
భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై పలు సందేహాలు వచ్చాయి. హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు స్మృతి మంధాన పేర్లు ఎక్కువగా వినిపించాయి. కాగా కెప్టెన్‌గా ఇంతకముందు అనుభవం ఉన్న హర్మన్‌ప్రీత్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. శ్రీలంకతో జరగనున్న వన్డే, టి20 సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను టీమిండియా మహిళా కెప్టెన్‌గా నిర్ణయింది. దీంతోపాటు లంకతో జరగనున్న వన్డే, టి20 సిరీస్‌లకు వేర్వేరుగా జట్లను ప్రకటించింది.
జూన్ 23 నుంచి మొదలయ్యే శ్రీలంక పర్యటనలో భారత మహిళా జట్టు.. మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇక నాలుగేళ్లుగా టి20 కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌లకు వన్డే కెప్టెన్‌గా వ్యవహరించింది. తాజాగా మిథాలీ రిటైర్మెంట్‌తో వన్డే కెప్టెన్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనుంది.
శ్రీలంకతో వన్డే సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా, హర్లీన్ డియోల్
టి20 సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్
చదవండి: Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు..
ప్రొటీస్‌తో టి20 సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరం.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
Comments
Please login to add a commentAdd a comment