![ICC Womens T20 Rankings Radha Yadav Remains In Second Spot - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/22/RADHA.jpg.webp?itok=MejgJ86q)
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల బౌలింగ్ టి20 ర్యాంకుల్లో... భారత ఎడంచేతి వాటం స్పిన్నర్ రాధా యాదవ్ (769 రేటింగ్ పాయింట్లు) తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. టాప్ స్థానంలో ఆ్రస్టేలియా బౌలర్ మెగాన్ స్కట్ (773 రేటింగ్ పాయింట్లు) ఉంది. ఇక ఇతర భారత బౌలర్లలో దీప్తి శర్మ ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా... పూనమ్ యాదవ్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ విభాగంలో భారత ప్లేయర్లు తమ ర్యాంక్‌లను కాపాడుకున్నారు. జెమీమా రోడ్రిగ్స్ నాలుగో స్థానంలో ఉండగా... స్మృతి మంధాన ఐదు, హర్మన్‌ప్రీత్ కౌర్ తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. ఇక మహిళల టి20 జట్ల విభాగంలో భారత్ 260 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ్రస్టేలియా 293 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment