ఐసీసీ టి20 ర్యాంకింగ్స్
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. ర్యాంకింగ్స్‌లోనూ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ 130 రేటింగ్స్ పాయింట్లతో టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంక కూడా 130 పాయింట్లే కలిగి ఉన్నప్పటికీ దశాంశ స్థానాల తేడాతో టీమిండియా అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
ఇక వెస్టిండీస్ ఒక స్థానం ఎగబాకి ఐదో ర్యాంకుకు చేరుకోగా, ఆస్ట్రేలియా ఓ స్థానం దిగజారి ఆరో ర్యాంకుకు పడిపోయింది. పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో కోహ్లి మూడో ర్యాంకుకు దూసుకెళ్లగా, బౌలర్ల జాబితాలో అశ్విన్ ఆరో ర్యాం కుతో తొలిసారి టాప్-10లో చోటు సంపాదించాడు.
ఐదో ర్యాంకు నిలబెట్టుకున్న మిథాలీరాజ్
మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ మిథాలీ తన ఐదో ర్యాంకును నిలబెట్టుకుంది. అయితే పూనమ్ ఒక స్థానం దిగజారి ఎనిమిదో ర్యాంకుకు పడిపోగా, హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు మెరుగుపరచుకొని తొమ్మిదో ర్యాంకుకు చేరింది.
భారత్‌దే ‘టాప్’
Published Thu, Apr 3 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM
Advertisement
Advertisement