బన్నీని కలిసిన కార్తికేయ.. అవార్డు గెలిచినందుకు విషెస్ | Actor Kartikeya Met Allu Arjun On National Award - Sakshi
Sakshi News home page

Karthikeya: 'బెదురులంక' సక్సెస్.. ఆ సంతోషంలో బన్నీని కలిసి

Published Sun, Aug 27 2023 6:44 PM | Last Updated on Mon, Aug 28 2023 9:17 AM

Actor Kartikeya Met Allu Arjun National Award - Sakshi

కార్తికేయ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'బెదురులంక 2012' సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఆనందంలో ఉన్న కార్తికేయ.. నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ని కలిశాడు. తన తరఫున విషెస్ చెప్పాడు.  

(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్‌మెంట్.. డాక్టర్‌బాబు సందడి)

ఈ సందర్భంగా హీరో కార్తికేయ బన్నీని కలవడానికి వెళ్లగా, బన్నీ- కార్తికేయ ఒకరికొకరు అభినందనలు చెప్పుకొన్నారు. 'బెదురులంక' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని, త్వరలో తన ఫ్యామిలీతో కలిసి మూవీ చూస్తానని బన్నీ చెప్పడం కార్తికేయ తెగ ఆనందపడుతున్నాడు.

క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. రొటీన్‌కి భిన్నంగా ఉండే కథ కథనాలు ఆద్యంతం అలరించడంతో పాటు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా చిత్రంలోని చివరి 40 నిముషాలు థియేటర్లు నవ్వులతో నిండిపోతున్నాయని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. 

(ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement