
భారత్‌కు హ్యాట్రిక్ విజయం
మకావు: ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు హవా కొనసాగుతోంది. మంగళవారం జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో 2–0తో మకావు జట్టును ఓడించింది. సబ్‌స్టిట్యూట్ స్ట్రయికర్ బల్వంత్ సింగ్ ద్వితీయార్ధంలో అద్భుతంగా ఆడి 57, 82వ నిమిషాల్లో రెండు గోల్స్‌తో చెలరేగాడు.
దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లో తమ వరుస విజయాల సంఖ్యను భారత్ 11కి పెంచుకుంది. ఈ టోర్నీలో జట్టుకిది హ్యాట్రిక్ విజయం. తాజాగా తొమ్మిది పాయింట్లతో ఉన్న భారత్ 2019లో జరిగే ఆసియాకప్ బెర్త్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.