![ISSF Shotgun World Cup 2023 Doha: India trap shooter Prithviraj wins bronze medal - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/12/PRITHVIRAJ.jpg.webp?itok=-K6Myoie)
దోహాలో జరుగుతున్న వరల్డ్ కప్ షాట్‌గన్ షూటింగ్‌లో భారత ఆటగాడు పృథ్వీరాజ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో అతను 20 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ఈ విభాగంలో ఒగుజాన్ టుజున్ (టర్కీ–33 పాయింట్లు), కోవార్డ్ హాలీ (బ్రిటన్–30 పాయింట్లు)కు స్వర్ణ, రజతాలు దక్కాయి. మరో వైపు మహిళల విభాగంలో శ్రేయాన్షి సింగ్ పతకావకాశాలు కోల్పోయింది. సెమీఫైనల్‌కు అర్హత సాధించిన శ్రేయాన్షియ ఆపై ముందంజ వేయడంలో విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment