T20 rankings
-
టాప్-3లోకి టీమిండియా వైస్ కెప్టెన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మంధన టాప్-3లోకి ప్రవేశించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరిన మంధన.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరింది.ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సిరీస్‌ల్లో ప్రదర్శనల ఆధారంగా మంధన ర్యాంక్‌లు మెరుగుపడ్డాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మంధన సూపర్ సెంచరీ (105) చేసింది. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మెరుపు అర్ద సెంచరీ (54) సాధించింది.మరోవైపు వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బేమౌంట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత బ్యాటర్ హర్లీన్ డియోల్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 64వ స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్ బ్యాటర్ నతాలీ సీవర్ బ్రంట్, ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు కోల్పోయి 13వ స్థానానికి పడిపోయింది.టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ స్థానం మెరుగపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత్‌కే చెందిన జెమీమా రోడ్రిగెజ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్‌కు చెందిన దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. -
తిలక్ @3
దుబాయ్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తిలక్ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (828 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ గల ఆటగాడిగా తిలక్ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (8వ ర్యాంక్) కూడా టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్ సంజూ సామ్సన్ 22వ ర్యాంక్‌కు చేరాడు.నాలుగు నెలల తర్వాత... ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్ 29న తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు.అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో రాణించిన హార్దిక్ 244 పాయింట్లతో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. -
వరుసగా విఫలమవుతున్నా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్న హర్మన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐసీసీ తాజాగా విడుదల చేసి టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. హర్మన్ ఇటీవలికాలంలో తరుచూ విఫలమవుతున్నా నాలుగు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకుంది. హర్మన్ శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమతో కలిసి సంయుక్తంగా 12వ స్థానాన్ని షేర్ చేసుకుంది. ఈ ఇద్దరి ఖాతాలో 610 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.హర్మన్ తాజాగా పాక్‌తో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో 29 పరుగులతో అజేయంగా నిలిచింది. దీనికి ముందు ఆమె న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ కెప్టెన్‌గానూ విఫలమైంది. భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మిగతా భారత క్రికెటర్ల విషయానికొస్తే.. స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. జెమీమా రోడ్రిగెజ్ రెండు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి చేరింది. బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. రేణుకా సింగ్ ఐదో స్థానాన్ని కాపాడుకుంది. మరో ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకుంది.ఓవరాల్‌గా చూస్తే.. బ్యాటింగ్‌లో బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్, లారా వోల్వార్డ్ట్ టాప్-3లో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో సోఫీ ఎక్లెస్టోన్, సదియా ఇక్బాల్, సారా గ్లెన్ టాప్-3లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, ఆష్లే గార్డ్నర్, మేలీ కెర్ టాప్-3లో ఉన్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ రేపు (అక్టోబర్ 9) జరుగబోయే మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీపడనుంది. సెమీస్ రేసులో ముందుండాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిచినా టీమిండియా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. తదుపరి భారత్ పాకిస్తాన్‌పై గెలిచినా నెట్ రన్‌రేట్ ఇంకా మైనస్‌లోనే ఉంది. మొత్తంగా భారత్ సెమీస్‌కు చేరాలంటే తదుపరి గ్రూప్ మ్యాచ్‌లన్నీ గెలవాల్సి ఉంటుంది. చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్ -
భారీ జంప్ కొట్టిన శుభ్‌మన్.. ఆరో స్థానానికి ఎగబాకిన యశస్వి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ భారీ జంప్ కొట్టాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో గిల్ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 37వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌తో పాటు మరో టీమిండియా బ్యాటర్ భారీ లబ్ది పొందాడు. ఇదివరకే టాప్-10లో ఉండిన యశస్వి జైస్వాల్.. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు. గత నెలలో రెండో స్థానానికి పడిపోయిన సూర్యకుమార్.. ఇటీవల జింబాబ్వేతో సిరీస్ ఆడనప్పటికీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. ట్రవిస్ హెడ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఏడు, టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఎనిమిది, విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్ తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఆదిల్ రషీద్, నోర్జే, హసరంగ, రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, అకీల్ హొస్సేన్, ఆడమ్ జంపా, ఫజల్ హక్ ఫారూఖీ, మహీశ్ తీక్షణ ఒకటి నుంచి తొమ్మిది స్థానాలను నిలుపుకున్నారు. అల్జరీ జోసఫ్, తబ్రేజ్ షంషి, గుడకేశ్ మోటీ తలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 10, 11, 12 స్థానాలకు ఎగబాకారు. భారత బౌలర్లలో టాప్-10లో ఎవరూ లేకపోగా.. అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు దిగజారి 13కు.. రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు దిగజారి 19కి, జస్ప్రీత్ బుమ్రా ఏడు స్థానాలు దిగజారి 21వ స్థానానికి పడిపోయారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోగా.. హసరంగ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
టాప్ ర్యాంక్ కోల్పోయిన హార్దిక్.. ఏడో స్థానానికి ఎగబాకిన రుతురాజ్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ సత్తా చాటారు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సుడిగాలి శతకంతో ఇరగదీసిన అభిషేక్.. ఎంట్రీలోనే అదుర్స్ అనిపించుకోగా.. అదే మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించిన రుతు.. 13 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. అభిషేక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లిస్ట్ అయిన తొలిసారే 75వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్ నుంచి టాప్-10 రుతురాజ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. గత వారమే అగ్రపీఠాన్ని కోల్పోయిన స్కై.. రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ టీ20 బ్యాటర్‌గా ట్రవిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, జోస్ బట్లర్, రుతురాజ్, బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్, మార్క్రమ్ వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ఆదిల్ రషీద్, అన్రిచ్ నోర్జే, హసరంగ టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, అకీల్ హొసేన్, ఆడమ్ జంపా, ఫజల్హక్ ఫారూఖీ, అక్షర్ పటేల్, తీక్షణ నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ మినహా టాప్-10లో ఎవరూ లేరు. కుల్దీప్ 11, బుమ్రా 14, భిష్ణోయ్ 16, అర్ష్‌దీప్ 19 స్థానాల్లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. గత వారం ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండిన హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి పడిపోయాడు. హసరంగ టాప్ ప్లేస్‌కు ఎగబాకాడు. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ 12వ స్థానంలో ఉన్నాడు.టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా టాప్-5లో ఉన్నాయి. -
మూడో స్థానానికి ఎగబాకిన హార్దిక్ పాండ్యా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారీ జంప్ కొట్టాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం హార్దిక్ ఖాతాలో 213 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో లంక కెప్టెన్ వనిందు హసరంగ మొదటి స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ రెండో స్థానంలో ఉన్నాడు. హసరంగ ఖాతాలో 222 రేటింగ్ పాయింట్లు ఉండగా.. నబీ ఖాతాలో 214 పాయింట్లు ఉన్నాయి. వరల్డ్‌కప్ ప్రదర్శనల ఆధారంగా తాజా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో చాలా మంది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. హసరంగ ఒక స్థానాన్ని, నబీ రెండు స్థానాలను, మార్క్రమ్ రెండు స్థానాలను (8వ ర్యాంక్), మ్యాక్స్‌వెల్ మూడు స్థానాలను (15వ ర్యాంక్), రసెల్ ఆరు స్థానాలను (16వ ర్యాంక్) మెరుగుపర్చుకున్నారు. టాప్-20 భారత్ నుంచి హార్దిక్‌తో పాటు అక్షర్ పటేల్ ఉన్నారు. అక్షర్ 130 రేటింగ్ పాయింట్లతో 19వ స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్ అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడు రోస్టన్ ఛేజ్. ఈ విండీస్ ఆల్‌రౌండర్ ఏకంగా 17 స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి చేరుకున్నాడు.టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే..ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. హాజిల్‌వుడ్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి.. ఆడమ్ జంపా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి.. అక్షర్ పటేల్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి ఎగబాకారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ వారం అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది బుమ్రా, కుల్దీప్ యాదవ్. బుమ్రా ఏకంగా 44 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి జంప్ కొట్టాడు. అలాగే కేశవ్ మహారాజ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 14 స్థానానికి ఎగబాకాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 17, రవి బిష్ణోయ్ 19 స్థానాల్లో ఉన్నారు. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన మార్క్ చాప్మన్, షాహీన్ అఫ్రిది
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ను ఇవాళ (ఏప్రిల్ 23) విడుదల చేసింది. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడు ఫార్మాట్లలో టాప్‌లో కొనసాగుతుంది.వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, షాహీన్ అఫ్రిది, ఐష్ సోధి, టిమ్ సీఫర్ట్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాప్మన్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 33వ స్థానానికి ఎగబాకగా.. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (టీ20) 3 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అఫ్రిది రెండు స్థానాలు మెరుగపర్చుకుని 17వ స్థానానికి చేరుకున్నాడు. కివీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ 27వ స్థానం నుంచి 24కు.. సోధి 23 స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఎయిరీ తొలిసారి టాప్-50 బ్యాటర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తద్వారా నేపాల్ తరఫున టాప్-50లో చోటు దక్కించుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్ కప్‌లో హాంగ్‌కాంగ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కారణంగా ఎయిరీ ర్యాంకింగ్స్‌లో మార్పు వచ్చింది.ఇవి కాకుండా తాజా ర్యాంకింగ్స్‌లో చెపుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్, వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతున్నారు. టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. అశ్విన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కేశవ్ మహారాజ్, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతున్నారు. -
‘టాప్’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్
గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నా... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల టి20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ 861 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో రాణించిన రషీద్ ఖాన్ నాలుగు స్థానాలు ఎగబాకి పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ 4వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
అగ్రపీఠాన్ని మరింత సుస్థిరం చేసుకున్న సూర్యకుమార్
భారత టీ20 జట్టు తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్లో తన బ్యాటింగ్ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 12) జరిగిన రెండో టీ20లో మెరుపు అర్ధసెంచరీ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించిన స్కై.. 10 రేటింగ్ పాయింట్లు అదనంగా కూడగట్టుకుని, తన సమీప ప్రత్యర్ధులందరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం స్కై ఖాతాలో 865 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మొహమ్మద్ రిజ్వాన్ ఖాతాలో 787 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం 78 పాయింట్లుగా ఉంది. టాప్ 10 ర్యాంకింగ్స్‌లో స్కై తర్వాత 700కు పైగా పాయింట్లు కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే ఉన్నాయి. రిజ్వాన్ 787, మార్క్రమ్ 758, బాబర్ ఆజమ్ 734 పాయింట్లు కలిగి ఉన్నారు. టాప్-10 ఉన్న మరో భారత ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (ఏడో ర్యాంక్) అనారోగ్యం కారణంగా సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడలేకపోవడంతో అతని ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. సూర్యకుమార్ ప్రస్తుత ఫామ్‌ను మరికొద్ది రోజుల పాటు కొనసాగించగలిగితే టీ20 వరల్డ్‌కప్ 2024లో టాప్ ర్యాంకింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడు. మరోవైపు సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడిన రింకూ సింగ్ ఏకంగా 46 స్థానాలు మెరుగుపర్చుకుని 59వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ప్లేస్‌కు చేరాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. పొట్టి ఫార్మాట్లో ఇటీవలే టాప్ ర్యాంక్ దక్కించుకున్న భారత అప్‌కమింగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్.. సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడే అవకాశం రాకపోవడంతో ఎలాంటి రేటింగ్ పాయింట్లు సాధించలేకపోయాడు. ప్రస్తుతానికి రవి తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నప్పటికీ.. ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రూపంలో అతనికి ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు బౌలర్లు సమానంగా 692 రేటింగ్ పాయింట్లు కలిగి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టాప్ 10లో రవి మినహా భారత్ నుంచి ఎవ్వరికీ ప్రాతినిథ్యం లభించకపోగా.. హసరంగ, ఆదిల్ రషీద్, తీక్షణ, సామ్ కర్రన్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్, అకీల్ హొసేన్, తబ్రేజ్ షంషి వరుసగా 3 నుంచి 10 స్థానాలో నిలిచారు. -
ఏకంగా 56 స్థానాలు మెరుగుపర్చుకున్న రుతురాజ్.. టాప్‌లో భిష్ణోయ్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ఆసీస్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో మూకుమ్మడిగా రాణించిన భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌ను భారీగా మెరుగుపర్చుకున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 55.75 సగటున 223 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్.. ఏకంగా 56 స్థానాలు మెరుగపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. అదే సిరీస్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన రవి భిష్ణోయ్ (5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) నంబర్ 1 ర్యాంకు అందుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ (5 మ్యాచ్‌ల్లో 144 పరుగులు) తన టాప్ ర్యాంక్‌ను (881 పాయింట్లు) మరింత పదిలం చేసుకున్నాడు. ఈ మార్పులు మినహాయించి తాజా టీ20 ర్యాంకింగ్స్ పెద్దగా మార్పులు జరగలేదు. బ్యాటింగ్‌లో స్కై తర్వాత మహ్మద్ రిజ్వాన్, మార్క్రమ్, బాబార్ ఆజమ్, రిలీ రొస్సో, డేవిడ్ మలాన్, రుతురాజ్, జోస్ బట్లర్, రీజా హెండ్రిక్స్, గ్లెన్ ఫిలిప్స్ వరుసగా టాప్-10లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హసరంగ, ఆదిల్ రషీద్, తీక్షణ, భిష్ణోయ్, సామ్ కర్రన్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్, అకీల్ హొసేన్, హాజిల్‌వుడ్ టాప్-10 జాబితాలో నిలిచారు. కాగా, ఆసీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
సత్తా చాటిన శుభ్‌మన్.. దుమ్మురేపిన తిలక్ వర్మ
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 9) విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. విండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించగా.. టీ20 సిరీస్‌లో ఇరగదీస్తున్న తిలక్ వర్మ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో ఓ హాఫ్‌సెంచరీ సాయంతో 126 పరుగులు చేసిన శుభ్‌మన్ 2 స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. 3 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీల సాయంతో 184 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 9 స్థానాలు మెరుగుపర్చుకుని 36వ ప్లేస్‌కు చేరుకున్నాడు. టీ20ల విషయానికొస్తే.. విండీస్‌తో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో ఇరగదీసిన తిలక్ (39, 51, 49 నాటౌట్).. అరంగేట్రంలోనే 21 స్థానాలు మెరుగుపర్చుకుని 46వ స్థానానికి చేరాడు. టీ20 బౌలింగ్ విషయానికొస్తే.. విండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కుల్దీప్ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఫార్మాట్లో కుల్దీప్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకాడు. టీ20 బౌలర్ల విభాగంలో భారత బౌలర్లు అక్షర్ 7 స్థానాలు, హార్ధిక్ పాండ్యా ఓ స్థానం మెరుగపర్చుకుని 33, 37 స్థానాల్లో నిలిచారు. విండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ రాణించిన హార్ధిక్.. బ్యాటింగ్‌లో 10 స్థానాలు, ఆల్‌రౌండర్ల విభాగంలో 5 స్థానాలు మెరుగుపర్చుకుని 71, 11 స్థానాల్లో నిలిచాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు (8) పడగొట్టిన శార్దూల్ ఠాకూర్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 30వ ప్లేస్‌కు చేరుకున్నాడు. పై పేర్కొన్న మార్పులు మినహా వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులు జరగలేదు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ఫకర్ జమాన్ టాప్-3లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ టాప్-3లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. వన్డేల్లో హాజిల్‌వుడ్, స్టార్క్, రషీద్ ఖాన్ టాప్-3లో ఉండగా.. టీ20ల్లో రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, హసరంగ టాప్‌లో ఉన్నారు. వన్డేల్లో భారత ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్‌తో పాటు విరాట్ కోహ్లి (9) టాప్-10లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో వన్డేల్లో మహ్మద్ సిరాజ్ (4), కుల్దీప్ (10) టాప్-10లో ఉండగా.. టీ20ల్లో భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేరు. టీ20ల్లో మెరుగైన ర్యాంకింగ్ కలిగిన భారత బౌలర్‌గా అర్షదీప్ (17) ఉన్నాడు. -
బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్‌ను కదిలించలేకపోయాడు
ICC T20 Rankings: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. గత ఏడాది నవంబర్ 2న సూర్య టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. బుధవారం (ఏప్రిల్ 26) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్య 906 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలోనే ఉన్నాడు. రిజ్వాన్ (811 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, బాబర్ ఆజమ్ (756 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. చదవండి: Hardik Pandya: కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు, తీసేయండి..! బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్‌ను కదిలించలేకపోయాడు.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో (5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20) సూపర్ సెంచరీతో (58 బంతుల్లో 101) చెలరేగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. బాబర్ శతక్కొట్టినా అతని ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. అతను ఇంకా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్ మహ్మద్ రిజ్వాన్ కూడా రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ అతని ర్యాంక్ కూడా మారలేదు. అతను రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. చదవండి: Rahane: ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా..! -
టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన శ్రీలంక బ్యాటర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
Women's T20 Rankings: తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్ ప్లేయర్స్ దుమ్మురేపారు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్‌కప్ సంచలన ప్రదర్శన నమోదు చేసిన శ్రీలంక యంగ్ గన్ విష్మి గుణరత్నే తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 169 ప్లేస్‌కు చేరుకుంది. 17 ఏళ్ల విష్మి.. టీ20 వరల్డ్‌కప్ రన్నరప్ సౌతాఫ్రికాపై 35 పరుగులు, సిక్స్ టైమ్ వరల్డ్ ఛాంపియన్, ప్రస్తుత జగజ్జేత ఆస్ట్రేలియాపై 24 పరుగులు సాధించడం ద్వారా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. బ్యాటర్ల విభాగంలో విష్మితో పాటు ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్న ప్లేయర్స్‌లో విండీస్‌కు చెందిన రషదా విలియమ్స్ (50 స్థానాలు), పాకిస్తాన్‌కు చెందిన ఫాతిమా సనా (36 స్థానాలు), బంగ్లా బ్యాటర్ నహిదా అక్తర్ (33 స్థానాలు), విండీస్ ప్లేయర్ చిన్నెల్ హెన్రీ (30 స్థానాలు) ఉన్నారు. ఈ విభాగంలో ఆసీస్ తహీల మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బెత్ మూనీ, స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్, సోఫీ డివైన్, లారా వొల్వార్డ్ట్, ఆష్లే గార్డెనర్, సూజీ బేట్స్, అలైసా హీలీ, నతాలీ సీవర్ టాప్ 10లో ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. సోఫీ ఎక్లెస్‌స్టోన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మ్లాబా, డార్సీ బ్రౌన్, సారా గ్లెన్, దీప్తి శర్మ, మెగాన్ షట్, షబ్మిమ్ ఇస్మాయిల్, లీ తహుహు, రేణుకా సింగ్, ఆష్లే గార్డెనర్ టాప్-10లో ఉన్నారు. ఈ విభాగంలో ఇంగ్లండ్ స్పిన్నర్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 77 స్థానాలు ఎగబాకగా.. లారెన్ బెల్ (ఇంగ్లండ్) 60 స్థానాలు, కరిష్మా రామ్హరాక్ (విండీస్) 49 స్థానాలు, హన్నా రోవ్ (బంగ్లాదేశ్) 35 స్థానాలు, జార్జీనా డెంప్సీ (ఐర్లాండ్) 33 స్థానాలు మెరుగుపర్చుకుని, కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌లకు చేరుకున్నారు. ఆల్రౌండర్ల్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 103 స్థానాలు మెరుగుపర్చుకోగా.. తుబా హసన్ (పాక్) 47 స్థానాలు, కరిష్మా రమహరాక్ (విండీస్) 36 స్థానాలు, సాదియా ఇక్బాల్ (పాక్) 34 స్థానాలు, చిన్నెల్ హెన్రీ (విండీస్) 31 స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్స్‌కు చేరుకున్నారు. ఈ విభాగంలో ఆష్లే గార్డెనర్ టాప్‌లో కొనసాగుతుండగా.. హేలీ మాథ్యూ, దీప్తి శర్మ, అమెలియా కెర్ర్, నతాలీ సీవర్, సోఫీ డివైన్, నిదా దార్, క్యాథరీన్ బ్రైస్, ఎల్లిస్ పెర్రీ, సల్మా ఖాతూన్ టాప్-10లో ఉన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్.. సత్తా చాటిన హార్ధిక్ పాండ్యా
ఐసీసీ తాజాగా (ఫిబ్రవరి 8) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. న్యూజిలాండ్‌పై సిరీస్ విక్టరీ (2-1) సాధించడంతో భారత ఆటగాళ్ల ర్యాంక్‌లు అమాంతం పెరిగిపోయాయి. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఏకంగా 168 స్థానాలు ఎగబాకి 30 స్థానానికి చేరుకోగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్ పాండ్యా అగ్రస్థానానికి అతి చేరువలో రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్‌తో సిరీస్‌లో పర్వాలేదనిపించిన అర్షదీప్ సింగ్ 8 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ టాప్ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారగా (14 నుంచి 15), కేఎల్ రాహుల్ 2 స్థానాలు దిగజారి 27కు, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 28 నుంచి 29 స్థానానికి చేరుకున్నాడు. టాప్ 30లో మొత్తంగా ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. సూర్యకుమార్ తర్వాత మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, డెవాన్ కాన్డే, డేవిడ్ మలాన్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్ గ్లెన్ ఫిలిప్స్, అలెక్స్ హేల్స్ టాప్-10లో ఉన్నారు. బౌలింగ్ కేటగిరి టాప్-30లో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. అర్షదీప్ 13, భువనేశ్వర్ కుమార్ 21, అశ్విన్ 29, అక్షర్ పటేల్ 30వ స్థానంలో నిలిచారు. రషీద్ తర్వాత వనిందు హసరంగ, ఆదిల్ రషీద్, జోష్ హేజిల్‌వుడ్, సామ్ కర్రన్, తబ్రేజ్ షంషి, ఆడమ్ జంపా, ముజీబుర్ రెహ్మాన్, అన్రిచ్ నోర్జే, మిచెల్ సాంట్నర్ టాప్-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్, హార్ధిక్ తర్వాత మహ్మద్ నబీ, హసరంగ, జెజె స్మిట్, సికందర్ రజా, డేవిడ్ వీస్, స్టొయినిస్, మొయిన్ అలీ, మ్యాక్స్‌వెల్ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆల్‌టైమ్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించడానికి మరో 9 పాయింట్లు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం స్కై ఖాతాలో 906 పాయింట్లు, ఉండగా ఆల్‌టైమ్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు డేవిడ్ మలాన్ పేరిట ఉన్నాయి. మలాన్ 2020లో 915 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్ పాండ్యా అగ్రస్థానానికి చేరుకునేందుకు మరో 2 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నాడు. -
వరల్డ్‌కప్ గెలవకపోయినా, టీమిండియానే నంబర్ 1
టీ20 వరల్డ్‌కప్-2022 ముగిసిన అనంతరం ఐసీసీ విడుదల చేసిన టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. వరల్డ్‌కప్‌లో సెమీస్‌లోనే నిష్క్రమించినా.. రోహిత్ సేన అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగింది. పొట్టి ఫార్మాట్లో గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత జట్టు.. ప్రస్తుతం 268 రేటింగ్ పాయింట్స్‌తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ జట్టు టీమిండియా తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 265 పాయింట్లు ఉన్నాయి. వరల్డ్‌కప్‌కు ముందు వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అంతరం చాలానే ఉన్నప్పటికీ.. వరల్డ్‌కప్ గెలుపుతో ఇంగ్లండ్.. టీమిండియా టాప్ ప్లేస్ దిశగా దూసుకొస్తుంది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య 3 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఇక వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ సైతం పాయింట్లను బాగా మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకింది. పాక్ ఖాతాలో 258 పాయింట్లు ఉన్నాయి. పాక్ తర్వాత సౌతాఫ్రికా (256), న్యూజిలాండ్ (253), ఆస్ట్రేలియా (252), వెస్టిండీస్ (236), శ్రీలంక (235), బంగ్లాదేశ్ (222), ఆఫ్ఘనిస్తాన్ (217) జట్లు వరుసగా 4 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. టీ20 బ్యాటర్ల విషయానికొస్తే.. సూర్యకుమార్, మహ్మద్ రిజ్వాన్, డెవాన్ కాన్వే తొలి మూడు స్థానాల్లో ఉండగా, బౌలింగ్‌లో హసరంగ, రషీద్ ఖాన్, జోష్ హేజిల్‌వుడ్ టాప్-3లో, ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ, హార్ధిక్ పాండ్యా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. చదవండి: Wasim Jaffer: సూర్యకుమార్ కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేశాడు.. ! -
సూర్య అగ్రస్థానం మరింత పదిలం.. దిగజారిన కోహ్లి ర్యాంక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లి టాప్-10లో చోటు కోల్పోయాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో 5 మ్యాచ్‌ల్లో 3 హాఫ్‌సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి గత వారమే చాలా గ్యాప్ తర్వాత టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో 653 రేటింగ్ పాయింట్స్‌తో 10వ స్థానంలో నిలిచిన కోహ్లి.. ఈ మధ్యలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 పరుగులకే ఔట్ కావడంతో, ఓ స్థానాన్ని కోల్పోయి 11 ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. మహ్మద్ రిజ్వాన్, డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, పథుమ్ నిస్సంక వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో నిలిచారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుస హాఫ్ సెంచరీలు బాది మళ్లీ టచ్‌లోకి వచ్చిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 5 స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ అగ్రపీఠానికి ఎగబాకాడు. మెగా టోర్నీలో 15 వికెట్లు పడగొట్టిన హసరంగ.. భారీగా రేటింగ్ పాయింట్లు పెంచుకుని టాప్ ప్లేస్‌కు చేరాడు. భారత బౌలర్లలో అశ్విన్ 5 స్థానాలు ఎగబాకి 13వ ప్లేస్‌కు చేరుకోగా.. వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన అర్షదీప్ నాలుగు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. -
రెండులో కొనసాగుతున్న సూర్య.. ఆరో స్థానంలో హార్ధిక్
ఐసీసీ తాజాగా (అక్టోబర్ 19) విడుదల చేసిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులేవీ లేవు. బ్యాటర్ల విభాగంలో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (861), టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (838), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (808) తొలి మూడు స్థానాల్లో యధాతథంగా కొనసాగుతుండగా.. మార్క్రమ్, డెవాన్ కాన్వే, డేవిడ్ మలాన్, ఫించ్, నిస్సంక, ముహ్మద్ వసీమ్, గ్లెన్ ఫిలిప్స్ నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. పదో స్థానంలో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ మినహా టాప్-10 జాబితా యధాతథంగా కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో రాణించిన ఫిలిప్స్.. 13 స్థానాలు ఎగబాకి పదో స్పాట్‌కు చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం టాప్-10లో రెండు మార్పులు జరిగాయి. ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్.. రెండు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకోగా, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్.. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఎనిమిదిలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్, రషీద్ ఖాన్, హసరంగ, షంషి తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా బౌలర్ల విషయానికొస్తే.. భువీ 12లో, అశ్విన్, అక్షర్ వరుసగా 22, 23 స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చాడు. ఈ జాబితాలో మొయిన్ అలీ, జెజె స్మిట్, హసరంగ, హార్ధిక్ పాండ్యా, సికందర్ రజా, జీషన్ మక్సూద్, మ్యాక్స్‌వెల్, దీపేంద్ర వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో నిలిచారు. -
సూర్యకుమార్ మంచి ఆటగాడే కానీ.. మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టీ20 ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో నిన్న (అక్టోబర్ 7) బంగ్లాదేశ్‌ను పాక్ మట్టికరిపించిన అనంతరం రిజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ సూర్యకుమార్ బ్యాటింగ్ శైలిని ప్రశంసలతో ముంచెత్తాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ టాప్ ర్యాంక్ దిశగా వేగంగా అడుగులేయడంపై స్పందిస్తూ.. సూర్యకుమార్ మంచి ఆటగాడని, అతని ఆటంటే తనకెంతో ఇష్టమని, అతను షాట్లు ఆడే విధానం తనను బాగా ఆకట్టుకుంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభించడానికి, మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడానికి మాత్రం చాలా వ్యత్యాసముంటుందని అభిప్రాయపడ్డాడు. చివరిగా తాను ర్యాంకింగ్స్‌ల గురించి అస్సలు పట్టించుకోనని, జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని గొప్పలు పోయాడు. కాగా, ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ 854 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ 838 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రిజ్వాన్, సూర్యకుమార్‌ల మధ్య 16 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసమే ఉండటంతో సూర్యకుమార్ త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌లో రిజ్వాన్‌ను వెనక్కునెట్టి టాప్ ర్యాంక్‌కు చేరడం ఖాయమని భారత అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో పాక్ సారధి బాబర్ ఆజమ్ (801) సూర్యకుమార్ వెనుక మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (606), విరాట్ కోహ్లి (605), రోహిత్ శర్మ (604) వరుసగా 14, 15, 16 స్థానాల్లో ఉన్నారు. టాప్-10లో సూర్యకుమార్ మినహా మరే ఇతర భారత ఆటగాడు లేకపోవడం విశేషం. -
'సూర్యుడి'లా వెలిగిపోతున్నాడు.. ఆపడం కష్టమే
సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం టీమిండియాలో ఒక సెన్సేషన్. కోహ్లి తర్వాత టీమిండియాకు నమ్మదగిన బ్యాటర్లలో సూర్య ఒకడిగా పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. మంచి టెక్నిక్.. అవసరమైన దశలో దూకుడైన ఆటతీరు.. ఓపిక ఇలా అన్ని కలగలిపి ఒక పరిపూర్ణ బ్యాటర్‌గా తయారవుతున్నాడు. ప్రస్తుతం 'సూర్యుడి'లా వెలిగిపోతున్న అతన్ని ఆపడం ప్రత్యర్థి జట్లకు ఇక కష్టమే. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతను ఎగబాకిన తీరే అందుకు నిదర్శనం. టీమిండియా జట్టులో ఓపెనింగ్ నుంచి మొదలుకొని ఏ స్థానంలోనైనా ఆడే సత్తా తనకు ఉందని నిరూపించుకునే పనిలో ఉన్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన సూర్యకుమార్ మూడో టి20లో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అవకాశం ఇచ్చిన ప్రతీసారి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న సూర్యకుమార్ తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్-2 స్థానానికి చేరుకున్నాడు. టాప్‌లో ఉన్న బాబర్ ఆజంకు, సూర్యకు మధ్య రెండు పాయింట్లు మాత్రమే తేడా. 816 పాయింట్లతో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నిలిచిన సూర్యకుమార్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడితే టాప్ ర్యాంకర్ బాబర్ అజమ్ (పాకిస్తాన్; 818 పాయింట్లు)ను వెనక్కి నెట్టి నంబర్‌వన్ కావడం ఖాయం. ఇప్పుడున్న ఫామ్‌లో సూర్యకు ఇది పెద్ద కష్టమేమి కాదు. అయితే ఏడాది క్రితం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్‌ది 77గా ఉంది. కట్‌చేస్తే.. ఏడాది వ్యవధిలోనే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 77 నుంచి ఏకంగా టాప్-2 స్థానానికి చేరుకున్నాడు. కానీ దీని వెనుక సూర్యకుమార్ కష్టం మాత్రంకచ్చితంగా కనిపిస్తుంది. రానున్న టి20 ప్రపంచకప్ 2022కు టీమిండియాలో సూర్యకుమార్ కీలకం కానున్నాడు. ఒక రకంగా కేఎల్ రాహుల్ స్థానానికే ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు. మరి సూర్యకుమార్ ఏడాదిలో సాధించిన ఒక ఐదు రికార్డుల గురించి ఒకసారి చర్చించుకుందాం. ►ఇటీవలే ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టి20 సిరీస్‌లో సూర్యకుమార్ మెయిడెన్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో మూడో టి20లో సూర్య ఈ ఫీట్ సాధించాడు. 55 బంతుల్లో 117 పరుగులు చేసి టీమిండియా తరపున టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు అందుకున్నాడు. ►ఇక టి20 మ్యాచ్‌లో టీమిండియా తరపున నాలుగో నెంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు కేఎల్ రాహుల్ మాత్రమే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదాడు. ►ఇంగ్లండ్‌పై చేసిన తొలి సెంచరీతోనే సూర్యకుమార్ ఆస్ట్రేలియా స్టార్ మ్యాక్స్‌వెల్ రికార్డును బద్దలు కొట్టాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 117 పరుగులు చేసిన సూర్యకుమార్.. 2019లో టీమిండియాపై మ్యాక్స్‌వెల్ నాలుగో స్థానంలో వచ్చి 113 నాటౌట్ రికార్డును సూర్యకుమార్ తుడిచిపెట్టేశాడు. ►ఇక తాజాగా వెస్టిండీస్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా సూర్య నిలిచాడు. విండీస్‌తో మూడో టి20లో సూర్య 44 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇంతకముందు రిషభ్ పంత్(65*) అత్యధిక స్కోరు సాధించిన తొలి బ్యాటర్‌గా ఉన్నాడు. తాజాగా పంత్‌ను సూర్య అధిగమించాడు. ►సూర్య కుమార్ ఇప్పటివరకు టి20ల్లో అన్ని లీగ్‌లు కలిపి 201 మ్యాచ్‌లాడి 4379 పరుగులు సాధించాడు. చదవండి: Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ బాబర్ ర్యాంకుకు ఎసరుపెట్టిన సూర్య! నెంబర్ 1 స్థానానికి చేరువలో! -
Babar Azam: కోహ్లి రికార్డు బ్రేక్ చేశారు కదా! ఏదీ! అబ్బో బిల్డప్ మామూలుగా లేదు!
Trolls On Babar Azam Which One On Breaking Kohli Record: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పటికే పలు రికార్డులు సృష్టించాడు. ఐసీసీ పురుషుల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇటీవలి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టకున్న బాబర్ ఆజమ్ సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యధిక కాలం నంబర్ 1 స్థానంలో ఉన్న బ్యాటర్‌గా నిలిచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో కూడా కోహ్లి పేరిట ఉన్న పలు రికార్డులను బాబర్ ఆజం బ్రేక్ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ప్రెస్మీట్లో ఎదురైన ప్రశ్నకు బాబర్ స్పందించిన విధానం వైరల్ అవుతోంది. కోహ్లి రికార్డు అధిగమించారు కదా అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా.. ఏ రికార్డు అంటూ బాబర్ బదులిచ్చాడు. ఇంతలో తన తాజా రికార్డు (అత్యధిక కాలం నంబర్ 1 స్థానం) గుర్తుకు వచ్చి.. ‘‘ఇందుకు నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. నా అద్భుత ప్రదర్శనల వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంది’ అని చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉన్నా బాబర్ ఆజమ్ ఇలా స్పందించడంపై కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘కోహ్లి రికార్డులన్నీ బద్దలు కొట్టినట్లు తెగ బిల్డప్ ఇస్తున్నావు.. ఏవో కొన్ని రికార్డులు అధిగమించినంత మాత్రాన తనను దాటేసినట్లే అనుకోవద్దు. నువ్వు ఓపెనింగ్ బ్యాటర్‌వి.. కోహ్లి అలా కాదు. ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్లోనే కాదు టెస్టు క్రికెట్లోనూ కోహ్లి ది బెస్ట్ అని గుర్తుపెట్టుకో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ.. సాహసోపేతమైన నిర్ణయం! బహుశా అందుకేనేమో! -
ఏకంగా 108 స్థానాలు ఎగబాకిన దినేశ్ కార్తిక్.. టాప్10లోనే ఇషాన్
ఐసీసీ బుధవారం ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో ఫినిషర్‌గా తనదైన పాత్ర పోషించిన కార్తిక్ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ఒకేసారి 108 స్థానాలు ఎగబాకి 392 పాయింట్లతో 87వ స్థానంలో(టాప్ 100) నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 55 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆపై టీమిండియా సిరీస్‌లో 2-2తో సమంగా నిలిపిన కార్తిక్ బెస్ట్ ఫినిషర్‌గా పేరు పొంది రానున్న టి20 ప్రపంచకప్ 2022కు కీలకంగా మారాడు. ఇక ప్రొటీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం కావడంతో ట్రోపీని ఇరుజట్లు సంయుక్తంగా పంచుకున్నాయి.ఇక టీమిండియా నుంచి ఇషాన్ కిషన్ మాత్రమే టాప్-10లో కొనసాగుతున్నాడు. గత వారం ఏడో స్థానంలో ఉన్న ఇషాన్.. ఒక స్థానం మెరుగుపరుచుకొని 703 పాయింట్లతో డెవన్ కాన్వే(న్యూజిలాండ్)తో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు అర్థసెంచరీలతో 206 పరుగులు చేశాడు. ఇక తొలి ఐదు స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. బాబర్ ఆజం(818 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. మహ్మద్ రిజ్వాన్(794 పాయింట్లు) రెండో స్థానంలో.. ఐడెన్ మార్క్రమ్(757 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో చహల్ మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో నిలవగా.. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. Players are jostling for spots in the latest @MRFWorldwide T20I men's player rankings 📈 More 👉 https://t.co/ksceq8SPGY pic.twitter.com/1pFif8wMNH — ICC (@ICC) June 22, 2022 చదవండి: టోర్నీకి ఎంపిక చేయలేదని యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం అర్థ సెంచరీతో ఆకట్టుకున్న జైశ్వాల్.. తొలి రోజు ముగిసిన ఆట -
టీమిండియా పరువు కాపాడిన కేఎల్ రాహుల్.. ఆ జాబితాలో ఒకే ఒక్కడు..!
దుబాయ్: ఐసీసీ బుధవారం (ఏప్రిల్ 13) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్ల హవా కొనసాగగా.. టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. పాక్ ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటగా.. భారత క్రికెటర్లు క్రితంతో పోలిస్తే తమతమ ర్యాంకులను దారుణంగా కోల్పోయి టాప్ 10లో కనిపించకుండాపోయారు. బ్యాటింగ్ విభాగంలో పాక్ కెప్టెన్ బాబార్ ఆజమ్ (818) అగ్రస్థానాన్ని, అదే జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (794) మూడో స్థానాన్ని పదిలం చేసుకోగా, ఈ విభాగంలో టాప్ 10లో (పదో ర్యాంక్) ఉన్న ఏకైక భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ (646) టీమిండియా పరువు కాపాడాడు. Latest ICC T20I Batting Rankings sees Babar Azam still at number 1 #Cricket pic.twitter.com/nYknYuvpiv — Saj Sadiq (@SajSadiqCricket) April 13, 2022 ఈ జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్క్రమ్ (796) రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ (728), కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (703), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (692), సౌతాఫ్రికా నయా సెన్సేషన్ డస్సెన్ (669), న్యూజిలాండ్ వెటరన్ ఓపెనర్ గప్తిల్ (658), శ్రీలంక ప్లేయర్ పథుమ్ నిస్సంక (654) వరుసగా 4 నుంచి 9 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ 633 రేటింగ్ పాయింట్లతో 14వ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ 16, 19 స్థానాల్లో నిలిచారు. Plenty of movement in the latest @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is 🔢 More 👇 — ICC (@ICC) April 13, 2022 బౌలింగ్, ఆల్‌రౌండర్ కేటగిరీల విషయానికొస్తే.. ఈ రెండు విభాగాల టాప్ 10 జాబితాల్లో టీమిండియా ఆటగాళ్లు కనుమరుగైపోయారు. బౌలింగ్ కేటగిరీలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంషీ 784 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఆదిల్ రషీద్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా, రషీద్ ఖాన్, వనిందు హసరంగ, ఎన్రిచ్ నోర్జే, ముజీబుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్, షాహీన్ అఫ్రిది టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా నుంచి భువనేశ్వర్ కుమార్ (586 పాయింట్లతో 18వ స్థానం) అత్యుత్తమ ర్యాంకింగ్ సాధించాడు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విభాగపు టాప్ 10లోనూ టీమిండియా నుంచి ఒక్కరికీ చోటు దక్కలేదు. అఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షకీబుల్ హసన్, మొయిన్ అలీ, జేజే స్మిట్, లియామ్ లివింగ్‌స్టొన్, రోహన్ ముస్తపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జీషన్ మక్సూద్, ఎయిడెన్ మార్క్రమ్, దీపేంద్ర టాప్ 10లో ఉన్నారు. ఈ విభాగపు టాప్ 20లో కూడా టీమిండియా నుంచి ఒక్కరూ లేరు. చదవండి: సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. సుందర్ స్థానాన్ని భర్తీ చేయనున్న స్టార్ ఆల్‌రౌండర్ -
రాకెట్ వేగంతో దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్
ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్లు రాకెట్ వేగంతో దూసుకొచ్చారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనలకు గాను ఈ ఇద్దరు ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా పైకి ఎగబాకారు. ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన సూర్యకుమార్ 35 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకోగా, వెంకటేష్ అయ్యర్ ఏకంగా 203 స్థానాలు మెరుగుపర్చుకుని 115వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 10వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లు తొలి రెండు స్థానాలను కాపాడుకున్నారు. ఇక బౌలర్లు, ఆల్ రౌండర్ల విషయానికొస్తే.. ఈ విభాగపు టాప్-10 జాబితాల్లో ఏ ఒక్క టీమిండియా క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 20వ ర్యాంక్‌కే అత్యుత్తమం. చదవండి: ఐపీఎల్లో అన్‌సోల్డ్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం.. ఆ వెనుకే 7.75 కోట్ల ఆటగాడు! -
ఆరేళ్ల తర్వాత ఇదే తొలి సారి.. రెండో కెప్టెన్‌గా రోహిత్
ఆరేళ్ల తర్వాత టీ20ల్లో నెం1 జట్టుగా భారత్ అవతరించింది. ఈడెన్ గార్టెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో గెలుపొందిన టీమిండియా.. ఈ ఘనత సాధించింది. కాగా గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా టీ 20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇక భారత జట్టును టీ20ల్లో నెం1 గా నిలిపిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. అంతకు ముందు 2016లో మహేంద్ర సింగ్ ధోని భారత జట్టును టీ20ల్లో నెం1గా నిలిపాడు. ఇప్పుడు రోహిత్ ఈ ఘనత సాధించాడు. కాగా రోహిత్ టీ20ల్లో భారత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వరుసగా రెండో టీ20 సిరీస్ విజయం. అదే విధంగా టీ20 ఫార్మాట్లో మూడు లేదంటే అంతకంటే ఎక్కువ సిరీస్‌లను వైట్‌వాష్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇక స్వదేశంలో విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. 270 పాయింట్లు సాధించి ఇంగ్లండ్‌ను వెనుక్కి నెట్టి నెం1 గా నిలిచింది. 269 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్ధానంలో ఉంది. చదవండి: Wriddhiman Saha: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు.. రంగంలోకి బీసీసీఐ..! ‘అతడు కాంట్రాక్ట్ ప్లేయర్..’ -
అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్న కేఎల్ రాహుల్
KL Rahul Moves To Fourth In T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ఓ స్థానానికి మెరుగుపర్చుకుని నాలుగో ర్యాంకుకు ఎగబాకాడు. రాహుల్ ఖాతాలో ప్రస్తుతం 729 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. త్వరలో విండీస్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20లో రాణిస్తే.. టీ20 ర్యాంకింగ్స్ అగ్రపీఠం కేఎల్ రాహుల్ వశం కావడం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ జాబితాలోని టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్ శర్మ(11), విరాట్ కోహి(10)లు.. తమతమ స్థానాలను నిలబెట్టుకోగా.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో, అదే దేశానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 20వ ర్యాంకులో ఉండగా జస్ప్రీత్ బుమ్రా 26వ స్థానానికి పడిపోయాడు. Big gains for England's Moeen Ali in the latest update of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings for all-rounders 💪More details 👉 https://t.co/s1pyiOGe63 pic.twitter.com/Q10xJcuEcI— ICC (@ICC) February 2, 2022 శ్రీలంక స్పిన్నర్ హసరంగ, సౌతాఫ్రికా బౌలర్ షంసీ, ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ వరుసగా ఒకటి నుంచి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ జాబితాలో అఫ్ఘాన్ ఆటగాడు మహ్మద్ నబీ, బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్‌లు తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. టాప్ 10 ఆల్రౌండర్లలో టీమిండియా ఆటగాళ్లు ఒక్కరు కూడా లేరు. చదవండి: చియాన్ విక్రమ్‌ను కలిసిన ధోని.. "మహాన్" కోసమే అంటున్న నెటిజన్లు