భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టీ20ల్లో ఓ భారీ రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు అత్యంత సమీపంలో ఉంది. శ్రీలంకతో రేపటి నుంచి (జూన్ 23) ప్రారంభంకాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హర్మన్ మరో 45 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనుంది.
121 టీ20ల్లో 103 స్ట్రయిక్ రేట్‌తో 2319 పరుగులు చేసిన హర్మన్ శ్రీలంకతో సిరీస్‌లో మరో 45 పరుగులు చేస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును (2364) అధిగమిస్తుంది. మిథాలీ రాజ్ 89 మ్యాచ్‌ల్లో 17 అర్ధ సెంచరీల సాయంతో 37.52 సగటున 2364 పరుగులు సాధించగా.. హర్మన 121 టీ20ల్లో సెంచరీ, 6 అర్ధ సెంచరీల సాయంతో 26.35 సగటున పరుగులు సాధించింది.
ఇదిలా ఉంటే, భారత మహిళా జట్టు శ్రీలంక పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. జూన్ 23, 25, 27 తేదీల్లో డంబుల్లా వేదికగా మొత్తం టీ20లు జరుగనుండగా.. జులై 1, 4, 7 తేదీల్లో పల్లెకెలె వేదికగా వన్డే సిరీస్ జరుగనుంది.
చదవండి: మిథాలీరాజ్ రిటైర్మెంట్.. కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
Comments
Please login to add a commentAdd a comment