
ఐసీసీ బుధవారం ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో ఫినిషర్‌గా తనదైన పాత్ర పోషించిన కార్తిక్ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ఒకేసారి 108 స్థానాలు ఎగబాకి 392 పాయింట్లతో 87వ స్థానంలో(టాప్ 100) నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 55 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఆపై టీమిండియా సిరీస్‌లో 2-2తో సమంగా నిలిపిన కార్తిక్ బెస్ట్ ఫినిషర్‌గా పేరు పొంది రానున్న టి20 ప్రపంచకప్ 2022కు కీలకంగా మారాడు. ఇక ప్రొటీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం కావడంతో ట్రోపీని ఇరుజట్లు సంయుక్తంగా పంచుకున్నాయి.ఇక టీమిండియా నుంచి ఇషాన్ కిషన్ మాత్రమే టాప్-10లో కొనసాగుతున్నాడు.
గత వారం ఏడో స్థానంలో ఉన్న ఇషాన్.. ఒక స్థానం మెరుగుపరుచుకొని 703 పాయింట్లతో డెవన్ కాన్వే(న్యూజిలాండ్)తో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు అర్థసెంచరీలతో 206 పరుగులు చేశాడు. ఇక తొలి ఐదు స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. బాబర్ ఆజం(818 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. మహ్మద్ రిజ్వాన్(794 పాయింట్లు) రెండో స్థానంలో.. ఐడెన్ మార్క్రమ్(757 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో చహల్ మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో నిలవగా.. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Players are jostling for spots in the latest @MRFWorldwide T20I men's player rankings 📈
— ICC (@ICC) June 22, 2022
More 👉 https://t.co/ksceq8SPGY pic.twitter.com/1pFif8wMNH
చదవండి: టోర్నీకి ఎంపిక చేయలేదని యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment