ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ప్రతిసారీ భారీ అంచనాలతో అడుగు పెడుతుంది. ఈసారీ ఆ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా ఉంది. గ్రూప్ ‘బి’లో ఇరాన్, అమెరికా, వేల్స్ జట్లతో పోటీపడనున్న ఇంగ్లండ్ స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్ దశను సులువుగా దాటుతుంది.
ఇంగ్లండ్
ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: విజేత (1966)
ఇతర ఘనతలు: యూరో కప్ రన్నరప్ (2020)
‘ఫిఫా’ ర్యాంక్: 5
అర్హత: యూరోప్‌లో గ్రూప్–1 విజేత హోదాలో.
ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఇంగ్లండ్ అజేయంగా నిలిచింది. అదే జోరును ప్రధాన టోర్నీలోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉంది. 2018 రష్యాలో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సెమీఫైనల్లో ఓడి, ఆ తర్వాత ప్లే ఆఫ్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలోనూ ఓడి నాలుగో స్థానంలో నిలిచింది. కెప్టెన్ హ్యారీ కేన్‌తోపాటు జాక్ గ్రేలిష్, డెక్లాన్ రైస్, ట్రెంట్ అలెగ్జాండర్, జాన్ స్టోన్స్, కైల్ వాకర్‌లాంటి స్టార్ ఆటగాళ్లతో ఇంగ్లండ్ పటిష్టంగా ఉంది. ఓవరాల్‌గా 16వసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. .
ఇరాన్
ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ
ఇతర ఘనతలు: ఆసియా విజేత (1968, 72, 76)
‘ఫిఫా’ ర్యాంక్: 20
అర్హత: ఆసియా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ విన్నర్
ఓవరాల్‌గా ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇరాన్ ఏనాడూ గ్రూప్ దశలో తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. ఆసియా క్వాలిఫయింగ్‌లో ఆడిన 18 మ్యాచ్‌ల్లో 14 విజయాలు అందుకున్న ఇరాన్ ప్రధాన టోర్నీలో ఈసారైనా తొలి రౌండ్ దాటాలని పట్టుదలతో ఉంది. సర్దార్ అజ్మౌన్, అలీరెజా, మాజిద్ హుస్సేన్‌లాంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఇరాన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
అమెరికా
ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1930)
ఇతర ఘనతలు: కాన్ఫడరేషన్స్ కప్ రన్నరప్ (2009)
‘ఫిఫా’ ర్యాంక్: 16
అర్హత: ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్‌లో మూడో స్థానం.
నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రపంచకప్‌కు అర్హత పొందలేకపోయిన అమెరికా ఓవరాల్‌గా 11వసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. పులిసిక్, వెస్టన్ మెకెనీ, రేనాలాంటి కీలక ఆటగాళ్లు రాణిస్తే నాకౌట్ దశకు చేరుకునే అవకాశముంది.
వేల్స్
ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1958)
ఇతర ఘనతలు: యూరో టోర్నీలో మూడో స్థానం (2016)
‘ఫిఫా’ ర్యాంక్: 19
అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ విన్నర్. 1958 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన వేల్స్ జట్టు ఆశలన్నీ గ్యారెత్ బేల్, డానియల్ జేమ్స్, ఆరోన్ రామ్సెలాంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి.
–సాక్షి క్రీడావిభాగం
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్... ఈసారైనా!
Published Sun, Nov 13 2022 6:22 AM | Last Updated on Sun, Nov 13 2022 6:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment