టాప్టెన్లో మిథాలీ, పూనమ్, హర్మన్‌ప్రీత్
దుబాయ్: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ టీ20 ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో నిలిచింది. భారత్ తరపున ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇండియా బ్యాట్స్‌విమెన్ పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్టెన్లో చోటు దక్కించుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో 646 పాయింట్లతో మిథాలీ 5వ స్థానంలో నిలిచింది.
హర్మన్‌ప్రీత్ రెండు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకు దక్కించుకుంది. పూనమ్ 8వ ర్యాంకులో నిలిచింది. ఏ ఇతర జట్టు నుంచి కూడా ముగ్గురు బ్యాట్స్‌విమెన్ టాప్టెన్లో లేకపోవడం గమనార్హం. బౌలింగ్ విభాగంలో భారత్ తరపున జులన్ గోస్వామి ఒక్కరే టాప్ 20లో నిలిచింది. రెండు స్థానాలు పడిపోయి ఆమె 17వ ర్యాంక్లో నిలిచింది. మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆల్రౌండర్ లిస్టులో శ్రీలంక కెప్టెన్ సిరివర్థనే అగ్రస్థానం దక్కించుకుంది.