జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు అర్జున్ ఇరిగేశి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో టైబ్రేకర్ ద్వారా క్రిస్టోఫర్ యూ (అమెరికా)పై విజయం సాధించాడు. నాలుగు ర్యాపిడ్ గేమ్‌ల తర్వాత అర్జున్, క్రిస్టోఫర్ 2–2తో సమంగా నిలిచారు. దాంతో బ్లిట్జ్ టైబ్రేక్ నిర్వహించగా... తొలి గేమ్‌లో అర్జున్ గెలిచాడు. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్న అతను సెమీస్ చేరాడు. అయితే మరో భారత ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు.
జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో 1–3తో ప్రజ్ఞానంద ఓడాడు. తొలి గేమ్‌ను ఓడి రెండు గేమ్‌లు డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద తప్పనిసరిగా గెలవాల్సిన నాలుగో గేమ్‌లో కూడా పరాజయంపాలయ్యాడు. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), లీమ్ క్వాంగ్ లీ (వియత్నాం) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆరోనియన్‌పై కార్ల్‌సన్, నీమన్‌పై క్వాంగ్ లీ గెలుపొందారు. సెమీస్‌లో కార్ల్‌సన్‌తో కీమర్, క్వాంగ్ లీతో అర్జున్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment