యూకీ, సనమ్ ఓటమి | Yuki, Sanam Also Lose; No Indian In US Open Singles Event | Sakshi
Sakshi News home page

యూకీ, సనమ్ ఓటమి

Published Sat, Aug 23 2014 1:10 AM | Last Updated on Fri, Aug 24 2018 8:49 PM

యూకీ, సనమ్ ఓటమి - Sakshi

యూకీ, సనమ్ ఓటమి

యూఎస్ ఓపెన్ క్వాలిఫయర్స్
న్యూయార్క్: ఈ ఏడాది యూఎస్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో ఒక్క భారత ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడిన ముగ్గురు ఆటగాళ్లు కూడా పరాజయాలతో వెనుదిరిగారు. గాయం కారణంగా ఐదు నెలల పాటు టెన్నిస్‌కు దూరంగా ఉన ్న యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌లో 7-5, 2-6, 5-7 తేడాతో జేమ్స్ మెక్‌గీ (ఐర్లాండ్) చేతిలో ఓడాడు. 13 బ్రేక్ పాయింట్లు అవకాశం వచ్చినా యూకీ మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకోగలిగాడు. మరో మ్యాచ్‌లో సనమ్ సింగ్ 7-5, 6-7(3), 3-6తో జర్మనీకి చెందిన ఆండెరాస్ బెక్ చేతిలో మట్టికరిచాడు. భారత టాప్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ అంతకుముందే తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement