
భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీని భారత జట్టు విజయంతో మొదలు పెట్టింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–3 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఒక దశలో 2–3తో వెనుకబడినా... కోలుకొని భారత్ చివరకు విజేతగా నిలవడం విశేషం. భారత్ తరఫున మన్‌దీప్ మోర్ (13వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (41) రెండు గోల్స్ చేయగా... స్యామ్ లేన్ (23వ నిమిషం, 35) రెండు గోల్స్, జేక్ స్మిత్ (34) ఒక గోల్ సాధించారు.
ఫలితంగా మూడో క్వార్టర్ ముగిసే సరికి కివీస్ 3–2తో ముందంలో ఉంది. అయితే నాలుగో క్వార్టర్‌లో చెలరేగిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మన్‌దీప్ సింగ్ 51వ, 56వ నిమిషాల్లో గోల్స్ సాధించి జట్టు గెలుపు బాట పట్టించాడు.
ఇరు జట్లు అటాకింగ్‌కు ప్రాధాన్యతనివ్వగా, అర్ధ భాగం ముగిసే సరికి స్కోరు 1–1తో సమమైంది. మూడో క్వార్టర్ చివర్లో సుమీత్‌కు ఎల్లో కార్డు చూపించడంతో 10 నిమిషాలు అతను ఆటకు దూరం కాగా 10 మందితోనే భారత్ పోరాడింది.
చదవండి: ISL 2022: ముంబై చేతిలో కేరళ ఓటమి
Comments
Please login to add a commentAdd a comment