న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు వాయిదా పడటంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. వచ్చే నెల 28 నుంచి బర్మింగ్‌హమ్‌లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనే 18 మంది సభ్యులుగల భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. ఇటీవల ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌ల కోసం మన్‌ప్రీత్ స్థానంలో అమిత్ రోహిదాస్‌ను జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
అయితే చైనాలో కరోనా ఉధృతితో ఈ ఏడాది జరగాల్సిన ఆసియా క్రీడలు వాయిదా పడ్డాయి. దాంతో హాకీ ఇండియా కామన్వెల్త్ గేమ్స్ కోసం అగ్రశ్రేణి ఆటగాళ్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండుసార్లు రజత పతకాలు నెగ్గిన భారత్ ఈసారి పూల్ ‘బి’లో ఇంగ్లండ్, కెనడా, వేల్స్, ఘనా జట్లతో ఆడుతుంది.
భారత పురుషుల హాకీ జట్టు: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ సింగ్ (వైస్ కెప్టెన్), పీఆర్ శ్రీజేష్, కృషన్ బహదూర్ పాథక్ (గోల్ కీపర్లు), జుగ్‌రాజ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, వరుణ్ కుమార్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్.
చదవండి: వింబుల్డన్ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్ క్రీడాకారిణి
Comments
Please login to add a commentAdd a comment