ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ.. 'ఇలాన్ మస్క్' (Elon Musk) క్రిస్మస్ సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఒజెంపిక్ శాంటా (Ozempic Santa) అంటూ శాంటా డ్రెస్‌తో.. క్రిస్మస్ చెట్టు ముందు నిలబడిన ఫోటోను మస్క్ షేర్ చేశారు. ఇందులో పెద్ద గడ్డం, నడుముపై చేతులు పెట్టుకున్న మస్క్‌ను చూడవచ్చు.
ఇలాన్ మస్క్ శాంటా వేషధారణలో కనిపించడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే తన చిన్న తనం నుంచే శాంటా దుస్తులు ధరించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది ఎలా ప్రారంభమైంది.. ఎలా వెళుతోంది అంటూ మస్క్ మరో ట్వీట్ చేశారు. మేరీ క్రిస్మస్.. వండర్‌ఫుల్ న్యూ ఇయర్ అంటూ కూడా ట్వీట్ చేశారు.
Ozempic Santa pic.twitter.com/7YECSNpWoz
— Elon Musk (@elonmusk) December 26, 2024
How it started vs how it’s going pic.twitter.com/fQeCQ7zCPC
— Elon Musk (@elonmusk) December 26, 2024
Comments
Please login to add a commentAdd a comment