టొరంటోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్యాండిడెట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు విదిత్ గుజరాతీ మరో కీలక విజయాన్ని నమోదు చేశాడు. 9వ రౌండ్‌లో హికారు నకమురా (అమెరికా)ను విదిత్ ఓడించాడు. ఈ గెలుపుతో ఓవరాల్‌గా 4.5 పాయింట్లతో విదిత్...నకమురా, కరువానాలతో కలిసి నాలుగో స్థానంలో నిలిచారు. మరో వైపు ఇద్దరు భారత ఆటగాళ్లు
డి.గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్ ‘డ్రా’గా ముగిసింది.
తాజా ఫలితం తర్వాత గుకేశ్, నెపొమినియాచి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 4 పాయింట్లతో ప్రజ్ఞానంద తర్వాతి స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 9వ రౌండ్ గేమ్ ‘డ్రా’ అయింది. హోరాహోరీ పోరు తర్వాత హంపి, రష్యాకు చెందిన కటెరినా లాగ్నో తమ గేమ్‌ను సమంగా ముగించారు. హంపికి మధ్యలో విజయావకాశాలు వచి్చనా కటెరినా తెలివిగా ఆడి తప్పించుకోలిగింది. అయితే మరో భారత ప్లేయర్ ఆర్.వైశాలి...చైనాకు చెందిన జోంగి తన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం హంపి 4 పాయింట్లతో ముజిచుక్ (ఉక్రెయిన్)తో కలిసి ఐదో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment