AFC Cup
-
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
దోహా (ఖతర్): ఆసియాన్ కప్ ఫుట్‌బాల్ టోర్నీని భారత జట్టు పరాజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 2–0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. ఆసీస్ తరఫున 50వ నిమిషంలో జాక్సన్ ఇరి్వన్, 73వ నిమిషంలో జోర్డాన్ బాస్ గోల్స్ సాధించారు. ఆసీస్ ఆటను దూకుడుగా ప్రారంభించింది. ఆరంభంలోనే అజీజ్ బెహిచ్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు దూరంగా వెళ్లిపోగా, గుడ్విన్ ఇచ్చిన ఫ్రీ కిక్‌ను హెడర్‌తో గోల్ చేయడంలో డ్యూక్ విఫలమయ్యాడు. 16వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసేందుకు మంచి అవకాశం లభించింది. నిఖిల్ పుజారి క్రాసింగ్ పాస్ అందించగా, కెపె్టన్ సునీల్ ఛెత్రి దానిని గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి అర్ధభాగంలో ఆసీస్‌ను నిలువరించడంలో భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సఫలమయ్యాడు. తమకు లభించిన 11 కార్నర్ కిక్‌లలో ఆసీస్ సఫలం కాలేదు. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్ది సేపటికే ఆ్రస్టేలియా పైచేయి సాధించింది. మార్టిన్ బాయెల్ కొట్టిన షాట్‌ను గుర్ప్రీత్ ఆపగలిగినా...అక్కడే ఉన్న ఇర్విన్ దానిని గోల్‌గా మలిచాడు. 69వ నిమిషంలో కూడా గోల్ చేసేందుకు చేరువైన భారత్ మళ్లీ విఫలమైంది. స్కోరు సమం చేసేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికే సుభాషిష్ బోస్‌ను తప్పించి ర్యాన్ మెక్గ్రీ బంతితో దూసుకెళ్లగా...పోస్ట్‌కు దగ్గరలోనే ఉన్న బాస్ దానిని అందుకొని సునాయాసంగా గోల్ సాధించాడు. తమ తర్వాతి మ్యాచ్‌లో గురువారం ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. -
AFC U-20 Womens Asian Cup: భారత అమ్మాయిల ఓటమి
వైట్ ట్రై సిటీ (వియత్నాం): ఆసియాన్ కప్ అండర్–20 మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయింట్ టోర్నమెంట్లో భారత్ కథ ముగిసింది. రెండో రౌండ్ చేరేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించలేకపోయింది. ఆతిథ్య వియత్నాంతో జరిగిన ఈ పోరును భారత్ 1–1తో డ్రా చేసుకుంది. భారత్ తరఫున బాబినా దేవి 12వ నిమిషంలో, వియత్నాం తరఫున ట్రాన్ హట్ 45+2వ నిమిషంలో గోల్స్ చేశారు. ఇరు జట్లు 3 మ్యాచ్‌ల తర్వాత 7 పాయింట్లతో సమంగా ఉన్నా... వియత్నాంతో పోలిస్తే గోల్ వ్యత్యాసంలో ఒక గోల్ తక్కువగా ఉన్న భారత్ నిష్క్రమించింది. -
భారత్ బరిలోకి దిగేది వచ్చే ఏడాదే
న్యూఢిల్లీ : ఏడాది పొడవునా వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే భారత ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాదిలో మిగిలిన రోజులను ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే ముగించనుంది. కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో... ఆసియా పరిధిలో అక్టోబర్, నవంబర్లలో జరగాల్సిన 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను... 2023 ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను గత సంవత్సరం నవంబర్‌లో మస్కట్ వేదికగా ఒమన్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 0–1 గోల్ తేడాతో ఓడింది. ఖతర్‌లో జరిగే 2022 ప్రపంచకప్ మెగా ఈవెంట్‌కు భారత్ అర్హత సాధించే అవకాశాలకు తెరపడినా 2023 ఆసియా కప్‌కు బెర్త్ పొందే అవకాశాలు మిగిలి ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 8న ఖతర్‌తో... ఆ తర్వాత స్వదేశంలో నవంబర్‌లో అఫ్గానిస్తాన్‌తో... నవంబర్లోనే బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఇ’లో ప్రస్తుతం భారత్ మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. టాప్–3లో నిలిస్తే భారత్‌కు 2023 ఆసియా కప్ క్వాలిఫయర్స్ మూడో రౌండ్లోకి నేరుగా బెర్త్ లభిస్తుంది. ‘చాలా దేశాల్లో కరోనా వైరస్ తీవ్రతను దృషిలో పెట్టుకొని ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచకప్, ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను వాయిదా వేశాం. ఈ మ్యాచ్‌లను వచ్చే ఏడాది ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తాం’ అని ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా), ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఒక ప్రకటనలో తెలిపాయి. -
భారత జట్టుకు జై కొట్టినందుకు..
యూఏఈలో జరుగుతున్న ఏషియన్ ఫుట్‌బాల్ కప్‌లో భాగంగా గురువారం రాత్రి యూఏఈ-భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 0-2 తో పరాజయం పాలైంది. అయితే, మ్యాచ్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులను ఓ దుబాయ్ షేక్ పక్షుల పంజరంలో బంధించాడు. వారితో యూఏఈకి మద్దతు పలుకుతామని బలవంతంగా చెప్పించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. ‘మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటారు?’ అని షేక్ ప్రశ్నించాడు. ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా.. ‘భారత జట్టుకే మా మద్దతు’ అనగానే.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరంతా యూఏఈ జట్టుకే మద్దతు పలకాలని చేతిలో బెత్తం పట్టుకుని బెదిరించాడు. దాంతో ఫ్యాన్స్ యూఏఈకే మద్దతు పలుకుతామని చెప్పడంతో పంజరం నుంచి విడుదల చేశాడు. ఈ తతంగానికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూఏఈ అటార్నీ జనరల్ స్పందించారు. వివక్షాపూరితంగా వ్యవహరించి, బెదిరింపులకు పాల్పడినందుకు సదరు షేక్‌కు అరెస్టు వారెంట్ జారీ చేశారు. విచారణ నిమిత్తం అటెండ్ కావాలని ఆదేశించారు. కాగా, ఈ విషయం అరెస్టు దాకా వెళ్లడంతో సదరు షేక్ మాటమార్చాడు. ‘వీడియోలో చేసిందంతా సరదా కోసమే. పంజరంలో వేసిన వారంతో నా దగ్గర పనిచేసేవారే. గత 20 ఏళ్లుగా వీళ్లు నాకు బాగా తెలుసు. మేమేంతా కలిసిమెలిసి ఉంటాం. ఒకే కంచంలో కలిసి భోజనం కూడా చేస్తాం. అదంతా ఉత్తిదే. నేను వారిని కొట్టలేదు. అసలు నిజంగా వారిని బంధించనేలేదు’ అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు. టీమిండియా అభిమానులు పలు ఆసియా దేశాలకు చెందినవారుగా తెలిసింది. -
బెంగళూరు ఎఫ్సీకి నిరాశ
ఏఎఫ్సీ కప్ విజేత ఇరాక్ ఎయిర్‌ఫోర్స్ క్లబ్ దోహా: ఆసియా ఫుట్‌బాల్ క్లబ్‌ల కప్ (ఏఎఫ్సీ కప్) ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ జట్టుగా రికార్డు సృష్టించిన బెంగళూరు ఎఫ్‌సీ జట్టుకు తుది పోరులో నిరాశ తప్పలేదు. శనివారం జరిగిన ఫైనల్లో ఇరాక్‌కు చెందిన ఎరుుర్‌ఫోర్స్ క్లబ్ 1-0తో బెంగళూరు జట్టును ఓడించింది. 70వ నిమిషంలో హమ్మది అహ్మద్ ఆ జట్టుకు గోల్ అందించాడు. విజేత ఎరుుర్‌ఫోర్స్ క్లబ్‌కు 10 లక్షల డాలర్లు (రూ.6.5 కోట్లు) రన్నరప్ బెంగళూరుకు 5లక్షల డాలర్లు (రూ.3.25కోట్లు) నగదు బహుమతి లభించింది. -
ఆ క్రెడిట్ కెప్టెన్ ఒక్కడిదే కాదు: కోచ్ రోకా
బెంగళూరు: తాము కేవలం ఒకే ఆటగాడి ప్రదర్శనపై ఎప్పూడు ఆధారపడి లేమని బెంగళూరు ఎఫ్‌సీ జట్టు కోచ్ అల్బర్ట్ రోకా స్పష్టంచేశాడు. స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు అద్బుత గోల్స్ చేయడంతో బెంగళూరు జట్టు ఏఎఫ్ సీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు, టెక్నికల్ స్టాఫ్ అందరి శ్రమ ఇందులో దాగి ఉందన్నాడు. సెమిఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ జోహర్ దరుల్ టాజిమ్ పై 3-1 గోల్స్ తేడాతో బెంగళూరు నెగ్గింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వల్లే బెంగళూరు ఫైనల్ చేరిందని వస్తున్న కామెంట్లపై ఆ టీమ్ కోచ్ అల్బర్ట్ రోకా తీవ్రస్థాయిలో స్పందించాడు. ఏఎఫ్ సీ కప్ ఫైనల్లోకి ఓ భారత జట్టు ప్రవేశించడం ఇదే తొలిసారి. ఛెత్రి కెప్టెన్సీలో ఆటగాళ్లందరూ రాణించడం వల్ల బెంగళూరు నెగ్గిందనీ.. అంతేకానీ వన్ మ్యాన్ షో అని అనడం సరికాదని సూచించాడు. మరోవైఫు ఫైనల్స్ చేరిన ఇరాక్ జట్టు ఎయిర్ ఫోర్స్ ఎఫ్‌సీ ఈ టోర్నీలో 26 గోల్స్ చేసిందని, ముందు ఆ విషయంపై తమ జట్టు ఫోకస్ చేస్తోందని బెంగలూరు కోచ్ రోకా వివరించారు.