Asian Cup Qualifying
-
AFC U-20 Womens Asian Cup: భారత అమ్మాయిల ఓటమి
వైట్ ట్రై సిటీ (వియత్నాం): ఆసియాన్ కప్ అండర్–20 మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయింట్ టోర్నమెంట్లో భారత్ కథ ముగిసింది. రెండో రౌండ్ చేరేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించలేకపోయింది. ఆతిథ్య వియత్నాంతో జరిగిన ఈ పోరును భారత్ 1–1తో డ్రా చేసుకుంది. భారత్ తరఫున బాబినా దేవి 12వ నిమిషంలో, వియత్నాం తరఫున ట్రాన్ హట్ 45+2వ నిమిషంలో గోల్స్ చేశారు. ఇరు జట్లు 3 మ్యాచ్‌ల తర్వాత 7 పాయింట్లతో సమంగా ఉన్నా... వియత్నాంతో పోలిస్తే గోల్ వ్యత్యాసంలో ఒక గోల్ తక్కువగా ఉన్న భారత్ నిష్క్రమించింది. -
భారత్‌కు హ్యాట్రిక్ విజయం
మకావు: ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత ఫుట్‌బాల్ జట్టు హవా కొనసాగుతోంది. మంగళవారం జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో 2–0తో మకావు జట్టును ఓడించింది. సబ్‌స్టిట్యూట్ స్ట్రయికర్ బల్వంత్ సింగ్ ద్వితీయార్ధంలో అద్భుతంగా ఆడి 57, 82వ నిమిషాల్లో రెండు గోల్స్‌తో చెలరేగాడు. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లో తమ వరుస విజయాల సంఖ్యను భారత్ 11కి పెంచుకుంది. ఈ టోర్నీలో జట్టుకిది హ్యాట్రిక్ విజయం. తాజాగా తొమ్మిది పాయింట్లతో ఉన్న భారత్ 2019లో జరిగే ఆసియాకప్ బెర్త్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.