
ప్రవీణ్‌రావు ఇంటి వద్ద గుమికూడిన జనం
సాక్షి, కంటోన్మెంట్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో కిడ్నాప్ కలకలం రేపింది. ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారుల మంటూ లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు సమాచారం.
అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బల వంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అనంతరం సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఐతే.. హఫీజ్‌పేట భూవివాదానికి సంబంధించే ఈ కిడ్నాప్ జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కవిత అక్కడకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
.
Comments
Please login to add a commentAdd a comment