్వీయముద్రను వే సే ఇండిపెండెంట్ జాజ్‌ను ‘ఇండిజాజ్’ అంటారు కదా. ఇందులో తమదైన ప్రత్యేకతను చాటుతూ రాక్ సంగీతంలోని నిర్ణిద్ర శక్తిని, పాప్ సాహిత్యాన్ని స్ఫురింపజేసే రాగాలను, పోర్చుగీస్ జానపద సంగీతంలోని మధురిమలను ఏకీకృతం చేస్తూ ఈ ముగ్గురు 1996లో ‘జాజ్ ట్రియో’ గా ఏర్పడ్డారు. ‘అజుల్’ ఆల్బమ్‌తో ప్రారంభించి, ట్విస్ట్, లుక్ వాట్ దె హావ్ డన్ టు మై సాంగ్... తదితర ఆల్బమ్‌లతో పదిహేడు సంవత్సరాలుగా ‘ట్రియో’ ఇస్తోన్న ప్రదర్శనలు అమెరికా, యూరప్ దేశాల్లో నిత్యనూతనంగా విజయవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్‌ముల్లర్ భవన్-గోథె జంత్రమ్ల ఆహ్వానంపై రెండు వారాలుగా ఢాకా, కోల్‌కతా, ముంబై, పుణె, త్రివేండ్రం, చెన్నైలు పర్యటిస్తూ హైదరాబాద్‌లో ముగింపు కచేరీకి విచ్చేశారు. కార్లోస్ బైకా రచయిత, స్వరకర్త. తాను రచించిన సాంగ్బుక్ తర్వాత మరో పాటల పుస్తకం ఎందుకు తీసుకురాలేదు అనే ప్రశ్నకు ‘ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక పాటే పాడగలరు’ అంటారు. అన్నట్లు ఆయన పాటల్లో పదాలుండవు. రాగాలే. ఆ శబ్దసౌందర్యంతో శ్రోతలు తమవైన పదాలను ఊహించుకుంటారు! ‘రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు’ అన్నట్లుగా మరచిపోవడం సాధ్యం కాని పదరహిత ప్రవాహాలు! ఏడాది క్రితం తాను స్వరపరచిన ‘థింగ్స్ ఎబౌట్’ ఆల్బమ్ బెస్ట్ పోర్చుగీస్ ఆల్బమ్‌గా ఎంపికైంది. డబుల్ బాస్‌పై ‘బో’వాడకుండా చేతి వేళ్లతో కార్లోస్ పలికించిన మంద్ర స్థాయిలోని స్వరాలు చిరుగాలికి నీటిలో సద్దుమణిగిన అలల సవ్వడిని గుర్తు చేశాయి. కార్లోస్ డబుల్ బాస్‌కు ఫ్రాంక్ మోబస్ గిటార్‌తో హృద్యంగా సమన్వయపరచడం, జిమ్బ్లాక్ రిథమిక్ డ్రమ్మింగ్ ఒక ‘క్లాసిక్’ ఎక్స్పీరియన్స్! - పున్నా కృష్ణమూర్తి -
సెల్కాన్.. రెహ్మానిష్క్ ఫోన్
కోల్‌కతా, సాక్షి ప్రతినిధి: హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ సెల్కాన్.. సంగీత ప్రియులు, యువత కోసం రెహ్మానిష్క్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సోమవారం కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్‌తో కలిసి సెల్కాన్ సీఎండీ వై.గురు, ఈడీ మురళి రేతినేని ఏఆర్45 ఫోన్‌ని ఆవిష్కరించారు. కొత్త టెక్నాలజీతో వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తోందంటూ ఈ సందర్భంగా రెహ్మాన్ సెల్కాన్ని అభినందించారు. సాధ్యమైనంత వరకూ దేశీయ కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. సంగీతానికి సంబంధించి అత్యాధునిక వాద్య పరికరాల తయారీ ఇక్కడ తక్కువ కావడంతో తాను విదేశీవి కొనాల్సి వస్తోందని చెప్పారు. ఫోన్ ఆవిష్కరణలో తొలిసారిగా అత్యాధునిక 4డీ హోలోగ్రాఫిక్ టెక్నాలజీని వినియోగించారు. త్వరలో మరిన్ని.. రెహ్మానిష్క్ పేరిట కోల్‌కతా, వైజాగ్ సహా నాలుగు ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఏఆర్ సిరీస్‌లో మరో మూడు స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తామని గురు తెలియజేశారు. ఒక్కో నగరంలో ఒక్కో మోడల్ చొప్పున ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు ఉంటాయన్నారు. వీటి ధరలు సుమారు రూ. 6,000 నుంచి రూ. 9,000 దాకా ఉంటాయని, దసరా సీజన్లో నెలకు లక్ష హ్యాండ్సెట్స్ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వీటిని ఆఫ్రికా తదితర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు తెలియజేశారు. రెహ్మానిష్క్పై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో భారీ స్పందన వస్తోందని, ట్విట్టర్ ట్రెండ్స్‌లో ఇది నాలుగో స్థానంలో నిల్చిందని గురు చెప్పారు. రె హ్మానిష్క్ సిరీస్ ఫోన్ల కోసం రెహ్మాన్ ప్రత్యేకంగా జింగిల్ తయారు చేశారని, ఈ రింగ్టోన్ని మిగతా హ్యాండ్సెట్స్లోనూ అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో క్యాంపస్ సిరీస్‌లో ఏ-15 మోడల్ ప్రవేశపెడుతున్నామని, దీని ధర సుమారు రూ. 3,799గా ఉంటుందని చెప్పారు. రెహ్మానిష్క్ ఏఆర్45 ప్రత్యేకతలు... 4.5 అంగుళాల స్క్రీన్ ఉండే ఏఆర్45 ఫోన్... ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 1.2 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ ఏ7 ప్రాసెసర్, 5 ఎంపీ కెమెరా, 3జీ వీడియో కాలింగ్, 4జీ ఆర్వోఎం, ఇంటరాక్టివ్ గేమింగ్ వంటి ఫీచర్లుంటాయి. ధర రూ.7,999. ఏఆర్ రె హ్మాన్ స్వరపర్చిన సూపర్‌హిట్ పాటలు ప్రీలోడెడ్ కంటెంట్‌గా లభిస్తాయి. మెరుగైన సంగీతానుభూతి ఇచ్చేందుకు కె-క్లాస్ యాంప్లిఫయర్తో డ్యూయల్ స్పీకర్లు రూపుదిద్దుకున్నాయి. ఇందులో షేక్ అండ్ ట్రాన్స్ఫర్, ఫోటా (ఫర్మ్‌వేర్ ఓవర్ ది ఎయిర్) వంటి సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించామని మురళి తెలి పారు. ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కి కేబుల్స్, బ్లూటూత్ వంటివేమీ లేకుండా షేక్ చేయడం ద్వారా వేగంగా డేటాను పంపేందుకు షేక్ అండ్ ట్రాన్స్ఫర్ ఉపయోగపడుతుందని వివరించారు. 100 ఎంబీ డేటాను సైతం ఈ పద్ధతిలో కేవలం రెండు సెకన్లలో పంపొచ్చని మురళి చెప్పారు