AFC U-20 Womens Asian Cup: భారత అమ్మాయిల ఓటమి | AFC U-20 Womens Asian Cup Qualifiers: India draw with Vietnam, eliminated on goal difference | Sakshi
Sakshi News home page

AFC U-20 Womens Asian Cup: భారత అమ్మాయిల ఓటమి

Published Sun, Mar 12 2023 6:33 AM | Last Updated on Sun, Mar 12 2023 6:33 AM

AFC U-20 Womens Asian Cup Qualifiers: India draw with Vietnam, eliminated on goal difference - Sakshi

వైట్‌ ట్రై సిటీ (వియత్నాం): ఆసియాన్‌ కప్‌ అండర్‌–20 మహిళల ఫుట్‌బాల్‌ క్వాలిఫయింట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ కథ ముగిసింది. రెండో రౌండ్‌ చేరేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించలేకపోయింది. ఆతిథ్య వియత్నాంతో జరిగిన ఈ పోరును భారత్‌ 1–1తో డ్రా చేసుకుంది.

భారత్‌ తరఫున బాబినా దేవి 12వ నిమిషంలో, వియత్నాం తరఫున ట్రాన్‌ హట్‌ 45+2వ నిమిషంలో గోల్స్‌ చేశారు. ఇరు జట్లు 3 మ్యాచ్‌ల తర్వాత 7 పాయింట్లతో సమంగా ఉన్నా... వియత్నాంతో పోలిస్తే గోల్‌ వ్యత్యాసంలో ఒక గోల్‌ తక్కువగా ఉన్న భారత్‌ నిష్క్రమించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement