దోహా (ఖతర్): ఆసియాన్ కప్ ఫుట్‌బాల్ టోర్నీని భారత జట్టు పరాజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 2–0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. ఆసీస్ తరఫున 50వ నిమిషంలో జాక్సన్ ఇరి్వన్, 73వ నిమిషంలో జోర్డాన్ బాస్ గోల్స్ సాధించారు. ఆసీస్ ఆటను దూకుడుగా ప్రారంభించింది. ఆరంభంలోనే అజీజ్ బెహిచ్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు దూరంగా వెళ్లిపోగా, గుడ్‌విన్ ఇచ్చిన ఫ్రీ కిక్‌ను హెడర్‌తో గోల్ చేయడంలో డ్యూక్ విఫలమయ్యాడు.
16వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసేందుకు మంచి అవకాశం లభించింది. నిఖిల్ పుజారి క్రాసింగ్ పాస్ అందించగా, కెపె్టన్ సునీల్ ఛెత్రి దానిని గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి అర్ధభాగంలో ఆసీస్‌ను నిలువరించడంలో భారత గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సఫలమయ్యాడు. తమకు లభించిన 11 కార్నర్ కిక్‌లలో ఆసీస్ సఫలం కాలేదు. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్ది సేపటికే ఆ్రస్టేలియా పైచేయి సాధించింది.
మార్టిన్ బాయెల్ కొట్టిన షాట్‌ను గుర్‌ప్రీత్ ఆపగలిగినా...అక్కడే ఉన్న ఇర్విన్ దానిని గోల్‌గా మలిచాడు. 69వ నిమిషంలో కూడా గోల్ చేసేందుకు చేరువైన భారత్ మళ్లీ విఫలమైంది. స్కోరు సమం చేసేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికే సుభాషిష్ బోస్‌ను తప్పించి ర్యాన్ మెక్‌గ్రీ బంతితో దూసుకెళ్లగా...పోస్ట్‌కు దగ్గరలోనే ఉన్న బాస్ దానిని అందుకొని సునాయాసంగా గోల్ సాధించాడు. తమ తర్వాతి మ్యాచ్‌లో గురువారం ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment