Poonam Raut
-
అంపైర్ ఔటివ్వలేదు.. పెవిలియన్ చేరి మనసులు దోచుకుంది
Punam Raut Walks Despite Being Given Not Out.. ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో టీమిండియా బ్యాటర్స్ ఒకేరోజు రెండు అద్భుతాలు చేసి చూపించారు. ఆసీస్ గడ్డపై సెంచరీ బాదిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గా.. తొలి పింక్ బాల్ టెస్టులోనే శతక్కొట్టిన స్మృతి మంధన చరిత్ర సృష్టించగా.. మరో టీమిండియా బ్యాటర్ పూనమ్ రౌత్ అభిమానుల మనసులు గెలుచుకుంది. అంపైర్ ఓటవ్వికున్నా తనకు తానుగా క్రీజు వీడి క్రీడాస్పూర్తి ప్రదర్శించింది. విషయంలోకి వెళితే.. పింక్‌బాల్ టెస్టులో భాగంగా ఆట రెండో రోజు పూనమ్ రౌత్ 36 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 81వ ఓవర్లో మొలినుక్స్ వేసిన నాలుగో బంతిని పూనమ్ ఫ్లిక్ చేయగా.. కీపర్ హీలే దానిని అందుకుంది. అంపైర్‌కు అప్పీల్ చేయగా అతను ఔట్ కాదంటూ సిగ్నల్ ఇచ్చాడు. చదవండి: Smriti Mandhana: చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో రికార్డు శతకం.. కోహ్లి తర్వాత..! అయితే రౌత్ మాత్రం బంతి తన బ్యాట్‌కు తగిలిందని నిర్థారణకు వచ్చి అంపైర్ నిర్ణయం చూడకుండానే వాకౌట్ చేసింది. ఈ చర్యతో అంపైర్‌తో పాటు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.. అనంతరం క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన పూనమ్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా స్వయంగా ట్విటర్లో షేర్ చేసింది. ''నమ్మశక్యం కాని విషయం.. పూనమ్ రౌత్ ఔట్ కాదని అంపైర్ అన్నాడు.. కానీ ఆమె పెవిలియన్‌కు చేరింది.. సూపర్ పూనమ్ రౌత్ అంటూ క్యాప్షన్ జత చేసింది. పూనమ్ రౌత్ చేసిన పనిని మెచ్చకుంటున్న అభిమానులు ఆమె క్రీడాస్పూర్తిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇక టీమిండియా రెండో రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. క్రీజ్‌లో దీప్తి శర్మ(12), తానియా భాటియా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో సోఫి మోలినెక్స్ 2, ఆష్లే గార్డనర్, ఎలైస్ పెర్రీ తలో వికెట్ పడగొట్టగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(30) రనౌటైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(31), పూనమ్ రౌత్(36) పర్వాలేదనిపించగా, యస్తికా భాటియా(19) నిరాశపరిచింది. అంతకుముందు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: Ashes Series: మిమ్మల్ని ఎవరూ రమ్మని బలవంతం చేయడం లేదు Unbelievable scenes 😨 Punam Raut is given not out, but the Indian No.3 walks! #AUSvIND | @CommBank pic.twitter.com/xfAMsfC9s1 — cricket.com.au (@cricketcomau) October 1, 2021 -
పూనమ్ 136 నాటౌట్
సాక్షి, గుంటూరు వెస్ట్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో పూనమ్ రౌత్ (160 బంతుల్లో 136 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకంతో మెరిసింది. ఫలితంగా రైల్వేస్ వరుసగా ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం సౌరాష్ట్రతో మ్యాచ్‌లో రైల్వేస్ 163 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత రైల్వేస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలో దిగిన పూనమ్ తొలి వికెట్‌కు శ్వేత (45; 8 ఫోర్లు)తో కలిసి 93 పరుగులు జోడించింది. అనంతరం రైల్వేస్ బౌలర్లు స్నేహ రాణా (5/10), రాజేశ్వరి (3/12), పూనమ్ యాదవ్ (2/19) ధాటికి సౌరాష్ట్ర 39.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. -
మళ్లీ ఓడారు...
-
మళ్లీ ఓడారు...
►ఆసీస్ చేతిలో భారత్ పరాజయం ►పూనమ్ రౌత్ సెంచరీ వృథా ►రాణించిన మిథాలీ రాజ్ ►కివీస్ మ్యాచ్‌పైనే భారత్ సెమీస్ ఆశలు దక్షిణాఫ్రికా చేతిలో భంగపడిన భారత్... తాజాగా ఆస్ట్రేలియా చేతిలోనూ దారుణ పరాజయం చవిచూసింది. భారత ఓపెనర్ పూనమ్ రౌత్ సెంచరీతో అదరగొట్టినా... మిథాలీ రాజ్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించినా... తుది ఫలితం మాత్రం భారత్‌ను నిరాశపరిచింది. ఈ ఓటమితో మిథాలీ సేనకు సెమీస్ బెర్త్ క్లిష్టమైంది. న్యూజిలాండ్‌తో ఈనెల 15న జరిగే చివరి లీగ్ మ్యాచ్ ఫలితంపైనే టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీస్ స్థానం ఖాయమవుతుంది. ఒకవేళ వర్షం వల్ల రద్దయితే మాత్రమే భారత్ సెమీస్‌కు చేరుకుంటుంది. బ్రిస్టల్: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో మిథాలీ సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై జయభేరి మోగించి సెమీఫైనల్‌కు చేరింది. మొదట భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (136 బంతుల్లో 106; 11 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (114 బంతుల్లో 69; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. తర్వాత ఆస్ట్రేలియా 45.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసి గెలిచింది. మెగ్ లానింగ్ (88 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గెలిపించింది. ఎలీస్ పెర్రీ (67 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు) కూడా బాధ్యతాయుతంగా ఆడింది. ఆడింది ఇద్దరే... బ్యాటింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఓపెనర్ పూనమ్ రౌత్, కెప్టెన్ మిథాలీ రాజ్ మినహా ఇంకెవరూ బాధ్యత తీసుకోలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అసాధారణ ఆటతీరు కనబరిచిన స్మృతి మంధన (3) వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 9 పరుగులకే వికెట్ కోల్పోయిన భారత ఇన్నింగ్స్‌ను పూనమ్, మిథాలీ చక్కదిద్దారు. మరో వికెట్ కోల్పోకుండా జట్టు స్కోరును 100 పరుగులకు చేర్చారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 166 పరుగుల వద్ద మిథాలీ... బీమ్స్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది. సెంచరీ పూర్తయ్యాక పూనమ్ రౌత్ ఔట్ కాగా... ఆ తర్వాత వచ్చిన వారిలో హర్మన్‌ప్రీత్ (23) రెండంకెల స్కోరు చేసింది. వేద (0), సుష్మ (6), జులన్ గోస్వామి (2) నిరాశపరిచారు. గెలిపించిన లానింగ్, పెర్రీ కష్టసాధ్యం కాని 227 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు బోల్టన్ (36), మూని (45) తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం ఇవ్వగా... తర్వాత కెప్టెన్ లానింగ్, పెర్రీ మరో వికెట్ పడకుండా జట్టును నడిపించారు. పేలవమైన భారత బౌలింగ్‌పై ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 124 పరుగులు జోడించారు. సెమీస్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లూ సెమీస్ చేరాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు (104/2)) 8 వికెట్ల తేడాతో శ్రీలంక (101 ఆలౌట్)పై గెలుపొందగా... ఇంగ్లండ్ (284/9) 75 పరుగుల తేడాతో న్యూజిలాండ్ (209 ఆలౌట్)పై విజయం సాధించింది. ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఖాతాలో 10 పాయింట్లు... దక్షిణాఫ్రికా ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. భారత్ ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో, న్యూజిలాండ్ ఏడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. -
వార్మప్‌లో భారత్‌కు నిరాశ
డెర్బీ: ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు తేలిపోయింది. డెర్బీ కౌంటీ గ్రౌండ్లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై గెలిచింది. టాస్ నెగ్గిన భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగి 45.1 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ పూనమ్ రౌత్ (65 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), మోనా మేశ్రమ్ (57 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (21) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 26.3 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. రాచెల్ ప్రిస్ట్ (57 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1సిక్స్) అర్ధ సెంచరీతో రాణించింది. మిగతా వారిలో సుజి బేట్స్ (30), కటే మార్టిన్ (29 నాటౌట్), సోఫి డివైన్ (29 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 2 వికెట్లు, ఏక్తా బిస్త్ ఒక వికెట్ పడగొట్టారు. -
రికార్డులని వాట్సాప్ చూశాకే తెలిసింది
దీప్తి, పూనమ్ వ్యాఖ్య ముంబై: భారత మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్‌లు తాము సాధించింది రికార్డులని వాట్సాప్ చూస్తేగానీ తెలుసుకోలేకపోయారు. అదికూడా రెండు గంటలు ఆలస్యంగా వారు తమ ప్రపంచ రికార్డు భాగస్వామ్యం గురించి తెలుసుకొని సంబరపడ్డారు. ‘నిజాయితీగా చెప్పాలంటే అది ఓ ప్రపంచ రికార్డు భాగస్వామ్యమని తెలియదు’ అని దీప్తి, పూనమ్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన వన్డేలో దీప్తి, పూనమ్‌లు తొలి వికెట్‌కు 320 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే మ్యాచ్ ముగిసి దాదాపు రెండు గంటలయ్యాక వీళ్లిద్దరు రిలాక్స్‌గా వాట్సాప్‌లోని భారత టీమ్ గ్రూప్‌ను చూశారు. అందులో ప్రశంసల మెసెజ్‌లు వరదలా వచ్చిపడ్డాయి. రికార్డు, ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు అభినందనలని అందులో పేర్కొన్నారు. దీంతో అప్పడుగానీ తమ భాగస్వామ్యం చరిత్ర లిఖించిందని తెలుసుకోలేకపోయారు. -
అదరగొట్టారు
⇒దీప్తి శర్మ, పూనమ్ రౌత్ సెంచరీలు ⇒తొలి వికెట్‌కు 320 పరుగులు ⇒జోడించిన భారత ఓపెనర్లు ⇒వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం ⇒ఐర్లాండ్‌పై 249 పరుగులతో ఘనవిజయం పోట్చెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): భారత మహిళా ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ పరుగుల బీభత్సం సృష్టించారు. వీరిద్దరి ఆటతీరుతో తొలుత సెంచరీలు, తర్వాత రికార్డులు దిగివచ్చాయి. దీంతో భారత మహిళల జట్టు 249 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ జట్టుపై జయకేతనాన్ని ఎగురవేసింది. నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో భారత అమ్మాయిలు గత రికార్డుల్ని బద్దలు కొట్టారు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 358 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు దీప్తి (160 బంతుల్లో 188; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), పూనమ్ (116 బంతుల్లో 109; 11 ఫోర్లు) శతకాలతో చెలరేగారు. తొలి వికెట్‌కు 320 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం. దీప్తి 12 పరుగుల స్వల్ప తేడాతో అరుదైన డబుల్ సెంచరీ అవకాశాన్ని కోల్పోయింది. అయితే ఐర్లాండ్ బౌలర్లను మాత్రం ముప్పుతిప్పలు పెట్టింది. ఐర్లాండ్ కెప్టెన్ లౌరా డిలనీ ఏడుగురు బౌలర్లను రంగంలోకి దింపినా భారత ఓపెనర్ల ధాటిని నిలువరించలేకపోయారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 40 ఓవర్లలో 109 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టంతా కలిసి పూనమ్ రౌత్ ఒక్కరే చేసిన స్కోరును చేయగలిగింది. ఓపెనర్ వాల్డ్రన్ చేసిన 35 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్. మిగతా వారిలో జెన్నిఫర్ గ్రే 26 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్ఉమెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4, శిఖా పాండే 3 వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ⇒దీప్తి, పూనమ్ తొలి వికెట్‌కు 320 పరుగులు జోడించారు. వన్డే క్రికెట్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. సారా టేలర్, కరోలైన్ అట్కిన్స్ (ఇంగ్లండ్) 2008లో లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాపై తొలి వికెట్‌కు జతచేసిన 268 పరుగుల భాగస్వామ్యం తెరమరుగైంది. ⇒పరుగుల పరంగా భారత్‌కిదే భారీ విజయం. పాక్‌పై 2008లో 207 పరుగుల తేడాతో నెగ్గడం ఇప్పటివరకు భారత్ బెస్ట్‌గా ఉంది. ⇒ భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్ఉమెన్గా దీప్తి శర్మ గుర్తింపు పొందింది. జయా శర్మ (138 నాటౌట్; పాక్‌పై 2005లో) పేరిట ఉన్న రికార్డును దీప్తి బద్దలు కొట్టింది. ⇒ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (27) కొట్టిన బ్యాట్స్ఉమెన్గా దీప్తి నిలిచింది. ⇒వన్డేల్లో భారత్‌కిదే అత్యధిక స్కోరు. 2004లో ధన్బాద్లో వెస్టిండీస్‌పై భారత్ చేసిన (298/2) పరుగులే ఇప్పటిదాకా అత్యధిక స్కోరుగా ఉంది. -
టాప్‌టెన్‌లో మిథాలీ, పూనమ్, హర్మన్‌ప్రీత్
దుబాయ్: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో నిలిచింది. భారత్ తరపున ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇండియా బ్యాట్స్‌విమెన్ పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్‌టెన్‌లో చోటు దక్కించుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 646 పాయింట్లతో మిథాలీ 5వ స్థానంలో నిలిచింది. హర్మన్‌ప్రీత్ రెండు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకు దక్కించుకుంది. పూనమ్ 8వ ర్యాంకులో నిలిచింది. ఏ ఇతర జట్టు నుంచి కూడా ముగ్గురు బ్యాట్స్‌విమెన్ టాప్‌టెన్‌లో లేకపోవడం గమనార్హం. బౌలింగ్ విభాగంలో భారత్ తరపున జులన్ గోస్వామి ఒక్కరే టాప్ 20లో నిలిచింది. రెండు స్థానాలు పడిపోయి ఆమె 17వ ర్యాంక్‌లో నిలిచింది. మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆల్‌రౌండర్ లిస్టులో శ్రీలంక కెప్టెన్ సిరివర్థనే అగ్రస్థానం దక్కించుకుంది.