సాక్షి, హైదరాబాద్: ఇన్విటేషనల్ ఓపెన్, చిల్డ్రన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో గౌతమ్ రామారావు విజేతగా నిలిచాడు. మణికొండలో జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో గౌతమ్, ముదబ్బిర్, జె.బి సత్య వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. చిల్డ్రన్ కేటగిరీలో అండర్-15 విభాగంలో కార్తికేయ టైటిల్‌ను కై వసం చేసుకున్నాడు.
ఇతర విభాగాల్లో అభినవ్ (అండర్-14), సాద్విక్ (అండర్-13), లలిత్ (అండర్-12), స్ఫూర్తి (అండర్-11), చిరాయు (అండర్-10), ఎన్. తరుణ్‌తేజ (అండర్-9), తేజస్ (అండర్-8), శ్వేశిత్ (అండర్-7), లోహిత్ (అండర్-6) విజేతలుగా నిలిచారు. పోటీల అనంతరం అంతర్జాతీయ ఆర్బిటర్ జె.ఎన్. పద్మారావు విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.