hocky
-
‘షూటౌట్’లో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు!
అంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో అర్జెంటీనాపై నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2–2తో సమంగా నిలిచాయి.భారత్ తరఫున మన్దీప్ (11వ ని.లో), లలిత్ (55వ ని.లో)... అర్జెంటీనా తరఫున మార్టినెజ్ (20వ ని.లో), థామస్ డొమినె (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ‘షూటౌట్’లో హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ చెరో రెండు గోల్స్ చేయగా, అభిషేక్ ఒక గోల్ చేశాడు. రాజ్‌కుమార్, లలిత్ విఫలమయ్యారు.ప్రత్యర్థి జట్టులో మైకో రెండు గోల్స్ కొట్టగా, లుకాస్, టోబియస్ ఒక్కో గోల్ చేశారు. ముగ్గురు విఫలమవడంతో భారత్ నెగ్గింది. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0–5 గోల్స్‌తో అర్జెంటీనా చేతిలో ఓడింది.ఇవి చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు -
ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ విజయం
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీని భారత జట్టు విజయంతో మొదలు పెట్టింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–3 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఒక దశలో 2–3తో వెనుకబడినా... కోలుకొని భారత్ చివరకు విజేతగా నిలవడం విశేషం. భారత్ తరఫున మన్దీప్ మోర్ (13వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (41) రెండు గోల్స్ చేయగా... స్యామ్ లేన్ (23వ నిమిషం, 35) రెండు గోల్స్, జేక్ స్మిత్ (34) ఒక గోల్ సాధించారు. ఫలితంగా మూడో క్వార్టర్ ముగిసే సరికి కివీస్ 3–2తో ముందంలో ఉంది. అయితే నాలుగో క్వార్టర్లో చెలరేగిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మన్దీప్ సింగ్ 51వ, 56వ నిమిషాల్లో గోల్స్ సాధించి జట్టు గెలుపు బాట పట్టించాడు. ఇరు జట్లు అటాకింగ్‌కు ప్రాధాన్యతనివ్వగా, అర్ధ భాగం ముగిసే సరికి స్కోరు 1–1తో సమమైంది. మూడో క్వార్టర్ చివర్లో సుమీత్కు ఎల్లో కార్డు చూపించడంతో 10 నిమిషాలు అతను ఆటకు దూరం కాగా 10 మందితోనే భారత్ పోరాడింది. చదవండి: ISL 2022: ముంబై చేతిలో కేరళ ఓటమి -
కేసీఆర్ సమీప బంధువు ప్రవీణ్‌రావు కిడ్నాప్
సాక్షి, కంటోన్మెంట్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో కిడ్నాప్ కలకలం రేపింది. ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారుల మంటూ లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు సమాచారం. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బల వంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అనంతరం సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఐతే.. హఫీజ్‌పేట భూవివాదానికి సంబంధించే ఈ కిడ్నాప్ జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కవిత అక్కడకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. . -
ప్రపంచ కప్‌కు వేదిక కానున్న ఒడిశా
భువనేశ్వర్: హాకీ కప్ ప్రపంచ టోర్నమెంట్‌కు రాష్ట్రం మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహనకు రాష్ట్ర క్రీడాభిమానుల వర్గం ఉవ్విళ్లూరుతోంది. 2023లో రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో హాకీ ప్రపంచ కప్–2023 నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించింది. రాష్ట్రంలో తొలిసారిగా 2018లో పురుష హాకీ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు వెదికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చేసిన ఏర్పాట్లు, నిర్వహణ కార్యకలాపాల పట్ల అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) అత్యంత సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా మరోసారి ప్రపంచ హాకీ కప్ నిర్వహించాలనే ఒడిశా అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించింది. భువనేశ్వర్, రౌర్కెలా ప్రాంతాల్లో ఈ టోర్నీ నిర్వహణకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అనుమతించింది. హాకీ ప్రపంచ కప్–2018తో సీఎం నవీన్ పట్నాయక్ (ఫైల్) హాకీ ప్రపంచ కప్–2023 నిర్వహణ ఏర్పాట్లు పట్ల ఉక్కునగరం రౌర్కెలా ఉత్సాహంతో ఉరకలేస్తుంది. 2018లో రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన దానికంటె ఘనంగా రౌర్కెలాలో 2023 ప్రపంచ కప్ నిర్వహించాలని ఇక్కడి క్రీడాభిమానులు కృషి చేస్తున్నారు. టోర్నమెంట్ కార్యకలాపాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులను ఉన్నత స్థాయి అధికార బృందం శుక్రవారం ప్రత్యక్షంగా సమీక్షించింది. రాష్ట్ర క్రీడలు–యువజన వ్యవహారాల విభాగం మంత్రి తుషార్‌కాంతి బెహరా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్‌కుమార్ త్రిపాఠి, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు నరేంద్ర ధృవ్బత్ర, క్రీడలు–యువజన వ్యవహారాల విభాగం ఉన్నతాధికారులు, ఒడిశా పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్(ఇడ్కో), హాకీ ఇండియా, సుందరగడ్, రౌర్కెలా స్థానిక అధికారులు ప్రపంచ హాకీ కప్–2023 ఏర్పాట్లు సమీక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు.. హాకీ ప్రపంచ కప్–2023 టోర్నమెంట్ రాష్ట్రంలో రెండు వేర్వేరు వేదికల్లో నిర్వహించే అవకాశం లభించడం అపురూపం. ఈ సదవకాశం సవాలుగా తీసుకుని గతం కంటే ఘనంగా నిర్వహించేందుకు విభాగం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడలు–యువజన వ్యవహారాల విభాగం మంత్రి తుషార్‌కాంతి వెల్లడించారు. రాజధాని నగరంలో ఇటీవల పోటీలు నిర్వహించడంతో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. రౌర్కెలాలో తొలిసారి జరుగుతున్న ఈ పోటీల పట్ల స్థానిక పాలన, అధికార యంత్రాంగాలతో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఉత్సాహంతో ఏర్పాట్లలో స్వచ్ఛందంగా పాలుపంచుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ విజయవంతంగా నిర్వహించేందుకు రెండు వేదికల్లో ప్రపంచ శ్రేణి సదుపాయాలు కల్పిస్తున్నారు. క్రీడాకారులకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే రీతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు బెహరా ప్రకటించారు. క్రీడాకారులు, క్రీడాధికారులు, ప్రపంచ వ్యాప్తం క్రీడాస్ఫూర్తిదాతలు ఇతరేతర అనుబంధ వర్గాలకు ఈ టోర్నమెంట్ మధురానుభూతిగా నిలిచి పోతుందని వివరించారు. 2022 మధ్య భాగంలో టోర్నమెంట్ ఏర్పాట్లు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు ప్రకటించారు. -
హాకీ ప్లేయర్ అనుమానాస్పద మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద మరణం కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్లో తన సొంత కారులో చనిపోయి ఉన్నాడు. జామి మిల్లియా ఇస్లామియా కాలేజీలో బీఏ చదువుతున్నా రిజ్వాన్‌ఖాన్(22) స్టేట్ లెవల్ హాకీ క్రీడాకారుడు కూడా. హతుడి కుడిచేతికి బుల్లెట్ గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే రిజ్వాన్ ది హత్యా, ఆత్మహత్యా అనేది ఇంకా తేలాల్సి వుంది. ప్రేమ వ్యవహారమే కారణమా అనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోమిల్ బానియా రిపోర్ట్ ప్రకారం రిజ్వాన్‌ఖాన్ సుభాష్ నగర్ నివాసి. బైక్ కొనుక్కుంటానని చెప్పి సోమవారం సాయంత్రం రిజ్వాన్ ఇంటినుంచి రూ.2 లక్షలు తీసుకొని వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ లో వుంది ఇంతలో, మంగళవారం ఉదయం10.30 గంటలకు ఎవరో ఫోన్ చేసి రిజ్వాన్‌బ్యాగ్ తమ దగ్గర ఉందని వచ్చి తీసుకెళ్లమని చెప్పారని రిజ్వాన్ తండ్రి చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లామనీ, స్విఫ్ట్ కారు పార్క్ చేసి ఉండడాన్నిగమనించి , పరిశీలించగా రక్తపు మడుగులో పడివున్న రిజ్వాన్ మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. రిహ్వాన్ రోహతాక్లోని కళాశాలలో చదువుతున్న ఓ అమ్మాయితో మహిళతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను కలవడానికి వెళ్లాడని, అయితే ఆమె ఒడిషా వెళ్లడంతో రాత్రంతా కారులో కూర్చున్నాడని పోలీసులు చెప్పారు. ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు, పలుమార్లు ఆమెకు ఫోన్ చేసినట్టు గుర్తించామని తెలిపారు. దేశపు తుపాకీ,, రూ.2 లక్షలు నగదు, మొబైల్ ఫోన్‌తోపాటు అమ్మాయి ఫోటో కూడా ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఎలాంటి సూసైట్‌నోట్ లభించలేదని విచారణ నిర్వహిస్తున్నాని చెప్పారు అయితే అమ్మాయి తరపువారే తమ కుమారుడిని హత్య చేసి వుంటారని రిజ్వాన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
టీమిండియా ఘన విజయం
-
టీమిండియా ఘన విజయం.. పాక్ కాచుకో!
ఢాకా : ఆసియా కప్ హాకీలో భారత్ జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. మలేషియాతో గురువారం(19న)ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో 6-2 తో ఇండియా జట్టు విజయం సాధించింది. మొదటి నుంచి టీం ఇండియా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు. కొత్త కోచ్ జోయెర్డ్ మరిన్ మార్గదర్శకంలో కుర్రాళ్లు బాగా రాణిస్తున్నారు.ఆరంభం నుంచి మన ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాలను గోల్స్ గా మలుచుకుని విజయానికి బాటలు వేశారు. మలేషియాపై ఘనవిజయంతో భారత్ సూపర్ ఫోర్కు చేరుకుంది. రెండు మ్యాచ్‌లతో నాలుగు పాయింట్లు సాధించింది. టీమిండియా అద్భుత ప్రదర్శనతో మలేషియాను కంగు తినిపించింది. సూపర్ ఫోర్ దశ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా జట్టు శనివారం(21వ తేదీన) పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆకాశ్‌దీప్ సింగ్, ఎస్కె ఉతప్ప, గుజరాత్ సింగ్, ఎస్వీ సునీల్, సర్దార్ సింగ్‌లు తమ ప్రదర్శనతో గోల్స్ సాధించారు. మలేషియా జట్టులో రజి రహీమ్, రమ్దాన్ రోస్లీలు గోల్స్ కొట్టారు. గత బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా- దక్షిణ కొరియా జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు ఆ మ్యాచ్‌లో రెండు జట్లు 1-1 గోల్స్ సాధించిన విషయం తెలిసిందే. -
నేడు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం
కల్లూరు : జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అండర్ 14 బాల బాలికల రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నగర శివారులోని ఇండస్ స్కూల్ ఆవరణలో ప్రారంభమవుతున్నాయని ఫెడరేషన్ కార్యదర్శి పవన్‌కుమార్ గురువారం తెలిపారు. డీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. జట్టు క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ ప్రతినిధి నరసయ్య, సంఘం కార్యదర్శి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న హాకీ క్రీడలు
నల్లగొండ రూరల్ : రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల క్రీడలను రెండో రోజైన శనివారం పద్మశ్రీ అవార్డు గ్రహిత ముఖేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మాట్లాడారు. క్రీడల సందర్భంగా మహబూబ్‌నగర్ జట్టు వరంగల్‌పై 1–0 ఆధిక్యంతో విజయం సాధించింది. నల్లగొండ జట్టు మెదక్‌పై 2–0, హైదరాబాద్ జట్టు ఖమ్మంపై 7–0, రంగారెడ్డి జట్టు నిజామాబాద్‌పై 2–1 ఆధిక్యంతో విజయం సాధించాయి. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు చిన వెంకటరెడ్డి, డీఎస్డీఓ మక్బూల్ అహ్మద్, కరీం, పి.కృష్ణమూర్తిగౌడ్, శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు.