world cup shoot gun tournment
-
ISSF Shotgun World Cup 2023 Doha: పృథ్వీరాజ్‌కు కాంస్యం
దోహాలో జరుగుతున్న వరల్డ్ కప్ షాట్‌గన్ షూటింగ్లో భారత ఆటగాడు పృథ్వీరాజ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో అతను 20 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఒగుజాన్ టుజున్ (టర్కీ–33 పాయింట్లు), కోవార్డ్ హాలీ (బ్రిటన్–30 పాయింట్లు)కు స్వర్ణ, రజతాలు దక్కాయి. మరో వైపు మహిళల విభాగంలో శ్రేయాన్షి సింగ్ పతకావకాశాలు కోల్పోయింది. సెమీఫైనల్‌కు అర్హత సాధించిన శ్రేయాన్షియ ఆపై ముందంజ వేయడంలో విఫలమైంది. -
మానవ్‌జిత్‌కు కాంస్యం
అకాపుల్కో (మెక్సికో): భారత అగ్రశ్రేణి షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధూ అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ షాట్‌గన్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో మానవ్‌జిత్ మూడో స్థానాన్ని సంపాదించాడు. ఒకవేళ మానవ్‌జిత్ ఫైనల్‌కు చేరుకొని ఉంటే వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించేవాడు. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో మానవ్‌జిత్, జోవో అజెవెడో (పోర్చుగల్) 12 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ‘షూట్ ఆఫ్’లో మానవ్‌జిత్ మూడు పాయింట్లు స్కోరు చేయగా... అజెవెడో రెండు పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.