rapid chess
-
రన్నరప్ హంపి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అద్భుతమైన ఎత్తులతో ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ... భారత చెస్ స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. గురువారం ముగిసిన మహిళల ర్యాపిడ్ ఈవెంట్లో కోనేరు హంపి విజేతను నిర్ణయించిన ‘ప్లే ఆఫ్’ టైబ్రేక్స్‌లో 1.5–2.5 పాయింట్ల తేడాతో అనస్తాసియా బొద్నారుక్ (రష్యా) చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకుంది. ఒత్తిడిలో సంయమనంతో ఆడిన అనస్తాసియా తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీ చరిత్రలో హంపికిది మూడో పతకం కావడం విశేషం. 2019లో విశ్వవిజేతగా నిలిచిన హంపి 2012లో కాంస్య పతకం సాధించింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత బొద్నారుక్, హంపి, టింగ్జె లె (చైనా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా బొద్నారుక్, హంపి తొలి రెండు స్థానాల్లో నిలవడంతో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ నిర్వహించారు. బ్లిట్జ్ పద్ధతిలో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 56 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో హంపి 38 ఎత్తుల్లో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో తదుపరి గేమ్‌లో గెలిచిన ప్లేయర్‌కు టైటిల్ ఖరారు చేసే ‘సడన్‌డెత్’ గేమ్‌ను నిర్వహించారు. అయితే ఈ గేమ్ 52 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అయితే నాలుగో గేమ్‌లో బొద్నారుక్ 39 ఎత్తుల్లో హంపిపై గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు నూతక్కి ప్రియాంక, సాహితి వర్షిణి 7 పాయింట్లతో వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు. 13 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ 9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద 9 పాయింట్లతో 8వ స్థానంలో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 10 పాయింట్లతో మరోసారి ప్రపంచ చాంపియన్ అయ్యాడు. -
సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి
భారత చెస్ దిగ్గజం.. ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు షాక్ తగిలింది. భారత 17 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ దిగ్గజంతో తలపడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం విశేషం. విషయంలోకి వెళితే.. క్రోయేషియా రాజధాని జగ్రెబ్‌లో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ బ్లిట్జ్ క్రొయేషియా 2023 పోటీల్లో గుకేశ్, ఆనంద్ పోటీ పడ్డారు. ‘ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బాగా ఆడతానని తెలుసు. అయితే. ఆనంద్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. నేను ఎంతగానో ఆరాధించే ఆటగాడిపై విజయం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది’ అని గుకేశ్ అన్నాడు. అయితే.. 10 పాయింట్లు సాధించిన ఈ ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు. చెన్నైకి చెందిన గుకేశ్‌కి విశ్వనాథన్ ఆనంద్ అంటే చాలా ఇష్టం. అతడిని చూస్తూ పెరిగిన గుకేశ్ పెద్దయ్యాక చెస్ ప్లేయర్ కావాలనుకన్నాడు. అండర్ -13 చాంపియన్‌గా నిలిచాడు. అయితే.. ప్రపంచంలో అతి చిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్‌గా రికార్డు చేజార్చుకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది జూన్ నెలలో వరల్డ్ నంబర్-1 మాగ్నస్ కార్లోసన్(Magnus Carlsen)ను ఓడించి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈరోజు ఆనంద్‌పై పైచేయి సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం -
Julius Baer Generation Cup: ఫైనల్లో అర్జున్
న్యూయార్క్: జూలియస్ బేర్ జనరేషన్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ జోరు కొనసాగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అర్జున్ ఈ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. లియెమ్ క్వాంగ్ లీ (వియత్నాం)తో జరిగిన సెమీఫైనల్లో అర్జున్ 4–2తో గెలిచాడు. నిర్ణీత నాలుగు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలువడంతో రెండు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. రెండు టైబ్రేక్ గేముల్లో అర్జున్ విజయం సాధించాడు. టైటిల్ కోసం ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్ (నార్వే)తో అర్జున్ తలపడతాడు. వీరిద్దరి మధ్య రెండు రోజులపాటు నాలుగు గేమ్‌లతో కూడిన రెండు ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
Julius Baer Generation Cup: సెమీఫైనల్లో అర్జున్ ఇరిగేశి
జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు అర్జున్ ఇరిగేశి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో టైబ్రేకర్ ద్వారా క్రిస్టోఫర్ యూ (అమెరికా)పై విజయం సాధించాడు. నాలుగు ర్యాపిడ్ గేమ్‌ల తర్వాత అర్జున్, క్రిస్టోఫర్ 2–2తో సమంగా నిలిచారు. దాంతో బ్లిట్జ్ టైబ్రేక్ నిర్వహించగా... తొలి గేమ్‌లో అర్జున్ గెలిచాడు. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్న అతను సెమీస్ చేరాడు. అయితే మరో భారత ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో 1–3తో ప్రజ్ఞానంద ఓడాడు. తొలి గేమ్‌ను ఓడి రెండు గేమ్‌లు డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద తప్పనిసరిగా గెలవాల్సిన నాలుగో గేమ్‌లో కూడా పరాజయంపాలయ్యాడు. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లీమ్ క్వాంగ్ లీ (వియత్నాం) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆరోనియన్పై కార్ల్సన్, నీమన్‌పై క్వాంగ్ లీ గెలుపొందారు. సెమీస్‌లో కార్ల్సన్తో కీమర్, క్వాంగ్ లీతో అర్జున్ తలపడతారు. -
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం..
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద పెను సంచలనం నమోదు చేశాడు. మెల్ట్‌వాటర్ చాంపియన్స్ చెస్ టూర్.. చెసెబుల్ ఆన్లైన్ మాస్టర్స్ టోర్నమెంట్లో ఫైనల్లో అడుగపెట్టాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో డచ్ గ్రాండ్ మాస్టర అనిష్ గిరిని 3.5-2.5తో ఓడించి చెసెబుల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు గేమ్‌ల పాటు 2-2తో సమానంగా ఉన్నప్పటికి.. కీలకమైన టై బ్రేక్‌లో ప్రజ్ఞానంద విజృంభించి అనిష్గిరిపై సంచలన విజయం సాధించాడు. కాగా తొలి గేమ్‌లో ఓడినప్పటికి ప్రజ్ఞానంద ఫుంజుకొని రెండోగేమ్‌లో విజయం సాధించాడు. మళ్లీ మూడో గేమ్‌లో అనిష్ గిరి మొదట ఆధిక్యంలో కనిపించినప్పటికి.. ప్రజ్ఞానంద ఎత్తుకు పై ఎత్తులు వేసి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కీలకమైన నాలుగో గేమ్‌లో అనిష్ గిరి విజయం సాధించడంతో 2-2తో మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో 33వ ఎత్తులో అనిష్ చేసిన తప్పు ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. మ్యాచ్ అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సాగడంతో మ్యాచ్ పూర్తైన తర్వాత ప్రజ్ఞా.. ''నాకు ఉదయం 8:45 గంటలకు స్కూల్ ఉంది.. ఇప్పుడు సమయం ఉదయం రెండు దాటింది. స్కూల్‌కు వెళ్లగలనా'' అంటూ పేర్కొన్నాడు. కాగా ప్రజ్ఞానంద ప్రదర్శనపై కోచ్ ఆర్బీ రమేశ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ప్రజ్ఞానంద ఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ నెంబర్-2 డింగ్ లిరెన్‌తో ప్రజ్ఞానంద తలపడనున్నాడు. కాగా డింగ్ లిరెన్.. సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్‌ను 2.5- 1.5తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు. చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది బ్రూస్ లీ ఆరాధించిన భారత్ ఫహిల్వాన్ ఎవరో తెలుసా? చెస్ వరల్డ్ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు -
చెస్ వరల్డ్ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు
చెస్ వరల్డ్ చాంపియన్.. నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు 16 ఏళ్ల భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరోసారి షాక్ ఇచ్చాడు. చెస్బుల్ మాస్టర్స్ ఆన్లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద.. కార్ల్సన్తో తలపడ్డాడు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కార్ల్సెన్ 40వ ఎత్తుగడలో పెద్ద తప్పు చేశాడు. ఇది ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. దీంతో కార్ల్‌సన్‌కు చెక్ పెట్టిన ప్రజ్ఞా మ్యాచ్‌ను కైవసం చేసుకోవడంతో పాటు 12 పాయింట్లు సాధించాడు. కార్ల్‌సన్‌పై గెలుపుతో ప్రజ్ఞానంద నాకౌట్ స్టేజ్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాడు. ఓవరాల్‌గా చెస్బుల్ మాస్టర్స్‌లో రెండోరోజు ముగిసేసరికి కార్ల్సన్ 15 పాయింట్లతో మూడో స్థానంలో.. 12 పాయింట్లతో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది రెండోసారి. ఇంతకముందు గత ఫిబ్రవరిలో ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్సెన్ను చిత్తుగా ఓడించి ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదవండి: ప్రపంచ నం.1 ఆటగాడికి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు Magnus Carlsen blunders and Praggnanandhaa beats the World Champion again! https://t.co/J2cgFmhKbT #ChessChamps #ChessableMasters pic.twitter.com/mnvL1BbdVn — chess24.com (@chess24com) May 20, 2022 -
ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్సెన్కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు
ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ నం.1, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్కు 16 ఏళ్ల భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద షాకిచ్చాడు. కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్సెన్ను చిత్తుగా ఓడించి సంచలనం సృష్టించాడు. గేమ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్సెన్కు ముచ్ఛెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా, తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదవండి: ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీలో మార్పు.. ధనాధన్ లీగ్ ఎప్పటి నుంచి అంటే..? -
ఆరో స్థానంలో హంపి
వార్సా (పోలాండ్): ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7.5 పాయింట్లు సాధించింది. హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. హంపితోపాటు మరో ఎనిమిది మంది కూడా 7.5 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హంపికి ఆరో స్థానం దక్కింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ కొస్టెనియుక్ 9 పాయింట్లతో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. బిబిసారా (కజకిస్తాన్–8.5) రన్నరప్ నిలిచింది. గునీనా (రష్యా), కాటరీనా (రష్యా), సెరిక్బె (కజకిస్తాన్) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. -
ఖేల్‌రత్న రేసులో తెలుగు తేజాలు
చెన్నై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ కోసం ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించేందుకు మరో మూడు రోజులు ఉన్నందున ఆయా జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు తమ అత్యుత్తమ క్రీడాకారుల పేర్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం నామినేట్ చేస్తున్నాయి. తాజాగా అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భారత మహిళా చెస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి పేరును ‘ఖేల్‌రత్న’ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 34 ఏళ్ల హంపి 2019 డిసెంబర్లో ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా గతేడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్‌లోనూ టైటిల్ సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా 2019లో రష్యాలో జరిగిన తొలి టోర్నీలో చాంపియన్‌గా, మొనాకో లో జరిగిన రెండో టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా గ్రాండ్‌ప్రి సిరీస్‌లో రెండో స్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ హంపి సభ్యురాలిగా ఉంది. హంపికి 2003లోనే అర్జున అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుతోపాటు ఇతర ప్లేయర్లు విదిత్ గుజరాతి, ఆధిబన్, సేతురామన్, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ఏఐసీఎఫ్ గౌరవ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ నామినేట్ చేశారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్... తెలంగాణకు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పేర్లను ‘ఖేల్‌రత్న’ కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సిఫారసు చేసింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో సాయిప్రణీత్ ఒక్కడే అర్హత సాధించాడు. మరోవైపు 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత చెప్పుకోతగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ చోప్రా, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ‘బాయ్’ ప్రతిపాదించింది. ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ కోసం ఒలింపియన్ పీవీవీ లక్ష్మి, లెరాయ్ డిసా పేర్లను... ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం భాస్కర్ బాబు, మురళీధరన్ పేర్లను ‘బాయ్’ పంపించింది. అవార్డీల కమిటీ మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు తొలి వారంలో తుది అవార్డులు గెల్చుకున్న వారి జాబితాను ప్రకటించే అవకాశముంది. -
Arjun Erigaisi: క్వార్టర్ ఫైనల్లో అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆసియా ర్యాపిడ్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ ప్రిలిమినరీ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం), భారత యువతార అర్జున్ ఇరిగైసి ఎనిమిదో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 16 మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ 15 రౌండ్లకుగాను 8 పాయింట్లు స్కోరు చేసి నాకౌట్ దశకు అర్హత సాధించిన ఏకైక భారత ప్లేయర్‌గా నిలిచాడు. సోమవారం ఆడిన ఐదు గేమ్‌లను 17 ఏళ్ల అర్జున్ (2567 ఎలో రేటింగ్) ‘డ్రా’ చేసుకోవడం విశేషం. 14వ రౌండ్ గేమ్‌లో ప్రస్తుతం క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ప్రపంచ చాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సన్ (నార్వే–2847 రేటింగ్)ను అర్జున్ 63 ఎత్తుల్లో నిలువరించి ‘డ్రా’ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. సో వెస్లీ (అమెరికా–2770)తో 11వ గేమ్‌ను 11 ఎత్తుల్లో... స్విద్లెర్ (రష్యా– 2714)తో 12వ గేమ్‌ను 40 ఎత్తు ల్లో... సలీమ్ (యూఏఈ–2682)తో 13వ గేమ్‌ను 36 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్–2780)తో జరిగిన చివరిదైన 15వ గేమ్‌ను అర్జున్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అరోనియన్‌తో అర్జున్; కార్ల్సన్తో సో వెస్లీ; లిరెన్ డింగ్‌తో జాన్ క్రిస్టాఫ్; వ్లాదిస్లావ్తో అనీశ్ గిరి తలపడతారు. భారత్‌కే చెందిన విదిత్ 10వ ర్యాంక్‌లో, గుకేశ్ 12వ ర్యాంక్‌లో, ఆధిబన్ 15వ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయారు. -
ర్యాపిడ్ చెస్ చాంప్స్ గౌతమ్, కార్తికేయ
సాక్షి, హైదరాబాద్: ఇన్విటేషనల్ ఓపెన్, చిల్డ్రన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో గౌతమ్ రామారావు విజేతగా నిలిచాడు. మణికొండలో జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో గౌతమ్, ముదబ్బిర్, జె.బి సత్య వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. చిల్డ్రన్ కేటగిరీలో అండర్-15 విభాగంలో కార్తికేయ టైటిల్‌ను కై వసం చేసుకున్నాడు. ఇతర విభాగాల్లో అభినవ్ (అండర్-14), సాద్విక్ (అండర్-13), లలిత్ (అండర్-12), స్ఫూర్తి (అండర్-11), చిరాయు (అండర్-10), ఎన్. తరుణ్‌తేజ (అండర్-9), తేజస్ (అండర్-8), శ్వేశిత్ (అండర్-7), లోహిత్ (అండర్-6) విజేతలుగా నిలిచారు. పోటీల అనంతరం అంతర్జాతీయ ఆర్బిటర్ జె.ఎన్. పద్మారావు విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.