
ఇక్సాన్ సిటీ: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్‌సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్ కిరణ్ జార్జి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ కిరణ్ జార్జి 21–14, 21–16తో ప్రపంచ 34వ ర్యాంకర్, ఐదో సీడ్ టకుమా ఒబయాషి (జపాన్)పై గెలుపొందాడు. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.
ఒబయాషిపై కిరణ్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్)తో కిరణ్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment