
ఈనెల 28న జపాన్‌లో మొదలయ్యే ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు రాణి రాంపాల్ నేతృత్వం వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రజని ఎతిమరపు రెండో గోల్‌కీపర్‌గా జట్టులో స్థానాన్ని నిలబెట్టుకుంది. మరో గోల్‌కీపర్ సవిత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. కొత్త కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో తొలి టోర్నీలో బరిలోకి దిగుతున్న భారత్ విజేతగా నిలిస్తే వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది.